twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ రెండు తెలుగు చిత్రాలు ఆస్కార్‌ స్క్రీనింగ్‌కి

    By Srikanya
    |

    హైదరాబాద్ : జె.కె భారవి దర్సకత్వంలో కౌశిక్‌ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జగద్గురు ఆదిశంకర'. ఈ సినిమాని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరఫున ఇండియన్‌ పనోరమ విభాగంలో అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవ (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) పురస్కారాలకు, ఉత్తమ విదేశీ భాష చిత్రంగా ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కమిటీకి సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా యూనిట్ గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయికుమార్‌ వచ్చారు.

    సాయి కుమార్ మాట్లాడుతూ ''యువత ముందుకొస్తే ఏదైనా సాధించొచ్చుననేదే మా సినిమా ప్రధానాంశం. సినిమాని ఇండియన్‌ పనోరమ, ఆస్కార్‌ ఉత్సవాల స్క్రీనింగ్‌ కమిటీకి పంపించాలని నిర్ణయించడం ఆనందదాయకం'' అన్నారు. ''ఇది సాధారణమైన సినిమా కాదు. యువతకు ఓ వ్యక్తిత్వ వికాసాన్ని అందించే చిత్రము''అన్నారు.

    Jagadguru aadi shankara selected Oscar screening committee

    తనికెళ్ల భరణి రూపొందించిన 'మిథునం' సినిమాని కూడా ఇండియన్‌ పనోరమ విభాగం కింద ఐఎఫ్‌ఎఫ్‌ఐ పురస్కారానికి, ఉత్తమ విదేశీ భాష చిత్రం విభాగంలో ఆస్కార్‌ పురస్కారాల స్క్రీనింగ్‌ కమిటీకి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సిఫార్సు చేసింది. శ్రీరమణ రచించిన 'మిథునం' నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి, ప్రధాన పాత్రలు పోషించారు.

    'మంజునాథ', 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' వంటి ఆధ్యాత్మిక భక్తిరసాత్మక పరిమళాలు వెదజల్లిన దర్శకరచయిత జె.కె. భారవి. రచయితగా మరపురాని చిత్రాలను అందించిన ఆయన యువతలో చైతన్యాన్ని రగిల్చి హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడిన ఆదిశంకరాచార్యుల జీవితం నేపథ్యంలో ఆధ్యాత్మిక అద్భుతంగా తెరకెక్కించిన సినిమా 'జగద్గురు ఆదిశంకర'. నారా జయశ్రీదేవి నిర్మించిన ఈ సినిమా ..స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందువచ్చింది. అద్వైత సిద్ధాంతం గురించి ప్రపంచానికి చాటి చెప్పిన ఆదిశంకరుడి కథ ఇది. ఇందులో ఆయన జగద్గురుగా ఎలా ఎదిగారనేది చూపిస్తున్నారు. ముఫ్పైరెండేళ్ల వయసులోనే కాశీ నుంచి కన్యాకుమారి వరకూ నాలుగు సార్లు పాదయాత్ర చేసిన ఆది శంకరుని ప్రయాణంలో ఆయన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు, ఆయనకు తారసపడిన సంఘటనల నేపథ్యంలో సాగే కథ ఇది. చండాలుడు (నాగార్జున), రుద్రాక్షస్వామి (మోహన్‌బాబు) పాత్రలు కూడా కీలకమే.

    English summary
    It's Oscar nominations time again but this time around, the screening of films to select India's nomination may not happen in Hyderabad. Jagadguru Aadi Shankara,Mithunam selected Oscar screening commitee and also for Indian Panorama. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X