twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జగపతి బాబు న్యూ బిజినెస్ ‘క్లిక్ సినీ కార్ట్’...అసలు ఏమిటి ఇది?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు జ‌గ‌ప‌తిబాబు క్లిక్ సినీ కార్ట్ పేరుతో ఓ వెబ్ సైట్ ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఈ వెబ్ సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దాస‌రి నారాయ‌ణ‌రావు, ముర‌ళీమోహ‌న్‌, క‌ర్ణాట‌క మాజీ ముఖ్యమంత్రి కుమార‌స్వామి గౌడ్‌, తెలంగాణ ఐటీ సెక్ర‌ట‌రీ జ‌యేష్ రంజన్(ఐఏఎస్) ముఖ్య అతిథులుగా విచ్చేసారు.

    'క్లిక్ సినీ కార్ట్' వెబ్ సైట్ గురించి, దాన్ని ప్రారంభించడానికి గల కారణాలను జ‌గ‌ప‌తిబాబు వివరిస్తూ...'కొత్త‌ నటీనటులను ఎంక‌రేజ్ చేసే ఉద్దేశంతో దీన్ని మొద‌లుపెట్టాం. సెల్ఫీ తీసి పోస్ట్ చేస్తే చాలు. ఉచిత‌మే. అదే విధంగా నిర్మాత‌లుగా రావాల‌నుకున్న‌వారు కూడా మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించ‌వ‌చ్చు' అని జగపతి బాబు తెలిపారు.

    'ఈ సైట్‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా డెవ‌ల‌ప్ చేస్తాం. ప‌దేళ్ల ప్లాన్ ఉంది మాకు. ఇది సినిమాకు సంబంధించి ఒన్ స్టాప్ షాప్ అవుతుంది. నామీద నాకు న‌మ్మ‌కం ఎక్కువ‌. నేను ఇప్ప‌టిదాకా ఏదైనా తిన్న‌గానే సంపాదించాను. దీనికి యుఎస్‌లోనూ బ్రాంచ్ ఉంది. శ్రీధ‌ర్ బండారి, ర‌మేష్ బండారి మాకు అక్క‌డ సాయం చేస్తున్నారు. ఇది కెమెరామేన్ సురేంద్ర‌రెడ్డి బ్రెయిన్ చైల్డ్. డ్యాన్స్ మాస్ట‌ర్ విద్యాసాగ‌ర్ కూడా మాకు స‌హ‌క‌రిస్తున్నారు' అని జగపతి బాబు చెప్పుకొచ్చారు.

    మా నాన్న‌కు రెండు కోరిక‌లు మిగిలిపోయాయి. మా ముగ్గురు సోద‌రుల‌కు అమ్మాయిలే. సో వార‌సుడు లేర‌నే కొర‌త ఆయ‌న‌కు ఉండేది. అలాగే నాతో హిట్ చేయ‌లేక‌పోయాననే బాధ కూడా ఉండేది. ఇప్పుడు మా జ‌గ‌ప‌తి సంస్థ‌ను రీలాంచ్ చేస్తున్నాం. ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తున్నాం. అందులో ఈ పోర్ట‌ల్‌ నుంచి వ‌చ్చిన వాళ్ల‌ను కూడా తీసుకునే ఉద్దేశాలున్నాయి. మా నాన్న‌కు వార‌సుడు ఈ సంస్థే. ఈ సంస్థ‌లో నేను త‌ప్ప‌కుండా హిట్ కొడ‌తాను. అలా నాన్న‌గారి రెండు కోరిక‌ల‌ను నెర‌వేరుస్తాను అని చెప్పారు.


    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

    మోస పోతున్నారు....

    మోస పోతున్నారు....


    మామూలుగా వారు నేరుగా ప‌రిశ్ర‌మ‌కు వ‌స్తే మోస‌పోయే ‌. ప‌ది రింగులు చేతికి పెట్టుకుని వ‌స్తున్న వారు ఒక్క రింగు కూడా లేకుండా వెన‌క్కి వెళ్ల‌డం నాకు బాగా తెలుసు. చెప్పులు కూడా లేకుండా వెళ్తున్నారు. కానీ మ‌న‌సుంటే సంతోషంగా ఇందులో గెల‌వొచ్చు.

    నాలాంటి వాడికే కష్టం తప్పలేదు

    నాలాంటి వాడికే కష్టం తప్పలేదు


    ఈ వెబ్‌సైట్ ప‌రిశ్ర‌మ‌లోకి రావాలనుకునే వారికి, పరిశ్రమకు చాలా ముఖ్య‌మ‌ని నా భావ‌న‌. వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారి అబ్బాయినే అయిన‌ప్ప‌టికీ నేను 8 నెల‌లు క‌ష్ట‌ప‌డ్డాను. చాలా సార్లు నాలో నేను ఏడ్చుకున్నాను. ఇంత అండ ఉన్న నా ప‌రిస్థితి ఇలా ఉంటే, మిగిలిన వారి స్థితి ఏంటి? అనే ఆలోచ‌న వ‌చ్చింది. దాని ఫ‌లిత‌మే ఈ వెబ్‌సైట్‌

    దాస‌రి మాట్లాడుతూ..

    దాస‌రి మాట్లాడుతూ..


    ప‌రిశ్ర‌మ‌కు కొత్త ర‌క్తం కావాలి. నేను స్వ‌ర్గం న‌ర‌కం సినిమా చేసిన‌ప్పుడు అంద‌రూ కొత్త‌వారితోనే చేశాను. ఆ సినిమా కోసం తిరుప‌తి, విజ‌య‌వాడ‌, వైజాగ్‌, హైద‌రాబాద్‌, కాకినాడ‌లో త‌లా రెండు రోజుల వంతున ఆడిష‌న్స్ చేశాం. ఇప్పుడు కొత్త‌వారు ఎవ‌రూ ద‌ర్శ‌కుల‌ను నేరుగా క‌లిసే ప‌రిస్థితి లేదు. కొత్త నిర్మాత‌లు వ‌చ్చినా వారికి పెద్ద‌వాళ్ల‌తో త‌మ‌కు ప‌రిచ‌యాలున్నాయ‌ని చెప్పి మోసాలు చేసేవారు ఎక్కువ‌వుతున్నారు అన్నారు.

    బావుంది

    బావుంది


    ఇలాంటి పరిస్థితుల నేప‌థ్యంలో ఈ వెబ్‌సైట్‌తో జ‌గ‌ప‌తిబాబు ముందుకు రావ‌డం ఆనందంగా ఉంది. ఈ ఆలోచ‌న ఎప్పుడో రావాల్సింది. జ‌గ‌ప‌తిబాబు నిబ‌ద్ధ‌త‌, క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న న‌టుడు. అలాంటి వారి వ‌ల‌నే ఇలాంటి ప‌నులు సాధ్య‌మ‌వుతాయ‌నిపించి న‌మ్మాను. మ‌న‌లోనూ చాలా మంది ప్ర‌తిభావంతులున్నారు. వారికి ఈ వేదిక ఉపయోగ‌ప‌డుతుంది`` అని అన్నారు.

    జ‌యేష్ రంజ‌న్ మాట్లాడుతూ...

    జ‌యేష్ రంజ‌న్ మాట్లాడుతూ...


    ‘సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఈ సైట్ మ‌రో నౌక‌రీ డాట్ కామ్ లాగా ఉప‌యోగ‌ప‌డాలి`` అని చెప్పారు.

    ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ...

    ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ...


    `సినిమా ఎలా చేయాలో తెలియ‌క చాలా మంది చేతులు కాల్చుకుంటున్నారు. అలాంటి వారికి ఇది ఉత్త‌మ‌మైన వేదిక అవుతుంది. త‌న సినిమా ఫ్లాప్ అయినా దాన్ని ధైర్యంగా చెప్పుకోగ‌ల ధైర్యం ఉన్న న‌టుడు జ‌గ‌ప‌తిబాబు. ఆయ‌న చేసే ఈ ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం కావాలి`` అని చెప్పారు.

    English summary
    Jagapathi Babu has launched a new production company named Click Cine Cart and this launching event is celebrated at Part Hyat in Hyderabad. Murali Mohan, Dasari Narayana Rao, Karnatak leader Kumara Swamy, Telangana IAS Officer Jayesh Ranjan etc have graced this occasion. Jagapathi Babu speaking during this occasion has stated that Click Cine Cart would be a platform for the new talent as well as for the producers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X