Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జగపతి బాబు 'సూర్యాభాయ్' లుక్ అదిరింది!
హైదరాబాద్: ప్రైమ్‌స్టార్ జగపతిబాబు హీరోగా చిన్నారి ఆర్ట్స్, శ్రీ తిరుమల సినిమాస్ పతాకాలపై అర్జున్ వాసుదేవ్ దర్శకత్వంలో రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'సూర్యాభాయ్'. బి.వి. రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఇప్పటి వరకు 3 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ని మే 5 నుండి జరుపనున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం మాట్లాడుతూ..''అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. టైటిల్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో జగపతిబాబు గారి పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పొలిటికల్ సెటైరికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుంది. సెంటిమెంట్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున్ వాసుదేవ్ తీర్చిదిద్దుతున్నారు. ప్రదీప్‌రావత్, షాయాజీషిండే, సుమన్, సాయికుమార్, డి.ఎస్.రావ్, అర్చన ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్ జగపతిబాబుగారి సరసన నటిస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని లావిష్‌గా తెరకెక్కిస్తున్నాము. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్‌డూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. మే 5 నుండి జరిపే చివరి షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. జూన్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసి జూలైలో ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం..''అన్నారు.
ఓ
ప్రముఖ
హీరోయిన్
జగపతిబాబు
సరసన
కథానాయికగా
నటిస్తున్న
ఈ
చిత్రంలో
షాయాజీషిండే,
ప్రదీప్‌రావత్,
సుమన్,
సాయికుమార్,
డి.ఎస్.రావ్,
రాజారవీంద్ర,
ఉత్తేజ్,
పరుచూరి
వెంకటేశ్వరరావు,
దిల్
రమేష్,
అర్చన
తదితరులు
ప్రధాన
పాత్రలు
పోషిస్తున్నారు.
ఈ
చిత్రానికి
ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్:
బి.వి.
రామకృష్ణ,
సంగీతం:
ఆనంద్,
ఆర్ట్:
జె.కె.
మూర్తి,
ఫైట్స్:
నందు,
పి.ఆర్.ఓ.
జిల్లా
సురేష్,
నిర్మాతలు:
రాజేష్
చిన్నారి,
ప్రతాప్
దండెం,
దర్శకత్వం:
అర్జున్
వాసుదేవ్.