twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ పదం తో... సెన్సార్‌ వివాదం,డైరక్టర్ ఫైర్

    By Srikanya
    |

    ముంబై : సినిమాలు సెన్సార్ వద్ద వివాదంలో ఇరుక్కోవటం, తర్వాత రాజీపడటం లేదా రీసెన్సార్ చేయటం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. తాజాగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న ప్రియాంక చోప్రా నటించిన 'జై గంగాజల్‌' చిత్రం సెన్సార్‌ వివాదంలో చిక్కుకుంది.

    ఇటీవల దర్శక, నిర్మాత ప్రకాష్‌ ఝా ఈ చిత్రాన్ని సెన్సార్‌ కోసం పంపారు. సెన్సార్‌ సభ్యులు సినిమాని చూసి 'సాలా' అని ఉపయోగించిన ప్రతి చోట మ్యూట్‌ చేయాలని, అలాగే అభ్యంతరకర పలు సన్నివేశాల్లో 11 కట్స్‌ ఇస్తూ 'యు/ఎ' సర్టిఫికెట్‌ని జారీ చేసింది.

    Jai Gangaajal runs into trouble with Censor Board

    దర్శకుడు మాట్లాడుతూ... అయితే ఈ సర్టిఫికెట్‌ తీసుకునేందుకు దర్శక, నిర్మాత ప్రకాష్‌ ఝా నిరాకరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, 'సాలా' అనే పదం జనం వాడుక భాషలో ఓ భాగమైంది. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జాతికి వ్యతిరేకంగా ఉండే పదాలను నేను ఉపయోగించలేదు. ప్రజలు మాట్లాడుతున్న భాషలో మమేకమైన పదాల్నే ఎంచుకున్నాను. వీటిపై సెన్సార్‌ సభ్యులు అభ్యంతరం తెలపడం హాస్యాస్పదం.


    సమాజంలో నేనూ ఒక బాధ్యతగల దర్శకుడినే. సెన్సార్‌ కోసం ఈచిత్రాన్ని పంపినప్పుడు ఎగ్జామింగ్‌ కమిటీలోని ఇద్దరు సభ్యులు లెక్కకు మించిన కట్స్‌తో 'ఎ' సర్టిఫికెట్‌ వస్తుందని చెప్పగా, మరో ఇద్దరు 'సాలా' అనే పదం ఉపయోగించిన చోట మ్యూట్‌ చేస్తూ 11 కట్స్‌తో 'యు/ఎ ' సర్టిఫికెట్‌ వస్తుందని తెలిపారు.

    వీరి అభిప్రాయాల్లో తేడా ఉండటం వల్ల ఈ చిత్రాన్ని సెంట్రల్‌ సెన్సార్‌బోర్డ్‌ చైర్మన్‌ పహ్లాజ్‌ నిహలానీ దృష్టికి తీసుకెళ్ళగా, ఆయన రివైజింగ్‌ కమిటికి పంపారు. ఆ రివైజింగ్‌ కమిటి తుదిగా 11 కట్స్‌తో 'యు/ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు సుముఖత చూపింది.

    2003లో 'గంగాజల్‌' చిత్రాన్ని రూపొందించాను. అందులో అతి హింసతోపాటు 'సాలా' లాంటి ఎన్నో పదాల్ని ఉపయోగిం చాను. అప్పడు సెన్సార్‌వాళ్ళు కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా 'యు/ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఆ సినిమా వివిధ టెలివిజన్‌ ఛానెళ్ళలో దాదాపు 300 సార్లు ప్రదర్శితమైంది. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు కొత్తగా సెన్సార్‌ వాళ్ళకి రావడం ఆశ్చర్యకరంగా ఉంది.

    బిజెపి ప్రభుత్వం వచ్చాకే ఇటువంటి సమస్యల్ని దర్శక, నిర్మాతలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రసారశాఖ మంత్రిగా రవిశంకర్‌ ప్రసాద్‌ పదవిలోకి వచ్చాక దర్శక, నిర్మాతలకు సెన్సార్‌ సమస్యలు మరింత ఎక్కువగా వస్తున్నాయి' అని తీవ్ర స్వరంతో అన్నారు.

    English summary
    Prakash Jha has denied reports that he made voluntary cuts to his upcoming cop drama Jai Gangaajal to avoid getting an 'A' certificate from the Central Board Of Film Certification (CBFC).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X