» 

ఉదయ్ కిరణ్ ‘జై శ్రీరామ్’ రిలీజ్ ఎప్పుడంటే?

Posted by:

హైదరాబాద్: ఉదయ్ కిరణ్, రేష్మ జంటగా బాలాజీ ఎన్.సాయి దర్శకత్వంలో మల్టీ డైమన్షన్స్ సమర్పణలో ఫైవ్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తేళ్ల రమేష్, ఎన్.సి.హెచ్. రాజేష్ నిర్మిస్తున్న చిత్రం 'జై శ్రీరామ్'. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంక్రాంతి రోజున ఈ సినిమా ఫస్ట్ టీజన్ ను విడుదల చేసారు.

ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ 'ఇప్పటి వరకు అన్ని లవర్ బాయ్ పాత్రలే చేసాను. ఇందులో తొలిసారిగా యాక్షన్ హీరోగా కొత్త బాణీలో కనిపించబోతున్నా. ఈ పన్నెడేళ్ల కెరీర్లో నేను ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో నా కెరీర్ మళ్లీ మలుపు తిరుగుతుంది' అని ఆశాభావం వ్యక్తం చేసారు.

మల్టీ డైమన్షన్ ప్రతినిధి వాసు మాట్లాడుతూ 'ఉదయ్ కిరణ్‌కు ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాంటి సినిమా. మాన్ ని ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కథాకథనాలు చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో పాటలను, ఆఖరి వారంలో చితన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. హరీష్, కళ్యాణ్, ఆదిత్య మీనన్, చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, అలీ, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డాకె, కెమెరా: అక్కినేని వెంకట్, ఆరిఫ్, ఆర్ట్: భాస్కర రాజు, పాటలు: వరప్రసాద్.

Read more about: jai sriram, uday kiran, reshma, జై శ్రీరామ్, ఉదయ్ కిరణ్, రేష్మ
English summary
Uday Kiran new movie Jai Sriram releasing in February. This directed by Balaji. Producer Talla Ramesh is confident that the film will be a big hit. "I was thrilled when Balaji told me the story," Uday Kiran says.
Please Wait while comments are loading...