»   »  జయలలిత గురించి ఈ విషయలు తెలుసా

జయలలిత గురించి ఈ విషయలు తెలుసా

జయలలిత గురించి ఈ విషయలు తెలుసా

Posted by:
Subscribe to Filmibeat Telugu

కుటుంబ పరిస్థితుల వల్ల తల్లి బలవంతంతో తన 15వ యేట జయలలిత సినిమా రంగములోకి ప్రవేశించారు. జయలలిత తొలి సినిమా 'చిన్నడ గొంబె' అనే కన్నడ చిత్రం. ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్.

పాలిటిక్స్ లోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో జయలలిత నటించారు. 1961 నుంచి1980 వరకు ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. నాట్యంలో కూడా ఆమెది అందెవేసిన. తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొంతకాలం పాటు ఏలారు. జయలలిత తొలి తెలుగు సినిమా 'మనుషులు మమతలు'. ఈ సినిమా తర్వాత జయలలిత స్టార్ హీరోయిన్ అయ్యారు.

అలాగే వెండితెరను ఏలిన జయలలితకు ఇష్టమైన, ఎక్కువసార్లు చూసిన సినిమా ఏదో తెలుసా? 'గుండమ్మ కథ'. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆమే స్వయంగా చెప్పారు.
'కాసేపు నవ్వుకోవాలనుకున్నప్పుడు, మనసు తేలిక పడాలనుకున్నప్పుడు నేను చూసే సినిమా గుండమ్మ కథ. ఏ కాస్త సమయం దొరికినా ఆ సినిమా చూడాలనిపిస్తుంది. ఆ చిత్రంలోని పాత్రలన్నీ ఒక ఎత్తైతే, ఒక్క గుండమ్మ మాత్రం ఒక ఎత్తు. నిజంగానే గుండమ్మ అనే ఒకావిడ ఉందనిఅనిపిస్తుంది.

Read more about: jayalalitha
English summary
Jayalalitha telugu movie list
Please Wait while comments are loading...