» 

జయప్రద సినీ వారసుడుగా సిద్ధార్థ తెరంగ్రేటం

Posted by:
 

ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద ప్రస్తుతం సినిమాలకు దూరమై పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఉత్రరప్రదేశ్‌లోని రాంపూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓ తెలుగు టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

త్వరలోనే తన సినీ వారసుడుగా తన సోదరి కుమారుడైన సిద్ధార్థను హీరోగా పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అతను నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని, త్వరలోనే అతడి తెరంగ్రేటానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. తెలుగు నేలపై పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నానని, తెలుగు ప్రేక్షకులు వల్లనే తాను ఈ స్థాయికి ఎదిగానని వెల్లడించింది.

ఎన్టీఆర్, ఆయన కుటుంబం అంటే ఎంతో అభిమానం అని చెప్పున జయప్రద....బాలయ్యకు ఏవిషయంలో అయినా తన సపోర్టు ఉంటుందని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. అయితే తాను ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేనందున రాజకీయాల గురించి మాట్లాడటానికి నిరాకరించారు.

ఏప్రిల్ 3, 1962లో రాజమండ్రిలో జన్మించిన జయప్రద అసలు పేరు లలితారాణి. ఆమె తండ్రి కృష్ణారావు తెలుగు ఫిల్మ్ ఫైనాన్సర్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరును జయప్రదగా మార్చుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే ఆమె స్కూల్ లో ఇచ్చిన డాన్స్ షోను చూసిన ఓ దర్శకుడు ఆమెకు తన 'భూమి కోసం' సినిమాలో 3 నిమిషాలు డాన్స్ చేసే అవకాశం ఇప్పించాడు. అప్పుడు ఆమె కేవలం రూ. 10 పారితోషికం తీసుకుంది. అలా మొదలైన ఆమె సినీ జీవితం...బాలచందర్ 'అంతులేని కథ', కె. విశ్వనాథ్ 'సిరిసిరిమువ్వ' లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారి ఇటు దక్షిణాదితో పాటు, అటు బాలీవుడ్ లోనూ ఓ వెలుగు వెలిగారు.

Read more about: jayaprada, balakrishna, bollywood, జయప్రద, బాలకృష్ణ, బాలీవుడ్
English summary
Jayaprada son Siddharth makes debut in films. Jayaprada confirms this news.
Please Wait while comments are loading...
Your Fashion Voice

Telugu Photos

Go to : More Photos