twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉమన్స్ డే స్పెషల్‌గా యాంకర్ ఝాన్సీ నిర్మించిన చిత్రం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బుల్లితెర యాంకర్, నటి ఝాన్సీ నిర్మాతగా మారి ఓ సినిమాను నిర్మించిన సంగతి తెలసిందే. షీతల్ మోర్జారియా దర్శకత్వంలో ఎ బనాయేంగే ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై రేఖ పప్పుతో కలిసి ఆంగ్లంలో 'ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్రిథింగ్' చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈచిత్రం విడుదల తేదీ ఖరారైంది.

    కేవలం 62 నిమిషాల నిడివిగల ఈచిత్రాన్ని మార్చి 8న అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్త్రీ స్నేహం నేపథ్యంలో రూపొందించారు. ఈ సినిమాకు ఛాయా గ్రాహకుడు, కూర్పరి మినహా మిగిలిన టీమ్ అంతా మహిళలే కావడం విశేషం. సాగరి వెంకట, సంపద హర్కారా, అయాంతా మిఛెల్ ముఖ్యతారలుగా నటించారు.

    All I Want is Everything

    ఈ సినిమా గురించి ఝాన్సీ మాట్లాడుతూ 'ఇంత వరకూ అబ్బాయిల ఫ్రెండ్షిప్ తో చాలా సినిమాలు వచ్చాయి కానీ, అమ్మాయిల ఫ్రెండ్షిప్ గురించి ఎవరూ డీల్ చేయలేదు. ఈ సినిమాలో మూడు పాత్రలే ఉంటాయి. ముగ్గురు అమ్మాయిలు, వారి స్నేహం, తమ సమస్యల పరిష్కారం నేపథ్యంలో చాలా బోల్డ్ నేచర్‌లో ఈచిత్రం చేసాం. దేశ వ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: శోభన ఎన్. రావు. ఇప్పటికే ఈచిత్రం గోవాలో జరిగిన సౌత్ ఏషియల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    English summary
    TV anchor and character artist Jhansi has silently made an English language film titled 'All I Want Is Everything'. The film's cast and crew members are all women, except for the cinematographer and editor. The film is based on the theme of friendship between three women and it stars Sampada Harkara, Sagari Venkata and Iantha Mitchell. The film’s runtime is just 62 minutes and it’s slated for release on March 8 on the eve of International Woman’s Day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X