twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినారె మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం!

    ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సినారె మంగళవారం ఉదయం కన్నుమూశారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె) మంగళవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. తెలుగు సినిమా పాటల ప్రపంచంలో తొలితరం రచయతల్లో ప్రముఖుడిగా పేరొందిన సినారె మరణంతో తెలుగు సాహితీ, సినీ ప్రపంచంలో విషాదం నెలకొంది.

    మూరుమూల గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సినారె తనదైన టాలెంటుతో రచయితగా ఎదిగారు. తెలుగు సినిమా పాటకు ప్రాణం పోసిన రచయితగా కీర్తిగడించారు. ఆయన తన రచనా ప్రస్తానంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు అందించారు. రచనా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్‌ అవార్డు అందుకున్న ప్రముఖుల్లో డాక్టర్‌.సి.నారాయణరెడ్డి ఒకరు.

    బాలయ్యం నుండే ఆసక్తి

    బాలయ్యం నుండే ఆసక్తి

    సి.నారాయణరెడ్డి 1931, జూలై 29న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేటలో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలోనే హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడైన సినారె సాహిత్యం వైపు అడుగులు వేశారు.

    సాహిత్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్

    సాహిత్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్

    హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివిన సినారె ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు.

    గెలేబకావలి కథతో

    గెలేబకావలి కథతో

    సి.నారాయణ రెడ్డి 1962 లో ‘గులేబకావలి కథ‌' అనే సినిమాకు పాటలు రాడం ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాలో నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసానీ అనే పాటతో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఆయన మూడు వేలకు పైగా పాటలు రాశారు.

    సాహితీవనంలో పారిజాతాలు

    సాహితీవనంలో పారిజాతాలు

    సినిమా రంగానికి సినారె అందించిన సాహితీ సేవలు ఎన్నటికీ మరువలేనివి. ఆయన చేసిన రచనలు ఎందరో ఆధునిక కవులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఆయన రచనలు సమకాలీన కవులకు 'మాస్టర్‌ పీస్‌'లాంటివని చెప్పడం అతిశయోక్తి కాదు. సామాజిక స్పృహను కలిగించే ఆయన రచనలు సాహితీవనంలో పారిజాతాలు.

    ప్రముఖులతో

    ప్రముఖులతో

    అలనాటి మహానటులు దివంగత ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుతో పాటు తర్వాతి తరం నటులైన కృష్ణ, శోభన్‌బాబు, చంద్రమోహన్‌, మురళీమోహన్‌, మూడోతరం నటులైన మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, యువసామ్రాట్‌ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌ నటించిన ఎన్నో చిత్రాలకు సినారె కలం నుంచి అద్భుతమైన పాటలు జాలువారాయి. ఆయన రాసిన పాటలు సంగీత ప్రియులను నేటికీ ఉర్రూతలూగిస్తున్నాయి.

    జ్ఞానపీఠ పురస్కారం

    జ్ఞానపీఠ పురస్కారం

    విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.

    English summary
    Noted poet and writer Cingireddi Narayana Reddy, recipient of the Jnanpith Award in 1988, passed away on Monday, news agency ANI reported. He was 85. Reddy was a renowned Telugu poet who also wrote several songs for Telugu movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X