»   »  అక్షయ్‌పై కేసు.. సమన్లు.. అయినా అదరగొట్టాడు.. మతిపోయేలా జనం..

అక్షయ్‌పై కేసు.. సమన్లు.. అయినా అదరగొట్టాడు.. మతిపోయేలా జనం..

జాలీ ఎల్‌ఎల్‌బీ2లో హీరో పాత్ర పోషించిన అక్షయ్ కుమార్ కు సోమవారం జైపూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 10వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల ఓ మైగాడ్, హాలీడే, రుస్తుం, ఎయిర్ లిప్ట్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న అక్షయ్ కుమార్ తాజాగా జాలీ ఎల్‌ఎల్‌బీ2 చిత్రంతో ముందుకొస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో అక్షయ్ అదరగొట్టాడు. ఈ చిత్రంలోని హీరోయిన్ హ్యూమా ఖురేషీతో కలిసి ఓ కాలేజీకి వెళ్లిన అక్షయ్ కుమార్‌కు విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. ఇసుక వేస్తే రాలనంత విధంగా విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విధంగా అక్షయ్ కార్యక్రమానికి విద్యార్థులు తరలిరావడం బాలీవుడ్ ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేసింది.

 కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి..

కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి..

ఢిల్లీలోని నోయిడా కాలేజీలో విద్యార్థులను చూసి అక్షయ్ తనను తాను మరిచిపోయారు. తన కాలేజీ రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. మరిచిపోలేనటువంటి రోజును అందించారు. అని విద్యార్థులకు అక్షయ్ థ్యాంక్యూ చెప్పారు. ఘన స్వాగతం పలికిన మీకు లవ్ లవ్ లవ్ యూ.. అని నోయిడా విద్యార్థులకు ట్వీట్ చేశారు.

 అర్షద్ వార్సీ స్థానంలో అక్షయ్ కుమార్

అర్షద్ వార్సీ స్థానంలో అక్షయ్ కుమార్


2016లో జాలీ ఎల్‌ఎల్‌బీ2 చిత్రం ఫ్రారంభమైంది. తొలుత హీరో పాత్రకు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీని తీసుకొన్నారు. ఆ తర్వాత వార్సీ స్థానంలో అక్షయ్ కుమార్ ను తీసుకోవడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఈ చిత్రాన్ని అధిక భాగం లక్నోలో నెలరోజులపాటు చిత్రీకరించారు. ఈ చిత్రంలో హ్యుమా ఖురేషీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారత న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే అంశాలతో కోర్టు డ్రామా చిత్రంగా జాలీ ఎల్‌ఎల్‌బీ2 రూపుదిద్దుకొన్నది. ఫిబ్రవరి 10న ఈ చిత్రం విడుదలవుతున్నది. ఈ చిత్రానికి దర్శకుడు సుభాష్ కుమార్. ప్రధాన పాత్రల్లో సౌరభ్ శుక్లా, అనూ కపూర్ నటిస్తున్నారు.

 అక్షయ్‌కు జైపూర్ కోర్టు సమన్లు

అక్షయ్‌కు జైపూర్ కోర్టు సమన్లు


జాలీ ఎల్‌ఎల్‌బీ2లో హీరో పాత్ర పోషించిన అక్షయ్ కుమార్ కు సోమవారం జైపూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 10వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. న్యాయవాద వృత్తిని కించపరిచే విధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ దారు కోర్టుకు నివేదించారు.

 బాంబే హైకోర్టులోనూ కేసు

బాంబే హైకోర్టులోనూ కేసు


భారత న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఈ చిత్రం రూపొందించారనే ఆరోపణలపై జాలీ ఎల్ఎల్‌బీ2 చిత్రంపై న్యాయవాది అజయ్ కుమార్ వాగ్మేరే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్ర టైటిల్ నుంచి ఎల్ఎల్‌బీ పదాన్ని తొలగించాలని కోర్టును వేడుకొన్నారు. దాంతో ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కోర్టు నియమించింది. ఈ కమిటీలో చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్‌‌లు ఎన్వీ రమణ, డీవై చంద్రచూడ్ ఉన్నారు.

English summary
Akshay Kumar getting ready with Controversial Comedy 'Jolly LLB 2. This movie facing few cournt cases.
Please Wait while comments are loading...