twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినోద్ రాయల్ హత్యోదంతం: వాళ్లు నాకొద్దు, ఎన్టీఆర్ స్పందనతో చల్లారిన అగ్గి!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్ ఇటీవల కర్నాటకలోని కోలార్ లో దారుణ హత్యకు గురికావడం సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి జూ ఎన్టీఆర్ అభిమాని అనే ప్రచారంతో సినీ ఇండస్ట్రీ, అభిమాన లోకం వేడెక్కిపోయింది.

    హత్య జరుగడానికి ముందు ఇద్దరి మధ్య తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ వాదనలు జరిగాయని, ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లి అభిమాని కుటుంబాన్ని పరామర్శించారు. ఒకరినొకరు చంపుకునేంత అభిమానం వద్దు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు సూచించారు.

    అయితే ఈ సంఘటన జరిగిన ఇన్ని రోజులైనా జూ ఎన్టీఆర్ స్పందించ లేదనే అసంతృప్తి అందరిలోనూ ఉంది. కనీసం ఇలాంటివి వద్దు అని అభిమానులకు సూచన కూడా చేయలేదు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. త్వరలో సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ మౌనం పాటించడం ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తుందేమో అనే ఆందోళన సైతం వ్యక్తం అయింది.

    అయితే ఎట్టకేలకు ఎన్టీఆర్ స్పందించారు. తన 'జనతా గ్యారేజ్' మూవీ ప్రమోషన్లో భాగంగా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అక్కడ ఈ విషయం ప్రస్తావనకు రాగా స్పందించారు. అందుకు సంబంధించిన అంశాలు స్లైడ్ షోలో..

    హద్దులు దాటొద్దు

    హద్దులు దాటొద్దు

    హద్దులు దాటే అభిమానులు తనకు వద్దని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేసారు.

    తప్పు కాదు కానీ...

    తప్పు కాదు కానీ...

    సినీ హీరోలపై అభిమానం పెంచుకోవడాన్ని నేను తప్పు పట్టను, ఆ అభిమానం పదిమందికి మేలు చేయాలి కానీ ఎవరికీ హాని చేయకూడదనే విధంగా ఎన్టీఆర్ స్పందించారు.

    ముందు దేశం, తర్వాత కుటుంబం, తర్వాతే సినిమా

    ముందు దేశం, తర్వాత కుటుంబం, తర్వాతే సినిమా

    ఎవరైనా సరే ముందు దేశం, తర్వాత కుటుుంబం... ఆ తర్వాతే సినీ హీరోలపై అభిమానం చూపాలని ఎన్టీఆర్ సూచించారు.

    మా మధ్య ఎలాంటి గొడవలు

    మా మధ్య ఎలాంటి గొడవలు

    సినీ హీరోలుగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్... భవిష్యత్తులో ఉండబోవని ఎన్టీఆర్ తెలిపారు.

    వాళ్లొద్దు

    వాళ్లొద్దు

    అభిమానమనేది సినిమాల వరకే. రెండు గంటలు చూసే సినిమా కోసం గొడవలకు దిగొద్దని నేను అందరినీ కోరుకుంటున్నాను. నా అభిమానులు గొడవల వైపు వెళ్లరనే నమ్మకం కచ్చితంగా నాకు ఉంది. బట్, గొడవలకు వెళ్లేటట్లయితే.. దయచేసి నా అభిమానులుగా ఉండొద్దని కోరుకుంటున్నాను అన్నారు.

    అందరు అభిమానులకు సూచన

    అందరు అభిమానులకు సూచన

    నువ్వు పుట్టిన దేశాన్ని ప్రేమించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ మీద నమ్మకం పెట్టుకున్న నీ భార్యను ప్రేమించు, నిన్నే నమ్ముకుని పుట్టిన నీ పిల్లలను ప్రేమించు. వాటి తర్నీవాతే అభిమాన నటులు వైపు వెళ్లాలి. ఈ విషయాన్ని కేవలం నా అభిమానులకే కాదు, అందరి అభిమానులకు చెబుతున్నాను అన్నారు ఎన్టీఆర్

    English summary
    Tollywood young tiger Jr NTR interview details about Janatha Garage and Vinod Royal Issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X