»   » ఎన్టీఆర్ ‘టెంపర్’ రన్ టైం ఎంత

ఎన్టీఆర్ ‘టెంపర్’ రన్ టైం ఎంత

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్‌'. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్‌ నిర్మాత. ఈ సినిమా ఆడియో, ట్రైలర్స్ ఈ మధ్యనే విడుదల అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. ఈ నెల 13న విడుదల అవుతున్న ఈ చిత్రం రన్ టైమ్ లాక్ చేసారు. ‘టెంపర్' సినిమా రన్ టైం సుమారు 141 నిమిషాలు ఉంటుంది. ఇదే లెంగ్త్ కి ఈ చిత్ర టీం ఫస్ట్ కాపీని రెడీ చేసారని సమాచారం. అందులో ఫస్ట్ హాఫ్ 1 గంట 8 నిమిషాలు, సెకండాఫ్ 1 గంట 13 నిమిషాలు ఉండబోతోంది.

ఎన్.టి.ఆర్, అతని టీం సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోస్ కి సంబందించిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించనున్న ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ సినిమాకు కథను వక్కతం వంశీ సమకూర్చగా బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన కాజల్‌ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, కాజల్‌ కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం, బాద్‌షా, రెండు హిట్‌లు సాధించగా టెంపర్‌తో హాట్రిక్‌ కోసం ఎదురుచూస్తున్నారు.


jr NTR's Temper movie run time

బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ ‘‘ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మా సినిమా ‘టెంపర్‌'విడుదలకు సిద్గంగా ఉంది. 13న కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా విడుదల చేస్తాం . ఎన్టీఆర్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది'' అని అన్నారు.


చొక్కా లేని ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఇప్పటికే సినిమాపై ఓ అంచనాకి వచ్చేశారు. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఈ లుక్‌తో అభిమానులకు మరింత దగ్గరవుతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పూరి జగన్‌ తన సినిమాలో హీరోలను విభిన్నంగా చూపించడంలో ముందుంటారు. తాజాగా ఎన్టీఆర్‌ విషయంలోనూ అదే రిపీట్‌ అయ్యింది.


కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
NTR’s Temper is all set for a massive release this Friday and the post production works are going on in full swing. Latest update is that the run time of the film has been locked to 141 minutes.
Please Wait while comments are loading...