twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ఇరుగదీశాడు.. నాదొక్కడిదే కాదు.. అందరు హీరోలది!

    ఐఫా అవార్డుల కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఎన్టీఆర్ స్పీచ్‌తో ఆహూతులందరూ ఆశ్చర్యపోయి ఎన్టీయార్‌ను చప్పట్లతో అభినందించారు.

    By Rajababu
    |

    ఐఫా అవార్డుల కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఎన్టీఆర్ స్పీచ్‌తో ఆహూతులందరూ ఆశ్చర్యపోయి ఎన్టీయార్‌ను చప్పట్లతో అభినందించారు.

    హీరోలందరికి అభినందనలు

    హీరోలందరికి అభినందనలు

    సాధారణంగా అవార్డు తీసుకోగానే ఆ చిత్ర దర్శకుడిని, లేదా నిర్మాతను, లేదా యూనిట్ సభ్యులను పొగుడుతారు. కానీ ఎన్టీఆర్ అందుకు భిన్నంగా ఉత్తమ నటుడి అవార్డు విభాగంలో తనకు పోటీగా నిలిచిన హీరోలందరికి అభినందనలు తెలిపి అందరి మన్ననలు పొందాడు.

    అద్భుత నటన అంటూ

    అద్భుత నటన అంటూ

    ఎన్టీయార్‌ వేదిక ఎక్కిన వెంటనే ఈ అవార్డుకు తనతో పాటు నామినేషన్‌ సాధించిన హీరోలందరి పేర్లూ చదివి వినిపించాడు. ఈ నామినేషన్‌ పొందిన హీరోలందరూ తమ తమ సినిమాల్లో అద్భుత నటన ప్రదర్శించారంటూ ప్రశంసించాడు. నేను అందుకొన్న ఈ అవార్డు నా ఒక్కడికే కాదు. అందరు హీరోలందరికీ చెందుతుంది అని వ్యాఖ్యానించాడు.

    ఉత్తమ నటుడిగా..

    ఉత్తమ నటుడిగా..

    జనతా గ్యారేజ్ సినిమాలో నటనకుగానూ ఎన్టీఆర్ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకొన్నారు. ప‌లు విభాగాల్లో కూడా ఈ సినిమా అవార్డుల‌ను కైవ‌సం చేసుకుంది.

    గతేడాది..

    గతేడాది..

    గతేడాది ఎన్టీయార్‌ నటించిన టెంపర్‌ చిత్రానికి కాకుండా, మహేష్‌‌బాబు సినిమా శ్రీమంతుడుకు ఈ అవార్డు రావడం జూనియర్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కోసం బుధవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో ‘జనతా గ్యారేజ్‌' సినిమాకుగానూ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డునందుకున్నాడు.

    English summary
    Junior NTR wins best actor award in IIFA 2017 award in Hyderabad. In this function NTR praised all hero, who raced for best actor category. Many of film Industry apreciating the NTR speech.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X