»   » జ్యోతి లక్ష్మి: ఛార్మికి నన్నపనేని పూలాభిషేకం (ఫోటోస్)

జ్యోతి లక్ష్మి: ఛార్మికి నన్నపనేని పూలాభిషేకం (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఛార్మి ప్రధాన పాత్రలో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘జ్యోతి లక్ష్మి'. చార్మి సమర్పణలో సి.కె ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లో సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఈ చిత్ర యూనిట్ ను వంశీ ఇంటర్నేషనల్ సంస్థ అభినందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, పివి.విజయ్ బాబు చార్మిని పూలమాలతో సన్మానించారు. ఆమెపై పూల వర్షం కురిపించారు.


ఈ సందర్భంగా నన్నపనేని మాట్లాడుతూ... ‘జ్యోతిలక్ష్మి చిత్రంలో మహిళలపై అన్యాయాలను చాలా బాగా చూపించారని, చార్మి నటన అద్భుతంగా ఉందని, సావిత్రి, జమున, జయసుధ, జయప్రద లాంటి నటీమణులు ఇప్పటి సినిమాల్లో లేరనే బాదను ఈ సినిమాతో చార్మి తీర్చింది అన్నారు.


చార్మి మాట్లాడుతూ... హీరోయిన్ గా ఎన్ని సినిమాలు తీసినా ‘జ్యోతిలక్ష్మి' చిత్రం తెచ్చినంత మంచి పేరు ఏ సినిమా తేలేదన్నారు. ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్ కి రుణపడి ఉంటానని చార్మి చెప్పుకొచ్చారు. చిరంజీవి 150వ సినిమాలో బిజీగా ఉండటం వల్లనే పూరి రాలేక పోయారని చార్మి చెప్పుకొచ్చారు. స్లైడ్ షోలో ఫోటోలు...


టైటిల్ కరెక్ట్ కాదేమో

ఈ సినిమాకు జ్యోతిలక్ష్మి టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు. కానీ సినిమాలో చార్మి పెర్ఫార్మెన్స్ కు ఈ టైటిల్ కరెక్టర్ కాదని పి.వి.విజయ్ బాబు అభిప్రాయ పడ్డారు.


సి కళ్యాణ్

కెరీర్లో 50కిపైగా సినిమాలు చేసాను. నాకు చందమామ సినిమా ఎంత పేరు తెచ్చిందో జ్యోతి లక్ష్మి సినిమా అంతకంటే ఎక్కువ పెరు తెచ్చిందన్నారు.


పూల వర్షం

చార్మిపై పూల వర్షం కురిపిస్తూ సన్మానిస్తున్న దృశ్యం.


చార్మి ఆనందం

తనను అభినందించడంపై చార్మి ఆనందం వ్యక్తం చేసింది.


 


 


Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos