twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కష్టాల సుడిగుండంలో కాలా.. రజనీ, ధనుష్‌, రంజిత్‌కు నోటీసులు

    సూపర్ స్టార్ రజనీకాంత్, కబాలి దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కాలా చిత్రం ఫస్ట్‌లుక్‌తో అభిమానులు పండుగ చేసుకొన్నారు. రజనీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారనే వార్తల నేపథ్యంలో కాలా చిత్రం

    By Rajababu
    |

    కాలా చిత్ర షూటింగ్ ప్రారంభమే ఓ సంచలనంగా మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్, కబాలి దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కాలా చిత్రం ఫస్ట్‌లుక్‌తో అభిమానులు పండుగ చేసుకొన్నారు. రజనీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారనే వార్తల నేపథ్యంలో కాలా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా కాలా చిత్ర తనదే అంటూ ఓ వ్యక్తి కేసు నమోదు చేయడం, రజనీ, చిత్ర నిర్మాత ధనుష్, దర్శకుడు పా రంజిత్‌లకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. గతంలో కూడా గ్యాంగస్టర్ హాజీ మస్తాన్ వారసుడు రజనీకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

    నా కథతోనే సినిమా

    నా కథతోనే సినిమా

    కరికాలన్ పేరుతో సినిమా తీయాలని దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలిలో టైటిల్‌ను నమోదు చేశాను. రజనీకాంత్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు సత్యనారాయణకు కథ చెప్పాను. ఇప్పుడు ‘కాలా' అని టైటిల్‌ పెట్టి, కరికాలన్‌ అని క్యాప్షన్‌ పెట్టారు. తాను చెప్పిన కథతోనే ఈ సినిమా తీస్తున్నారు అని జీఎస్‌ఆర్‌ విన్‌మీన్‌ క్రియేషన్స్‌ అధినేత, రచయిత ఎం రాజశేఖరన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన చెన్నై సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    15 కల్లా వివరణ ఇవ్వండి

    15 కల్లా వివరణ ఇవ్వండి

    కాలా చిత్ర కథ నాదే అంటూ రాజశేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకొన్నది. ఈ వ్యవహారంలో దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, చిత్రకథానాయకుడు రజనీకాంత్‌ , దర్శక-నిర్మాతలు పా. రంజిత్, ధనుష్‌లు ఈ నెల 15కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

    టైటిల్ రెన్యువల్ చేయరా?

    టైటిల్ రెన్యువల్ చేయరా?

    ఇదిలా ఉండగా, సౌతిండియన్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తీరును కూడా రాజశేఖరన్ తప్పుపట్టారు. తాను రిజిస్టర్ చేయాలనుకొన్న టైటిల్ చాంబర్ తన టైటిల్‌ను రెన్యువల్ చేయలేదు. కొందరు ప్రముఖుల కోసం ఒకరు రిజిస్టర్ చేసుకొన్న టైటిల్‌ను రెన్యువల్ చేయకపోవడం, లేదా క్యాన్సిల్ చేసే హక్కు మండలికి లేదు అని రాజశేఖరన్ విమర్శించారు.

    రజనీ, ధనుష్ జవాబిస్తారా?

    రజనీ, ధనుష్ జవాబిస్తారా?

    తాజా కోర్టు ఆదేశాలకు రజనీ, ధనుష్; పా రంజిత్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. జూన్ 15కల్లా ఎలాంటి సమాధానం ఇస్తారో అనే విషయం గురించి వేచి చూస్తున్నారు. రాజశేఖరన్‌తో సయోధ్య చేసుకొంటారా? ఆయన చేసే ఆరోపణల్లో వాస్తవం లేదని కాలా టీమ్ నిరూపిస్తుందా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.

    English summary
    Chennai city civil court here has ordered notice to actor Rajinikanth and producer Dhanush, director Pa Ranjith of Tamil movie Kaala Karikaalan on a civil dispute moved by another film producer over the use of the film’s title and plot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X