twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కబాలి' ఫస్ట్ షో: సినిమా గురించి బ్రీఫ్‌గా....

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రజనీకాంత్ మూవీ 'కబాలి' మూవీ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో తెల్లవారు ఝామునే మొదలయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 8.45 గంటలు దాటిన తర్వాతే షోలు పడ్డాయి.

    తెలుగు రాష్ట్రాల్లోనూ రజనీకాంత్ కు భారీగా అభిమానులు ఉన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు బెనిఫిట్ షోలకు హాజరయ్యారు. చాలా మంది టిక్కెట్లను బ్లాక్ లో కొనుక్కుని మరీ రావడం కనిపించింది. హైదరాబాద్ లో మేం వెళ్లిన థియేటర్లో ఎక్కువగా తమిళ జనాలే ఉండటం గమనార్హం. థియేటర్లో ఎక్కువగా తెలుగు వారి కంటే తమిళులే ఎక్కువగా ఉన్నారు.

    షో వివరాల్లోకి వెళితే...

    • రజనీకాంత్ ఇంట్రడక్షన్ సీన్ తో సినిమా మొదలైంది. మలేషియా జైల్లో 25 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తర్వాత కబాలి రిలీజ్ అయ్యాడు.
    • రజనీ ఎంట్రీ అదిరిపోయింది. సినిమాలో రజనీ స్టైల్ చాలా బావుంది. సినిమాపై అంచనాలు పెరగడానికి ఇదీ ఓ కారణమే.
    • జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత యాక్షన్ సీన్. రజనీ తనదైన రీతిలో అదరగొట్టారు.
    • గ్యాంగ్ వార్స్, డ్రగ్ మాఫియా అనే అంశాలతో కూడిన పరిస్థితుల చుట్టూ సినిమా సాగుతుంది.
    • కబాలి జైలు నుండి తిరిగి వచ్చాడని తెలియగానే మలేషియాలోని తమిళుల్లో ఆనందం...
    • ఎమోషనల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా సినిమా రన్ అవుతోంది. సినిమా తొలి భాగం ఆసక్తికరంగా ఉంది.
    • సాధారణంగా రజనీకాంత్ సినిమాల్లో కామెడీ కూడా మనకు కనిపిస్తుంది. అయితే 'కబాలి'లో మాత్రం కామెడీ కనిపించడం లేదు. సినిమా మొత్తం సీరియస్, ఎమోషనల్ గా సాగుతోంది.
    • సినిమాలో రజనీకాంత్ చెబుతున్న డైలాగులు కొన్ని గంభీరంగా ఉంటే మరికొన్ని సెంటిమెంటల్ టచ్ తో అండర్ ప్రివిలేజ్ సొసైటీని ఉద్దేశించి ఆకట్టుకునేలా ఉన్నాయి.
    • తాను జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుపుతూ సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి ఎంటరైన తర్వాత మలేషియాలో తమిళుల హక్కుల కోసం రజనీ పోరాడటం కనిపిస్తోంది.
    • ఈ సమయంలోనే రాధిక ఆప్టే, నాజర్ పాత్రలు ప్రేక్షకులు పరిచయం అవుతాయి
    • ఫ్లాష్ బ్యాక్ ముగింపుతో కబాలి కూతురుగా ధన్సిక ఎంట్రీ ఇచ్చింది.
    • సినిమా మలేషియా నుండి థాయ్ లాండ్ కు మారింది.
    • కబాలి ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంది.
    • సినిమా మొదటి నుండి చివరదాకా రజనీకాంత్ తన వన్ మెన్ షోతో ఆకట్టుకున్నాడు.
    • రజనీకాంత్ సినిమాల నుండి సాధారణంగా ఆశించే రజనిజం ఈ సినిమాలో ఎక్కువగా కనిపించదు. ఇందులో రజనీకాంత్ యాక్టింగ్ స్కిల్ గత సినిమాల కంటే డిఫరెంట్ లో కనిపిస్తాయి.
    • రాధిక ఆప్టే, రిత్విక, దన్సిక పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకున్నారు.
    • దర్శకుడు పా రంజిత్ ఫిమేల్ క్యారెక్టర్లను కూడా చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేసాడు.
    • ఫస్టాఫ్ పాసీగా సాగుతూ షార్ప్ గా అనిపిస్తుంది. అయితే సెకండాఫ్ ఎమోషనల్ సైడ్ తో మెలోడ్రామాగా అనిపిస్తుంది.
    • జి మురళి సినిమాటోగ్రఫీ బావుంది. తన సినిమాటోగ్రఫీతో సినిమాకు ఒక స్టెబులిటీ ఇచ్చాడు. అతడు వాడిని కలర్ థీమ్, యాంగిల్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి.
    • సినిమాకు సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం పెద్ద ప్లస్ పాయింట్.
    • దర్శకుడు పా రంజిత్ రజనీకాంత్ స్టార్ ఇమేజ్ ను చాలా బెటర్ గా వాడుకున్నాడు.
    • ఇటీవల కాలంలో సినిమాపై వచ్చిన భారీ హైప్ ను మైండ్ లో పెట్టుకుని వెళితే కాస్త డిసప్పాయింట్ అనిపిస్తుంది.
    • రజనీకాంత్ ను ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసాడు దర్శకుడు. రొటీన్ రజనీ సినిమాలా ఉండాలని కోరుకోకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే నచ్చుతుంది.

    కబాలి సూపర్


    కబాలి సూపర్ అంటూ ఓ అభిమాని 4/5 రేటింగ్ ఇచ్చారు.

    బిలో యావరేజ్


    సినిమా బిలో యావరేజ్ గా ఉందంటూ మరొకరు..

    ఫస్టాఫ్ ఇంట్రెస్టింగ్


    సినిమా ఫస్టాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ ట్వీట్

    ఇంటర్వెల్ అదిరింది


    ఇంటర్వెల్ అదిరిందంటూ ట్వీట్

    స్పీచ్ లెస్


    రజనీకాంత్ చూసిన చూసిన తర్వాత ఓ అభిమాని స్పందన

    ఆ ఇద్దరూ బాగా చేసారు


    రజనీతో పాటు రాధిక ఆప్టే, ధన్సిక బాగా చేసారంటూ ఫ్యాన్స్ ట్వీట్

    కన్నులపండుగే..


    కబాలి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం కన్నుల పండుగే అంటూ ట్వీట్

    తమిళుల ఉత్సాహం...

    తమిళుల ఉత్సాహం...

    చెన్నైలోని 125కు పైగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన బెనిఫిట్ షోలను చూస్తున్న అభిమానులు మరో దఫా చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే చిత్రం చూసేందుకు తరలివస్తున్న రజనీ అభిమానులకు ఆయా థియేటర్ల వద్ద ‘హౌస్ ఫుల్' బోర్డులు దర్శనమిస్తున్నాయి.

    చూసేందుకే..

    చూసేందుకే..

    తమిళనాడులో కబాలి టిక్కెట్లు దక్కించుకోలేని అభిమానులు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలకు తరలి వెళుతున్నారు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లోని తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో తమిళ తంబీల సందడి కనిపిస్తోంది.

    దిష్టి తగలకూడదని..

    దిష్టి తగలకూడదని..

    హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కబాలి హంగామా విపరీతంగా కొన‌సాగుతోంది. థియేటర్ల ముందు బారులు తీరిన అభిమానులు ‘క‌బాలి.. క‌బాలి.. త‌లైవా.. త‌లైవా' అంటూ నిన‌దిస్తున్నారు. విశాఖ‌లోని ఓ థియేట‌ర్‌లో ర‌జ‌నీ క‌బాలికి దిష్టి త‌గ‌లొద్దంటూ ఆయ‌న వీరాభిమానులు థియేట‌ర్ ముందు కొబ్బ‌రికాయ‌లు కొట్టారు.

    అమెరికాలో....

    అమెరికాలో....

    ఒక రోజు ముందుగానే అమెరికాలో విడుదలైన ఈ చిత్రానికి అక్కడి ఎన్నారైలు బ్రహ్మరథం పట్టారు. అమెరికాలోని ఓ నగరంలో ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ ముందు టీషర్ట్ లు, జీన్స్ ప్యాంట్లలో ప్రత్యక్షమైన ఎన్నారై యువతులు వరుసగా నిలబడి రజనీ హిట్ చిత్రం ‘శివాజీ'లోని పాటలకు తమదైన రీతిలో స్టెప్పులేస్తూ ‘కబాలి'కి స్వాగతం పలికారు. ఈ దృశ్యాలు పలు ప్రాంతీయ, నేషనల్ న్యూస్ ఛానెళ్లలో ప్రముఖంగా ప్రసారమయ్యాయి.

    English summary
    Check out Rajinikanth's Kabali movie first day first show live updates.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X