twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొటీన్ రాజా (కాయ్ రాజా కాయ్...రివ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: జోష్ రవి, రామ్ ఖన్నా, మానస్, శ్యామిలీ, శ్యావ్య ప్రధాన పాత్రల్లో మారుతీ టాకీస్ సమర్పణలో శివ గణేష్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఫుల్ మూన్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘కాయ్ రాజా కాయ్'. ఈజీగా డబ్బు సంపాదించాలని ఆశపడే కుర్రాళ్ల నేపథ్యానికి కామెడీ, లవ్ అంశాలను జోడించి సినిమాను తెరకెక్కించారు.

    కథ విషయానికొస్తే.... ఖన్నా(రామ్‌ ఖన్నా), ఆనంద్‌(మానస్‌), చిట్టిబాబు(జోష్ రవి) ముగ్గురూ స్నేహితులు. ‌ఖన్నా బైక్‌ మెకానిక్ పనిచేస్తుండగా‌, ఆనంద్‌ ఏదైనా ఉద్యోగం సంపాదించాలనే ప్రయత్నంలో ఉంటాడు.చిట్టీ వారిలా కాకుండా కిడ్నాప్, స్మగ్లింగ్ లాంటివి చేసి డబ్బులు సంపాదించాలన్న ఆలోచనలో ఉంటాడు. ఖన్నా, ఆనంద్‌ ప్రేమలో పడతారు...ఈ క్రమంలో వారికి డబ్బులేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. చిట్టిబాబును డబ్బు సంపాదించడానికి ఈజీగా డబ్బు సంపాదించడానికి ప్లాన్ చేస్తారు. ఇందుకోసం ఎమ్మెల్యే కూతుర్ని కిడ్నాప్‌ చేస్తారు. ఓ నగల వ్యాపారిని చంపి కొందరు దుండగులు ఆ పెట్టెను దొంగిలిస్తారు. ఆ బంగారం పెట్టె కోసం గ్యాంగ్ స్టర్ భట్టు(హరి) వెతుకుంటాడు. అనుకోకుండా ఈ ముగ్గురి వద్దకు ఆ బంగారం పెట్టె దొరుకుతుంది. వాళ్ళు దీన్ని అమ్మాలని భట్టు అసిస్టెంట్ తోనే డీల్ మాట్లాడతాడు. దాంతో ఈ ముగ్గురు ఇబ్బందుల్లో పడతారు. ఆర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిందే.

    నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...ముందుగా జోష్ రవి గురించి చెప్పుకోవాలి. కామెడీ బాగా పండించాడు. తనదైన డైలాగ్ డెలివరీ, పంచ్ డైలాగులతో నవ్వించాడు. సినిమాలో ఎక్కువగా హైలెట్ అయింది అతని కామెడీనే. రామ్ ఖన్నా యాక్షన్ బావుంది. కామెడీ సీన్లు కూడా బాగా చేసాడు. మానస్ పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదు. హీరోయిన్లు షామిలి, శ్రావ్య కేవలం గ్లామర్ పెర్ఫార్మెన్స్ కే పరిమితం అయ్యారు. ఇతర నటీనటులు వారి వారి పరిధిమేర నటించారు.

    సినిమా వివారల్లోకి వెళితే....సినిమాకు పెద్ద డ్రాబ్యాక్ రొటీన్ సబ్జెక్టు. పాత కాన్సెప్టునే కొత్తగా ప్రజెంట్ చేయాలని దర్శకుడు ట్రై చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేక పోవడం, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కు అవసరమైన సస్సెన్స్ మసాలా లేక పోవడం సినిమా మైనస్ అయింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు నెక్ట్స్ సీన్ ఏమిటనేది ముందే ఊహించే విధంగా ఉంది. చాలా సీన్లు గతంలో వచ్చిన తెలుగు సినిమాల్లోని సీన్లు గుర్తుకు తెస్తాయి. విలన్ క్యారెక్టర్ ను సరిగా ఎలివేట్ చేయలేక పోయాడు. అయితే సినిమాలో కామెడీ సీన్లు ఉండటం సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు కాస్త ఊరటనిచ్చే అంశం.'

    Kai Raja Kai' Movie Review

    టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే... సినిమాటోగ్రఫీ బావుంది. జేబీ అందించిన మ్యూజిక్ యావరేజ్. ఎడిటింగ్ పర్ ఫెక్టుగా లేదు. అక్కడక్కడా డైలాగులు పర్వాలేదనిపించాయి. ఇతర డిపార్టుమెంట్స్ ఏదో అలా తమ పని కానిచ్చేసాయి.

    ఓవరాల్ గా చెప్పాలంటే.....అక్కడక్కడా నవ్వుకునే నాలుగు సీన్లు తప్ప సినిమాలో కొత్తగా చెప్పుకొవడానికి ఏమీ లేదు. రోటీన్ బోరింగ్ సినిమాల లిస్టులో కాయ్ రాజా కాయ్ కూడా చేరిపోయింది.

    English summary
    "Kai Raja Kai" is a crime-comedy thriller for which director Siva Ganesh himself has written the story, screenplay and dialogues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X