» 

అబ్బా.. కాజల్ కూడా మొదలెట్టింది

Posted by:

Kajal
మగధీర విజయంతో స్టార్ హీరోయిన్ అయిన కాజల్ తన గురించి తాను సొంత డబ్బా కొట్టుకోవటం మొదలెట్టింది. కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నా.. 'మగధీర' విజయం తరవాత అస్సలు ఖాళీ చిక్కట్లేదు అంటూ రాగాలు తీస్తోంది ఆమె. అయినా అమ్మనాన్నలతో కలిసి హాయిగా ఒకట్రెండు రోజులు గడిపే తీరిక కూడా దొరకట్లేదు. వరుస సినిమాలతో అలసటగా ఉంటోంది.కానీ మొదటి నుంచీ వృత్తినే దైవంగా భావిస్తాను' అంటోంది కాజల్‌. 'మగధీర' తరవాత బాలీవుడ్‌ నుంచి కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది. ఇక్కడ అవకాశాలు కరవైతే పొరుగు పరిశ్రమ వైపు దృష్టిపెట్టడం సహజం. నటిగా నన్ను తీర్చిదిద్దింది తెలుగు చిత్రసీమే. ఇక్కడే కావల్సినన్ని సినిమాలున్నాయి అంటూ తనకు వచ్చే ఆఫర్స్ గురించి ఇన్ డైరక్ట్ గా వివరిస్తోంది.

అయినా అందరిలా తమిళం, హిందీ వైపునకు వెళ్లి చేసే తీరిక లేదు..అవసరం అతకన్నా లేదు ఖాళీ లేదని చెప్తున్నా హిందీ దర్శకులు సంప్రదిస్తున్నారు. కానీ కాల్షీటు ఖాళీగా లేదు. వారికి కూడా ఇదే విషయాన్నే చెప్తున్నాను. అంతెందుకు? నాకు మామూలుగా రకరకాల నెయిల్‌పాలిష్‌లు వేసుకోవడమంటే ఇష్టం. ప్రతి రోజూ ఏదో షూటింగ్‌ ఉంటోంది. ఆ పాత్రలకు సరిపోయే, కావలసిన రంగుల్నే గోళ్లకు పట్టించాలి. ఇక నాకు నచ్చిన రంగులతో ముచ్చట తీర్చుకోవడానికి కూడా తీరిక ఉండట్లేదు. ఇంతకన్నా నా బిజీని ఎలా చెప్పను?'' ఎదురు ప్రశ్నిస్తోంది ఆమె. ఇక కాజల్ నటించిన 'ఆర్య 2' ఇటీవలే విడుదలైంది. సంక్రాంతికి 'ఓంశాంతి' వస్తుంది. ఎప్పుడూ చేతిలో రెండుమూడు సినిమాలు ఉంచుకొంటోంది కాజల్‌.

Read more about: కాజల్, లక్ష్మీ కళ్యాణం, కళ్యాణ్ రామ్, ఆర్య 2, అల్లు అర్జున్, మగధీర, ఓం శాంతి, సంక్రాంతి, kajal, laxmi kalyanam, arya 2, allu arjun, magadheera, om shanti, chandamama
Please Wait while comments are loading...