twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి మ్యాటర్: వారితో సుఖ పడలేనంటున్న కాజల్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ ఇటీవలో ఓ విదేశీయుడితో ప్రేమలో పడిందనే వార్తలు సౌత్ సినీ సర్కిల్ లో ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై కాజల్‌ స్పందిస్తూ...నేను పెళ్లంటూ చేసుకుంటే భారతీయుడినే చేసుకుంటాను. విదేశీయులకు మన సంస్కృతి గురించి తెలియదు, మన ఆచార వ్యవహారాలు తెలియవు. అలాంటి వారిని పెళ్లాడితే జీవితం సుఖంగా ఉండదు' అని తేల్చి చెప్పింది. మరి స్వదేశీయుడెవరైనా నీ మనసులో దోచారా? అని అడిగితే మాత్రం అమ్మడు సమాధానం చెప్పడం లేదు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కాజల్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం తెలుగులో ‘టెంపర్' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో రెండు సినిమాలు, హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. గతేడాది అమ్మడి కెరీర్ గ్రాఫ్ ఏమంత బాగా లేక పోయినా ఈ ఏడాది మాత్రం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకెలుతోంది.

    Kajal Agarwal will not marry a foreigner

    ‘టెంపర్' మూవీ గురించిన వివరాల్లోకి వెళితే...సంక్రాంతి సంబరాలు, త్వరలో జూ ఎన్టీఆర్ హీరోగా ‘టెంపర్' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రీ రిలీజ్ టాక్ మొదలైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా జూ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ లుక్ సినిమాపై అంచనాలు మరింత పెచేలా చేసాయి. దీనికి తోడు నిర్మాత బండ్ల గణేష్......సినిమాకు తనదైన రీతిలో ప్రచారం కల్పిస్తున్న్నాడు. ‘టెంపర్' మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అని సోషల్ మీడియా ద్వారా ప్రచారం ప్రారంభించారు. బండ్ల గణేష్ కు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత అనే పేరు ఉంది. అందుకే ఆయన్ను అంతా బ్లాక్ బస్టర్ గణేష్ అని పిలుస్తుంటారు. మరో వైపు ఎన్టీఆర్ అభిమానులు, ప్రేక్షకులకు కూడా సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    మరో వైపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ చానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తోంది. 7.7 కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ఆ చానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘టెంపర్'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదలైంది. ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదపడితే దండయాత్ర...ఇది దయాగాడి దండయాత్ర' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తో విడుదల చేసిన ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

    English summary
    "I don’t like foreign bridegrooms. I have not dated with them. I am an Indian girl. I will marry only an Indian. Foreigners drown themselves in clubs and pubs. They do not know our culture. They also do not know about our life style. If you marry a person like that, there will be no happiness. Hence I don’t like a foreigner and I will never fall in love with them." Kajal said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X