twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఫీషియల్ : ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రం దర్శకుడిని ప్రకటించిన నిర్మాత

    ఎన్టీఆర్, బాబి కాంబినేషన్ లో సినిమా రాబోతోందని కళ్యాణ్ రామ్ ప్రకటన చేసారు.

    By Srikanya
    |

    హైదరాబాద్ : మొత్తానికి ఎన్టీఆర్ తదుపరి చిత్రంపై క్లారిటీ ఇచ్చేసారు. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ ఏ దర్శకుడుతో చిత్రం చేయబోతున్నారనే విషయమై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా అయితే సర్దార్ గబ్బర్ సింగ్ వంటి డిజాస్టర్ చిత్రానికి దర్శకుడైన బాబితో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

    అయితే అబ్బే అవి రూమర్సే, ఎన్టీఆర్ ఓ ప్లాఫ్ డైరక్టర్ తో అంత పెద్ద హిట్ కొట్టాక చేయాల్సిన అవసరం ఏమిటి అంటూ వాదోపవాదాలు జరిగాయి. కానీ ఇప్పుడు అఫీషియల్ గా న్యూస్ వచ్చేసింది. కల్యాణ్ రామ్ ..బాబి, , ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో చిత్రం నిర్మిస్తున్నాంటూ ట్వీట్ చేసారు.

    ఈ ట్వీట్ లో తన సోదరుడు ఎన్టీఆర్ ప్రెస్టీజియస్ చిత్రం ఎన్టీఆర్ 27 ని తమ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మిస్తున్నామని, బాబి దర్శకుడు అని ప్రకటన చేసారు. ఈ రోజుతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ ...100 రోజులు పూర్తైందని అన్నారు.

    ఇక ఎన్టీఆర్‌ కొత్త సినిమా గురించి ఫ్యాన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. 'జనతా గ్యారేజ్‌'తో దక్కిన విజయంతో ఉత్సాహంగా ఉన్న ఎన్టీఆర్‌ తదుపరి అందుకు ధీటైన కథలో నటించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నట్టు తెలుస్తోంది. అయితే ఫైనల్ గా బాబి చెప్పిన కథ నచ్చి ముందుకు వెళ్తున్నారు. ఎన్టీఆర్‌తో సినిమా తీసే దర్శకులంటూ పూరి జగన్నాథ్‌, త్రివిక్రమ్‌ పేర్లు బలంగా వినిపించాయి. పూరి జగన్నాథ్‌ 'ఇజం' చూసిన తర్వాత ఎన్టీఆర్ నిర్ణయం మార్చుకున్నట్లు చెప్తున్నారు.

    English summary
    Kalyanram tweeted, “Very happy to announce that my brother tarak9999 ‘s prestigious #NTR27 will be on our home banner, NTRArtsOfficial .Directed by dirbobby“. Incidentally, NTR’s latest blockbuster, Janatha Garage, completed its 100-day run today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X