twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ పేరు సూచించిన కళ్యాణ్ రామ్, కానీ....

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్' మూవీ రేపు గ్రాండ్ గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై కళ్యాణ్ రామ్ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. తన కెరీర్ కు ఈచిత్రం ప్లస్సవుతుందనే ఆశతో ఉన్నారు. తమ్ముడు ఎన్టీఆర్ కూడా ఈచిత్రాన్ని ప్రమోట్ చేయడంతో నందూమూరి సర్కిల్ లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

    సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సక్తికర విషయం చెప్పుకొచ్చారు. తొలుత ఈ చిత్రం కథ విన్నప్పుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తో తీద్దామని అన్నారట. తమ్ముడు హీరోగా తనే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని అన్నాడట. అయితే ఈ కథకు మీరైతేనే బావుంటారని అనిల్ చెప్పడంతో చేయడానికి రెడీ అయ్యారట కళ్యాణ్ రామ్.

    కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'పటాస్‌'. శ్రుతి సోడి హీరోయిన్. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం....ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఓ అవినీతి పోలీస్ అథికారిగా కనిపిస్తారు. అలాగే తన చేష్టలతో తన తండ్రి సీనియర్ పోలీస్ అధికారి(సాయికుమార్)ని ఇబ్బంది పెడుతూంటాడు. తండ్రికి, కొడుకు కు మధ్యన పొసగదు. తండ్రి తనను పట్టించుకోకుండా, తన ఇష్టా ఇష్టాలతో సంభంధం లేకుండా పోలీస్ ను చేసాడని మనస్సులో పెట్టుకుని ఆ కసితో తండ్రికి బ్యాడ్ నేమ్ తెచ్చేలా బిహేవ్ చేస్తూంటాడు. అంతేకాకుండా విలన్స్ దగ్గర డబ్బు తీసుకుని వారికి సాయిం చేస్తూంటాడు. మరో ప్రక్క హీరోయిన్ ఓ జర్నలిస్ట్. ఆమెపై మనస్సు పడి ఏదో ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆమెను పిలుస్తూంటాడు. చివరకు అతను ఓ సంఘటన వల్ల మారి..సెకండాఫ్ లో విలన్స్ భరతం పడతాడు. తన తండ్రితో ఉన్న రిలేషన్ ని పునరిద్దించుకుంటాడు. సెకండాఫ్ లో కూడా కామెడీకి మంచి ప్రయారిటీ ఇచ్చారని తెలుస్తోంది. ఇది కళ్యాణ్ రామ్ కు గబ్బర్ సింగ్ అంటున్నారు.

    Kalyanram suggested NTR's name for Pataas

    ఇక ఈ చిత్రం ఫస్టాఫ్ పూర్తి ఫన్ తో నడుస్తుంది. కామెడీకు ప్రయారిటీ ఇస్తూ, పంచ్ డైలాగులతో సినిమా వెళ్లిపోతుంది. సెకండాఫ్ లో సూర్య సింగం స్టైల్ లో విలన్స్, హీరోకి మధ్య వార్ తో ఎత్తుకు పై ఎత్తులతో పరుగెడుతుంది. అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం..సినిమా సక్సెస్ అవుతుందని తెలుస్తోంది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్తున్నారు.

    ''స్వతహాగా రచయితనే అయినా ఈ సినిమా విషయంలో నాలోని దర్శకుడి ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాకి ఏమేం అవసరమో అది మాత్రమే చేశా. సంభాషణలు రాశాను కదా అని ఏది పడితే అది తీయలేదు. ఆరేడేళ్లు దర్శకత్వ విభాగంలో పనిచేశాను కాబట్టి ఆ అనుభవం బాగా ఉపయోగపడింది'' అంటన్నారు దర్శకుడు అనీల్ రావిపూడి. రచయితగా పలు చిత్రాలకి పనిచేసిన ఆయన 'పటాస్‌'తో మెగాఫోన్‌ చేపట్టారు.

    సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

    English summary
    Speaking about the Pataas movie, director Anil Ravipudi said in an interview that Kalyanram suggested NTR's name, when he first heard the script. In fact, this 'Atanokkade' hero was ready to produce the film with his younger brother as the hero. However, Anil Ravipudi took his time to convince Kalyanram for 'Patas'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X