»   » కమల్ 'చీకటి రాజ్యం' మేకింగ్‌( వీడియో), టాక్ ఏంటి?

కమల్ 'చీకటి రాజ్యం' మేకింగ్‌( వీడియో), టాక్ ఏంటి?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కమల్‌ హాసన్‌, త్రిష ప్రధాన పాత్రల్లో రూపొందిన 'చీకటి రాజ్యం' చిత్రం మేకింగ్‌ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. క్రైం థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కమల్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారిగా నటించారు. 'స్లీప్‌లెస్‌ నైట్‌' అనే ఫ్రెంచి చిత్రం ఆధారంగా ఈ సినిమాని రూపొందించినట్లు కమల్‌ వెల్లడించారు.

'చీకటిరాజ్యం' చిత్రం తమిళ వెర్షన్ దీపావళి కానుకగా తమిళ నాట విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.రాజేశ్‌ ఎం సెల్వ దర్శకుడు. ఎన్‌.చంద్రహాసన్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మేకింగ్ వీడియోని ఈ రోజు విడుదల చేసారు. ఆ వీడియోని ఇక్కడ చూడండి.



కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై... కమల్ సోదరుడు చంద్రహసన్ నిర్మిస్తున్న చిత్రం చీకటిరాజ్యం. కమల్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న రాజేశ్.ఎమ్.సెల్వ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరో కీలకపాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా.. గతంలో మన్మథబాణం చిత్రంలో కమల్ తో కలసి నటించిన త్రిష.. మరోసారి ఈ సినిమాలో కమల్ కు జంటగా కనిపించబోతోంది. కిషోర్, సంపత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Kamal Cheekati Raajyam :Behind scenes

ఈ చిత్రంలో కమల్ నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో వింగ్ కు చెందిన ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నార్కోటిక్స్ ప్రపంచంలోని కొందరు వ్యక్తులు తన కుమారుడుని కిడ్నాప్ చేస్తే ఎలా వారిని ఎదుర్కొని, వెనక్కి తెచ్చుకున్నాడనే కథాంశంతో నడుస్తుందని చెప్తున్నారు.


కమల్ విలక్షణ శైలికి అనుగుణంగా అద్భతంగా ఉందీ ట్రైలర్. సస్పెన్స్‌తో కూడిన ఓ థ్రిల్లర్‌లా ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్ధమవుతుంది. తమిళంలో తూంగవనమ్‌గా వస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ అద్భత హావభావాలు పలికించారు.


ప్రకాశ్ రాజ్, త్రిషలు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించారు. ముఖ్యంగా సంగీత దర్శకులు గిబ్రాన్ చక్కని సంగీతం సమకూర్చారు. ట్రైలర్‌లో యాక్షన్, పోరాట సన్నివేశాలతో కూడిన సస్పెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది.


ఈ చిత్రం ట్రైలర్ ని ఇప్పటికే విడుదల చేసారు. ఈ ట్రైలర్ ని ఈ క్రింద చూడండి.



ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కమల్ మాట్లాడుతూ..‘‘ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. నాలుగు విభిన్న పాత్రల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులు తమని తాము మర్చిపోయి సినిమాలో లీనమైపోతారు. గిబ్రాన్ మంచి సంగీతం అందించాడు''అని తెలిపారు.


నా గురువు బాలచందర్‌గారితో 37 సినిమాలకు కలిసి పని చేశాను. చివరి సినిమా 'ఉత్తమవిలన్‌' చేశాక ఆయన మరణించారు. ఇప్పుడు ఆయన లక్షణాలు నాలో కొన్ని కనిపిస్తున్నాయి. నా కోపం, నటన అన్నీ బాలచందర్‌గారి నుంచి వచ్చినవే. 'చీకటి రాజ్యం' ఒక విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రం. రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియనంతగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటికొస్తారు. సినిమా అనేది ఎవరి కారణంగా విజయం సాధిస్తుందో చెప్పలేం. 'షోలే'లో అందరికీ గబ్బర్‌సింగ్‌ పాత్రే గుర్తుంటుంది. అలా ఏ సినిమాతో ఎవరికి గుర్తింపు లభిస్తుందో తెలియది''అన్నారు.



English summary
Cheekati Rajyam making video released. Actor and filmmaker Kamal Haasan, Trisha and Prakash Raj are playing lead roles in the movie Cheekati Rajyam. Movie is a bilingual which was shot in Telugu and Tamil languages simultaneously. The film also has Manisha Koirala and Uma Riaz Khan in other important roles. The movie was directed by Rajesh N Selva and Ghibran is the music composer for this movie.
Please Wait while comments are loading...