twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదో అద్బుతం ట్రైలర్ కోసమే 9 కోట్లు, కమల్ "మరుదనాయగం".., బాహుబలిని మించిపోయేలా

    లైకా ప్రొడక్షన్స సంస్థ కమల్‌హాసన్ డ్రీమ్‌ప్రాజెక్టు మరుదనాయగం ని మళ్లీ పట్టాలెక్కించేందుకు చేయందించనుందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

    |

    ఇంగ్లాండ్‌రాణి ఎలిజిబెత్ చేతుల మీదుగా ప్రారంభమైన చిత్రం మరుదనాయగం. వందలాది కళాకారులతో యుద్ధ సన్నివేశాలను తొలిరోజునే భారీ ఎత్తున కమల్ చిత్రీకరించారు. అలా 30 నిమిషాల సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత ఆర్థిక సమస్యల కారణంగా మరుదనాయగం చిత్ర నిర్మాణం ఆగిపోయింది. గతంలో ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆగిపోయిన 'మరుదనాయగం' సినిమాను తిరిగి పూర్తి చేయనున్నాడు.

    దాదాపు 18 సంవత్సరాల క్రితం కమల్ 'మరుదనాయగం' అనే చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. కథ.. కథనాలు రెడీ చేసుకుని, తనే టైటిల్ రోల్‌ను పోషిస్తూ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్‌తో అప్పట్లో ఈ సినిమా కొంతవరకు నిర్మాణం జరిగాక ఆర్థికపరమైన కారణాలవలన ఆగిపోయింది. అప్పటినుంచి ఈ సినిమాను పూర్తిచేయడానికి కమల్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే వున్నాడు. తాజాగా.. ఆ ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. రెండు భారీ చిత్ర నిర్మాణ సంస్థలు ఈ సినిమా నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయింగరన్ నిర్మాణ సంస్థ 'మరుదనాయగం' సినిమా పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌చేయడంతో ఈ సినిమా తిరిగి సెట్స్‌పైకి వెళుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. "మరుద నాయగం" విషేషాలు మరికొన్ని...

    30 నిమిషాల సన్నివేశాలను:

    30 నిమిషాల సన్నివేశాలను:

    1997 అక్టోబర్ 16వ తారీఖున ఇంగ్లాండ్‌రాణి ఎలిజిబెత్ చేతుల మీదుగా ప్రారంభమైన చిత్రం మరుదనాయగం. వందలాది కళాకారులతో యుద్ధ సన్నివేశాలను తొలిరోజునే భారీ ఎత్తున కమల్ చిత్రీకరించారు. అలా 30 నిమిషాల సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత ఆర్థిక సమస్యల కారణంగా మరుదనాయగం చిత్ర నిర్మాణం ఆగిపోయింది.

    మళ్ళీ మరుదనాయగం:

    మళ్ళీ మరుదనాయగం:

    ఆ తరువాత కమలహాసన్ పలుమార్లు ఈ చిత్రానికి పూర్తి చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాంటిది సుమారు 17 ఏళ్ల తరువాత మళ్ళీ మరుదనాయగం చిత్ర నిర్మాణానికి కమల్ నడుం బిగించారు. తన కల ప్రాజెక్ట్ ని తెరమీదికెక్కించటానికి దాదాపు ఇరవయ్యేళ్ళకి ఈ ప్రయత్నం మొదలయ్యింది.

    మహ్మద్ యూసప్ ఖాన్ కథే:

    మహ్మద్ యూసప్ ఖాన్ కథే:

    ఇది చరిత్ర పౌరుడి ఇతివృత్తంతో కూడిన కథ. భారతదేశం తొలి స్వాతంత్య్ర పోరాట యోధుడు మహ్మద్ యూసప్ ఖాన్ కథే మరుదనాయగంగా తెరకెక్కనుంది. ఆయన అసలు పేరు మరుదనాయగం పిళ్ళై. అప్పట్లో బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తమిళనాడు నుంచి పోరాటం మొదలు పెట్టిన యోధుడి కథ ఇది.

    దాదాపు 20 సంవత్సరాలుగా :

    దాదాపు 20 సంవత్సరాలుగా :

    బడ్జెట్‌ సమస్యలతో 40 శాతం షూటింగ్‌ పూర్తయిన తరువాత అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ తరువాత కమల్‌హాసన్ ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ, ‘మరుదనాయగం'కు మాత్రం కమల్‌ ఊపిరి పోయలేకపోయారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఆగిపోయిన ఈ చిత్రాన్ని మళ్లీ పునఃప్రారంభించేందుకు కమల్‌ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

    100 కోట్లు అవసరం:

    100 కోట్లు అవసరం:

    మిగిలిన షూటింగ్‌ పూర్తి చేయడానికి కనీసం రూ.100 కోట్లు అవసరమైన నేపథ్యంలో తమిళ నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ తో ‘2.ఓ' నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స సంస్థ కమల్‌హాసన్ డ్రీమ్‌ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కించేందుకు చేయందించనుందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

    లైకా అధినేత సుభాస్కరన్‌:

    లైకా అధినేత సుభాస్కరన్‌:

    అందుకు ఊతమిచ్చేలా లైకా అధినేత సుభాస్కరన్‌ను ఇటీవలే కమల్‌హాసన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ‘శభాష్‌ నాయుడు' బహు భాషా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కమల్‌... ‘మరుదనాయగం'ను సెట్స్‌పైకి తీసుకెళ్లడమే లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావాలని ఆయన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

    ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది:

    ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది:

    మరుదనాయగం చిత్రం తీయలంటే బడ్జెట్ బాగా ఎక్కువ అవుతుంది. హాలీవుడ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ రీస్ట్రార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో ట్రైలర్ షూట్ కోసమే దాదాపు 9 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే బడ్జెట్ ఏ రేంజ్ లో అవసరమవుతుందో మీరు ఊహించుకోండి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మరో నాలుగు నెలల్లో దీనికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.అన్న కమల్ మాటలు ఒక్కసారి కలకలం రేపాయి.

    1997 లోనే ఒక సినిమా తీయాలనుకోవటం:

    1997 లోనే ఒక సినిమా తీయాలనుకోవటం:

    ఈ స్థాయి బడ్జెట్ లో 1997 లోనే ఒక సినిమా తీయాలనుకోవటం అన్న ఆలోచనే అతి పెద్ద సాహసం అనిపిస్తోంది. ఎందుకంటే ఒక ట్రైలర్ కోసం 9 కోట్లు ఖర్చయ్యాయి అంటే ఇక సినిమాకి ఎన్ని కోట్లు కవాలి? ఇప్పుడు ఊహించినా అది బాహుబలిని మించి పోయే బడ్జెట్ అవుతుంది. ఈ సాహసం చేయటానికి కమల్ సిద్దపడటం ఆ సినిమా తెరమీదికి తేవటానికి పడ్డ కష్టం మామూలుది కాదు.

    ఎదురు చూస్తున్న:

    ఎదురు చూస్తున్న:

    అయితే ఇప్పుడు ఆ సినిమా తెరమీదికి ఎక్కుతోంది అనగానే కమల్ అభిమానులే కాదు దేశవ్యాప్తంగా "మరుదనాయగం" కోసం ఎదురు చూస్తున్న సినీ అభిమానులంతా మళ్ళీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సారైనా కమల్ తన కలల ప్రాజెక్ట్ ని ఏ ఆతంకాలూ లేకుండా తెరమీదకి తెస్తాడని ఆశిద్దాం.

    English summary
    Now, it looks like the project which went on floors 18 years ago, has found its investors. According to the latest buzz, Lyca Productions, which is currently funding Rajinikanth's Enthiran 2, will join hands with Ayngaran International in order to produce Marudhanayagam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X