twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి పై అక్కసు వెనుక... కమల్ భాద పెద్దదే పాపం

    బాహుబలి సినిమా తీస్తారా అన్నందుకు 'నేనేమీ గొర్రెను కాదు.. ఎట్ లీస్ట్ గొర్రెల కాపరిని కూడా కాదు. నేను వేరే జాతికి చెందిన జంతువుని.అంటూ అసహనం ఫీలయ్యడు కమల్ హసన్.

    |

    విడుదలైన తొలి రోజు 100 కోట్లు, తొలివారం 1000 కోట్లు, మూడో వారం వచ్చేసరికి 1500 కోట్లు ఇలా బాహుబబలి ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. బాహుబలి విడులైనప్పటినుండి ప్రముఖుల ప్రశంసలను అందుకుంటూనే ఉంది. తాజాగా బాలీవుడ్ హీరోలు సైతం బాహుబలి అద్బుతమైన సినిమా అంటూ కితాబిచ్చారు. మాహిష్మతీ రాజ్యం లో నాకోక డబల్ బెడ్రూం ఫ్లాట్ కావాలి అంటూ బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ ట్వీట్ చేసి జక్కన్నని ఆకాశానికెత్తేసాడు.

    పొగడ్తలు తప్ప

    పొగడ్తలు తప్ప

    అలాగని బాహుబలి రెండుభాగాల్లో లోపాలు లేవని అనేందుకు అవకాశం లేదు. చెప్పుకునేందుకు చాలానే ఉంటాయి. అలాగని అందరూ పొగడ్తలు కురిపించడమే తప్ప.. అసలు బాహుబలి గురించి బ్యాడ్ గా ఎవరూ మాట్లాడ్డం లేదు. అందరూ పొగిడే సినిమాపై విమర్శిస్తే.. పని కట్టుకుని మాట్లాడుతున్నారని అనుకునే ప్రమాదం ఉండడమే ఇందుకు కారణం.

    బాహుబలి లాంటి సినిమా చేస్తారా

    బాహుబలి లాంటి సినిమా చేస్తారా

    అయితే.. విశ్వ నటుడు కమల్ హాసన్ మాత్రం ఇందుకు ఏ మాత్రం వెరవ లేదు.. అవసరమైతే బాహుబలిని విమర్శించేందుకు ఏ మాత్రం సంకోచించలేదు. బాహుబలి లాంటి సినిమా చేస్తారా అంటూ కమల్ హాసన్ కు మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి కాస్త అసహనం గా ఫీలైన కమల్ మామూలుగా చెప్పే ఆన్సర్ కన్నా కాస్త కోపంగానే సమాధానం చెప్పాడు.

    గొర్రెను కాదు

    గొర్రెను కాదు

    'నేనేమీ గొర్రెను కాదు.. ఎట్ లీస్ట్ గొర్రెల కాపరిని కూడా కాదు. నేను వేరే జాతికి చెందిన జంతువుని. బాహుబలి హిట్ అయింది కాబట్టి.. అలాంటి సినిమా నేను కూడా తీస్తా అనే రకం కాదు నేను' అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కమల్. అందరికీ నచ్చాలని ఏం లేదు కానీ ఒక సినిమాని అనుసరించి అదే ట్రెండ్ మొదలవుతుందన్న మాటనీ ఎవ్వరూ కాదనలేరు. కానీ కమల్ అలా మాట్లాడటం మాత్రం చాలామందికి కొంచం చికాకు గానే అనిపించింది.

    భారీ బడ్జెట్ సినిమా

    భారీ బడ్జెట్ సినిమా

    అయితే దీనివెనుక ఒక కథ ఉంది.... భారీ బడ్జెట్ సినిమా అన్న కాన్సెప్ట్ ని పేద్ద హైప్ చేద్దాం అనుకున్న వాళ్ళలో కమల్ ఒకరు ఇరవయ్యేళ్ళ కిందటే దాదాపు 100 కోట్లకి దగ్గర బడ్జెట్ తో మొదలు పెట్టిన మరుద నాగం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. దాన్ని పూర్తి చేయటానికి నానా తంటాలు పడుతూనే ఉన్నాడు కమల్.

    తిక్క రేగినట్టుంది

    తిక్క రేగినట్టుంది

    ఇప్పుడేమో బాహుబలి రాగానే తమిళ దర్శక నిర్మాతలంతా పులీ, సంఘమిత్ర అంటూ వందల కోట్ల ని అదే తరహా సినిమా తీయటానికి ప్రయత్నాలు చేస్తూండటం తో తిక్క రేగినట్టుంది కమల్ కి. ఒక సినిమా హిట్ కాగానే మళ్ళీ అదే తరహా సినిమాలని తీసి లాభాలు తెచ్చుకుందాం అనే ఫార్ములా కి వ్యతిరేకం అయిన కమల్ కి ఇప్పుడు "బాహుబలి లాంటి సినిమా తీస్తారా అన్న ప్రశ్న ఎంత చిరాకు తెప్పిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా...!

    వ్యతిరేకం అనుకోనక్కరలేదు

    వ్యతిరేకం అనుకోనక్కరలేదు

    సో..! ఎవరి ఫ్రస్ట్రేషన్లు వాళ్ళకుంటాయి. బాహుబలి లాంటి సినిమా చేయనూ అన్నత మాత్రాన కమల్ ఈ సినిమాకి వ్యతిరేకం అనుకోనక్కరలేదు, పోనీ నిజంగానే కమల్ కి నచ్చలేదు అనుకున్నా ఇప్పుడు బాహుబలికి గానీ, రాజమౌళికి గానీ వచ్చే నష్టమూ ఏమీ లేదు... అదన్నమాట సంగతి.

    English summary
    "Iam not a sheep, not even a shepperd.... Iam not going to make a movie like bahubali..." said Kamal Hasan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X