twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రాహ్మణులు ఆవు మాంసం తిన్నారు: కమల్ హాసన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గోవధ నిషేదంపై నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం గోవధపై మాత్రమే నిషేధం విధించడం సరికాదు. నిషేదం అంటూ విధిస్తే అన్నింటి మీద విధించాలి. ఏ జంతువుని చంపకూడదన్నారు. మహావిష్ణువు మత్స్యావతారం దాల్చాడు కనుక.. ఆవులాగే చేప కూడా పవిత్రమైందని, దాన్ని కూడా నిషేదించాలన్నారు.

    మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు సైతం చేపలు తింటున్నారని.. అదీకాక కొన్ని శతాబ్దాల క్రితం బ్రాహ్మణులు ఆవు మాంసాన్ని తినేవారన్న విషయం పురాతన గ్రంథాలలో ఉందన్నారు. మాంసాహారం, శాఖాహారం ఎవరికి ఇష్టానికి తగినట్టు వారు తీసుకునే వ్యక్తిగత నిర్ణయమని కమల్ హాసన్ స్పష్టం చేసారు. దీనిపై ఎవరి ఆంక్షలు ఉండకూడదన్నారు. మహారాష్ట్రలో గోవధ నిషేదాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేసారు.

     Kamal Hassan Controversial comments

    ఇక కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే...ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఉత్తమ విలన్' మే 1న విడుదలవుతోంది. కమల్‌హాసన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘ఉత్తమవిలన్‌'. ఎన్‌.లింగుస్వామి, కమల్‌హాసన్‌ నిర్మాతలు. ఆండ్రియా జెరీమియా, పూజా కుమార్‌, పార్వతి, జయరామ్‌, పార్వతి నాయర్‌ కీలక పాత్రధారులు. తిరుపతి బ్రదర్స్‌, రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. గిబ్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    చిత్ర దర్శకుడు రమేష్‌ అరవింద్‌ మాట్లాడుతూ ‘‘ఇందులో కమల్‌హాసన్‌గారు రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఎనిమిదో శతాబ్దానికి చెందిన తెయ్యమ్‌ ఆర్టిస్ట్‌ (ప్రత్యేకమైన మేకప్‌తో కేరళలో ప్రదర్శించే పురాతన కళ)గా, సినిమా ఆర్టిస్ట్‌గా రెండు పాత్రల్లోనూ మెప్పిస్తారు. తెయ్యమ్‌ ఆర్టిస్ట్‌గా నటించడానికి ఆయన ఎక్కువగా శ్రమించారు. ఆ పాత్రకు మేకప్‌ వేసుకోవడానికి దాదాపు నాలుగు గంటలు పట్టేది. కె.బాలచందర్‌, కె.విశ్వనాథన్‌ ఇందులో కీలక పాత్రలను పోషించారు. వాళ్లను దర్శకత్వం వహిస్తూ చాలా విషయాలను నేర్చుకున్నాను'' అని తెలిపారు.

    ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

    English summary
    Kamal Hassan Controversial comments on Cow slaughter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X