twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళితో చాలా కష్టం: బాహుబలి 2 గ్రాఫిక్స్ సూపర్ వైజ్ కమల్ కణ్ణన్

    రాజమౌళి లాంటి దర్శకుడితో పని చేయడం చాలా కష్టం అంటున్నారు బాహుబలి 2 విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ కమల్ కణ్ణన్.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి సినిమాల్లో గ్రాఫిక్స్ ఎంత పర్ఫెక్టుగా ఉంటాయో ఆయన సినిమాలన్నీ చూసి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి రాజమౌళి సినిమాల్లో గ్రాఫిక్స్ అంతఅద్భుతంగా ఉన్నాయంటే దాని వెనక ఉన్న వ్యక్తి.... విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ కమల్ కణ్ణన్.

    రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ, మగధీర, ఈగ లాంటి విజువల్ ఎపెక్ట్స్ ప్రధానమైన సినిమాలకు కమల్ కణ్ణన్ పని చేసారు. వేరే సినిమా కమిట్ కావడం వల్ల బాహుబలి-1కు మిస్సయిన కమల్ కణ్ణన్.... బాహుబలి-2కు పని చేస్తున్నారు.

    ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ ఉన్న నేపథ్యంలో కమల్ కణ్ణన్ కూడా మీడియా ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు. అన్ని విభాగాలపై పట్టున్న రాజమౌళి లాంటి దర్శకుడితో పని చేయడం చాలా కష్టం అంటున్నారు కమల్.

    బాహుబలి 2లో విజువల్ ఎఫెక్ట్స్ గురించి

    బాహుబలి 2లో విజువల్ ఎఫెక్ట్స్ గురించి

    వేరే సినిమా కారణంగా బాహుబలి పార్ట్ 1కి చేయలేక పోయాను. ఆ సినిమా రిలీజ్ తర్వాత అక్టోబర్ 16, 2015 న నేను బాహుబలి -2 సినిమాలో జాయిన్ అయ్యాను. 36 స్టూడియోలు విజువల్‌ ఎఫెక్ట్స్‌లో పాలు పంచుకొన్నాయి. వీఎఫ్‌ఎక్స్‌కి సంబంధించి దాదాపుగా 2226 షాట్స్‌ ఉన్నాయని తెలిపారు. అందుకోసం వెయ్యిమందికి పైగా సాంకేతిక నిపుణులు 18 నెలల పాటు కష్టపడ్డారు అని కమల్ కణ్ణన్ తెలిపారు.

    రాజమౌళితో చాలా కష్టం, అస్సలు ఒప్పుకోడు

    రాజమౌళితో చాలా కష్టం, అస్సలు ఒప్పుకోడు

    రాజమౌళికి అన్ని విభాగాలపై పట్టుుంది. ఏదైనా సీన్ లో రాజమౌళి చెప్పినట్టు గ్రాఫిక్స్ చేయడం కుదరదంటే అప్పుకోరు. గూగుల్లో వెతుకుతారు. వర్క్ పరంగా రాజమౌళిని సాటిస్పై చేయడం చాలా కష్టం అంటున్నారు కమల్.

    వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా కమల్ కణ్ణన్ బాధ్యత

    వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా కమల్ కణ్ణన్ బాధ్యత

    దర్శకుడు ఓ సన్నివేశం తీసిన తరవాత అతడికి కావాల్సిన విధంగా గ్రాఫిక్స్ చేయించడం మా బాధ్యత. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టూడియోల గురించి మాకు తెలుసు, ఏ సన్నివేశాన్ని ఎక్కడ బాగా తీర్చిదిద్దగలరో ఓ అంచనాకు వచ్చి....సమయానికి షాట్స్‌ సిద్ధం చేసి ఇచ్చే వారికి పని అప్పజెబుతాం. పని పూర్తయినతర్వాత ఆ సన్నివేశాలు దర్శకుడు అనుకున్న విధంగా వచ్చాయో లేదో పరిశీలించి... ఏదైనా మార్పులు కావాలంటే చేయిస్తామని కమల్ కణ్ణన్ తెలిపారు. బాహుబలి స్క్రిప్టులోనే ఏ సీన్ ఎలా ఉండాలో రాసుకున్నారు. తెరపై కనిపించే ప్రతీ గ్రాఫిక్‌... రాజమౌళి ఆలోచనల్లోంచి పుట్టిందే అని కమల్ తెలిపారు

    బాహుబలి 2లో ఎలాంటి అద్భుతాలంటే...

    బాహుబలి 2లో ఎలాంటి అద్భుతాలంటే...

    బాహుబలి పార్ట్ 1లో జలపాతం, మాహీష్మతీ రాజ్యం, యుద్ధాలు గ్రాఫిక్స్ లో చూపించారు. దేవసేన రాజ్యం కుంతల ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు. మాహీష్మతీ కంటే విభిన్నంగా కుంతల రాజ్యాన్ని ఆవిష్కరించాం. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో యుద్ధాలు మరింత థ్రిల్‌ కలిగిస్తాయి. జలపాతం లాంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. ప్రతీ సన్నివేశంలో కనీసం రెండు షాట్స్‌ అయినా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని కమల్ కణ్ణన్ తెలిపారు.

    గ్రాఫిక్స్ కోసం ఎంత ఖర్చు?

    గ్రాఫిక్స్ కోసం ఎంత ఖర్చు?

    బాహుబలి గ్రాఫిక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారనే విషయానికి కమల్ కణ్ణన్ సమాధానం లేదు. సీన్స్ సరిగా వచ్చాయా? లేదా? అనేది మాత్రమే నేను చూసుకున్నాను.... ఖర్చు విషయం ప్రొడక్షన్ టీం చూసుకుంది అని కమల్ కణ్ణన్ తెలిపారు. ఇలాంటి సినిమాలకు ఖర్చు విషయంలో నేను సలహాలు ఇవ్వలేను....ఖర్చు అనేది దర్శకుడికి కావాల్సిన క్వాలిటీపై ఆధారపడి ఉంటుందన్నారు. మహాభారతం లాంటి పెద్ద ప్రాజెక్టుకు గ్రాఫిక్స్ పరంగా ఎంత ఖర్చు అవుతుందో చెప్పడం కష్టమన్నారు.

    English summary
    Check out Kamal Kannan interview about Baahubali 2. Baahubali 2: The Conclusion is an upcoming Indian epic historical fiction film directed by S. S. Rajamouli. It is the continuation of Baahubali: The Beginning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X