»   » ఆ నటులు ఊరికే చావలేదు... అసలు వాస్తవాలు ఇవీ... ఇంత దారుణమా..!?

ఆ నటులు ఊరికే చావలేదు... అసలు వాస్తవాలు ఇవీ... ఇంత దారుణమా..!?

Posted by:
Subscribe to Filmibeat Telugu

ఓ కన్నడ సినిమా చిత్రీకరణ సందర్భంగా సోమవారం కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కన్నడ నటుడు దునియా విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న మాస్తిగుడి సినిమా షూటింగ్‌లో భాగంగా బెంగళూరు సమీపంలోని తిప్పగొండనహళ్లి లేక్‌లో హెలికాప్టర్‌ పైనుంచి దూకే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా మొదట ఇద్దరు వర్ధమాన నటులు ఉదయ్‌, అనిల్‌ హెలికాప్టర్‌ నుంచి దూకారు. అనంతరం చిత్ర కథానాయకుడు విజయ్‌ నీటిలోకి దూకాడు. అయితే వీరిలో ఉదయ్‌, అనిల్‌ మృతి చెందారు. వెంటనే స్పందించిన చిత్ర బృందం కథానాయకుడు విజయ్‌ను రక్షించింది.

శ్యాండిల్ వుడ్ విలన్లు అనీల్, ఉదయ్ చావుకు మాస్తిగుడి సినిమా యూనిట్ సభ్యుల నిర్లక్షమే కారణం అని తాము ఎంత చెప్పినా వారు పట్టించుకోలేదని జలమండలి అధికారులు ఆరోపించారు. తాము ముందుగా సూచించిన సలహాలు గాలికి వదిలివేసి ఇష్టం వచ్చినట్లు షూటింగ్ చెయ్యడం వలనే ఇద్దరు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అధికారులు అంటున్నారు. భోజనం చెయ్యడానికి వెళ్లిన సమయంలో దర్శకుడు నియమాలు గాలికి వదిలి సినిమా షూటింగ్ మొదలు పెట్టారని జలమండలి అధికారులు పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది ఇప్పుడు ఆ ఇద్దరు నటుల మరణానికి ఎవరు భాద్యత వహిస్తారు???

చావుకు మీరే కారణం:


దునియా విజయ్ హీరోగా నటిస్తున్న మాస్తిగుడి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ సమయంలో జలసమాధి అయిన ప్రతినాయకులు అనీల్, రాఘవ్ ఉదయ్ చావుకు మీరే కారణం అంటూ సినిమా యూనిట్ సభ్యుల మీద రామనగర జిల్లా తావరకెరె పోలీసులు కేసు నమోదు చేశారు.

సహజంగా తీయాలని :


సినిమా క్లైమాక్స్ దృశ్యాలను మరింత సహజంగా తీయాలని స్టంట్ డైరెక్టర్ రవి వర్మ ప్రయత్నించడం ఇద్దరు కన్నడ నటుల ప్రాణాలను హరించింది. తమకు ఈత రాదని ఎంత మొత్తుకున్నా వినని రవి వర్మ, వీరిని చాపర్ నుంచి కిందకు దూకాల్సిందేనని చెప్పడం,

జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే:

ఆపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే 'యాక్షన్' చెప్పడం వీరి మరణానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన వెనుక చిత్ర యూనిట్ నిలువెత్తు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. లైఫ్ జాకెట్లు అందుబాటులో లేకపోవడం, మరపడవలు దూరంగా ఉండటం తదితరాలు వారి మరణానికి కారణమయ్యాయి.

మాస్తిగుడి సినిమా:


కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ తయారు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాస్తిగుడి సినిమాలో ప్రతినాయకులు అయిన అనీల్, ఉదయ్ చావుకు కారణం అయ్యారంటూ ఐపీసీ సెక్షన్ 304 (ఆ), 308 కింద నాన్ బెయిల్ కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

ఉదయ్, అనిల్ ఇనే ఇద్దరు విలన్లు:


ఇద్దరు నటులు మృతి చెందిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో కన్నడ చిత్ర పరిశ్రమను విషాద వాతావరణం ఆవరించింది. నిర్లక్ష్యం కారణంగానే ఉదయ్, అనిల్ ఇనే ఇద్దరు విలన్లు మరణించినట్లు భావిస్తున్నారు.

స్టంట్‌ డైరెక్టర్‌ రవి వర్మ:


తమకు ఈత రాదు మొర్రో అని మొత్తుకుంటున్నా స్టంట్‌ డైరెక్టర్‌ రవి వర్మ వీరిద్దరితో సహజత్వం కోసం ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టకుండానే సన్నివేశాలను చిత్రీకరించడంపై కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

తీవ్ర దిగ్భ్రాంతి :


ఇద్దరు గొప్ప విలన్లను కోల్పోవడం బాధగా ఉందని కన్నడ సాంస్కృతిక శాఖా మంత్రి ఉమశ్రీ ఆవేదన చెందారు. అగ్ర నటులు డాక్టర్‌ శివరాజ్‌ కుమార్‌, కిచ్చ సుదీప్‌, జగ్గేష్‌లు కూడా ఈ దారుణ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మూడు రోజుల క్రితమే:


వారిద్దరి కోసం గజఈతగాళ్లు అన్వేషిస్తున్నారు. ప్రత్యేక బోట్లతో గాలిస్తున్నారు. వారిద్దరు సునీల్‌తో కలిసి తెలుగు సినిమా జక్కన్నలో నటించారు.ఇద్దరిలో ఉదయ్‌ మూడు రోజుల క్రితమే పెళ్ళి చూపులకు వెళ్లివచ్చాడు. తన అక్క, చెల్లె వివాహాలు జరిపి తాను కూడా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నంతలోనే అతన్ని మృత్యువు కాటేసింది.

ఆమె ఆశీర్వాదం తీసుకొని :


మరో విలన్ అనిల్‌కు వివాహమై ఇద్దరు బిడ్డలున్నారు. వీరిద్దరి అకాల మృతితో ఆధారం కోల్పోయిన కుటుంబాలు ఆధారం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నాయి.విలన్ ఉదయ్‌ ఎక్కడికి వెళ్ళినా ప్రతి రోజూ తన తల్లి కౌశల్యకు చెప్పి ఆమె ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్లేవాడు.

అంతా కలిసే వెళ్ళారు:


కాని సోమవారం మాస్తిగుడి చిత్రం క్లైమాక్స్‌కు వెళ్తున్న సమయంలో అమ్మ ఇంట్లో లేని కారణంగా అది సాధ్యం కాలేదు. ఈ విషయాన్ని మీడియాకు చెబుతూ ఉదయ్‌ తల్లి కౌశల్య కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఉదయ్‌కు పెళ్ళి చూపుల కోసం దూరపు బంధువులున్న ఆంధ్రహళ్ళికి మూడు రోజుల క్రితం అంతా కలిసే వెళ్ళారు. అయితే ఉదయ్‌ మాత్రం నేరుగా షూటింగ్‌కు వెళ్లిపోయాడు.

విలన్లుగా ఎదిగారు:


ఉదయ్‌, అనిల్‌లు ఒకేసారి కన్నడ సినీ పరిశ్రమలోకి ఒకసారే ప్రవేశించారు. ఒకసారే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ ప్రారంభించి దేహదారుడ్యాన్ని పెంచుకొని విలన్లుగా ఎదిగారు. వీరు విలన్లుగా నటించిన పలు చిత్రాలు బాక్సాఫీసు రికార్డులు సృష్టించాయి.

విజయ్‌ కాళ్ళకు మొక్కి :


కన్నడ నాట అందరూ ప్రముఖ హీరోలతోనూ వీరు నటించారు. పేదరికం అనుభవించి ఎదిగిన వీరిద్దరూ దునియా విజయ్‌నే తమ పెద్దన్నగా భావించేవారు. హెలికాప్టర్‌ నుంచి చెరువులోకి దూకే సన్నివేశ చిత్రీకరణ ముందు కూడా వీరిద్దరు విజయ్‌ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం పొందడం గమనార్హం.

హీరో దునియా విజయ్:


తాము గురువుగా భావించే మాస్తిగూడి సినిమా హీరో దునియా విజయ్ కి హెలికాప్టర్ నుంచి కిందకు దూకే ముందు అనీల్, ఉదయ్ ఇద్దరూ ఆయన పాదాలకు నమస్కరించి కిందకు దూకి జలసమాధి అయ్యారు. తమకు సినీరంగంలో జన్మనిచ్చిన గురువు దునియా విజయ్ కు ఈ విధంగా రుణం తీర్చుకుని దేవుడి దగ్గరకు వెళ్లిపోయారని వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

తారుమారైయ్యింది:


ఇప్పటి వరకు కన్నడ సినిమా రంగంలో అనీల్, ఉదయ్ చిన్నచిన్న పాత్రలు చేసుకుంటు వచ్చారు. అయితే మొదటి సారి మెయిన్ విలన్లుగా మాస్తిగుడి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల అయిన తరువాత మీరిద్దరూ బిజీ అయిపోతారని అందరూ చెప్పేవారు. అయితే పరిస్థితి తారుమారైయ్యింది.

నీళ్లలో దూకడానికి అనుమతి లేదు:


ఆ ఒక్క రోజు షూటింగ్ కోసం రూ. 32 లక్షలు ఖర్చు చేశారు. అనుమతి కూడా ఏరియల్ షూటింగ్‌కు మాత్రమే అనుమతి లభించినట్లు తెలుస్తోంది. నీళ్లలో దూకడానికి అనుమతి ఇవ్వలేదని సమాచారం. ఒక్క రోజు షూటింగ్ కోసం అనుమతి లభించింది. అది కూడా సూర్యాస్తమయం అయ్యే లోగా ముగించాలని షరతు పెట్టారు.

ఖర్చులు తగ్గించుకోవడానికి :


ఖర్చులు తగ్గించుకోవడానికి కన్నడ సినీ పరిశ్రమలో నిర్మాతలు రిహార్సల్స్‌ను, ముందస్తు ప్రాక్జీస్‌ను వదిలేస్తున్నారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కన్నడ సినీ పరిశ్రమలో ఇతర భాషా పరిశ్రమల్లో మాదిరిగా ఎక్కువ ఖర్చు చేయబోరని, తక్కువ బడ్జెట్‌తో ఖర్చును తగ్గిస్తూ సినిమాలు తీస్తారని అంటున్నారు.

నిర్లక్ష్యమే అసలు కారణం :


జలాశయాన్ని పరీక్షించలేదని తాను నమ్ముతున్నట్లు ఓ ప్రముఖ నటుడు అన్నారు. వారిని బయటకు లాగడానికి తగిన రక్షణ చర్యలు కూడా తీసుకోలేదని, ప్రమాదాన్ని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండిందని, కానీ అది జరగలేదని అన్నారు .

యాక్టర్లను రిస్క్‌లోకి నెడుతారు:


ఫ్రేమ్స్, బ్యాక్ గ్రౌండ్‌తోనే కొన్ని సార్లు కొరియోగ్రాఫర్లు ముందుకు వెళ్తారని, యాక్షన్ లేదా సాంగ్ సీక్వెన్సెస్‌లో హేతువు కన్నా సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇచ్చి యాక్టర్లను రిస్క్‌లోకి నెడుతారని ఆమె అన్నారు. జలాశయం నుంచి అనిల్, ఉదయ్‌ల మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు మంగళవారంనాడు కూడా గాలింపు చర్యలు సాగిస్తున్నాయి.

షరతులు పాటించలేదని:

తిప్పగుండనహళ్ళి జలాశయం (చెరువు) పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ లు చెయ్యాలంటే జలమండలి పలు షరతులు పెట్టింది. మేము చెప్పిన షరతులను మాస్తిగుడి సినిమా యూనిట్ సభ్యులు పాటించలేదని జలమండలి అధికారులు అంటున్నారు.

 

 

నిషేధిత ప్రాంతంలోకి వెళ్లి :


సోమవారం మద్యాహ్నం భోజనం చెయ్యడానికి వెళ్లిన సమయంలో షూటింగ్ మొదలు పెట్టారని జలమండలి అధికారులు ఆరోపిస్తున్నారు. నిషేధిత ప్రాంతంలోకి వెళ్లి షూటింగ్ చెయ్యడం వలనే ఇంత జరిగిందని అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

 

English summary
No one meant for lives to be lost but lack of adequate safety measures and violating norms pushed 2 actor to their watery grave. The crew had waited for a month and half for permissions to be granted. Rs 32 lakh was being spent on this one-day shoot.
Please Wait while comments are loading...