twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అత్తారింటికి దారేది' కన్నడ క్లైమాక్స్ ఇలా...(ఫొటో)

    By Srikanya
    |

    బెంగుళూరు: 'అత్తారింటికి దారేది' కన్నడ వెర్షన్ లో సుదీప్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా ప్రత్యకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది. రీసెంట్ గా ఈ చిత్రం క్లైమాక్స్ సీన్ ని చిత్రీకరించారు. క్లైమాక్స్ లో అత్త ఒళ్లో తలపెట్టి ఎమోషన్ అయ్యే సన్నివేశం తీసారు. మీరు ప్రక్కన చూస్తున్న ఫొటో అదే. తెలుగు వెర్షన్ దగ్గర పెట్టుకుని ఏజటీజ్ తీస్తున్నట్లు ఉన్నట్లు ఉంది కదా. రీమేక్ లు అంటే అంతే మరి.

    పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను కన్నడలో సుదీప్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ ని రానా గా ఫైనలైజ్ చేసి, సుదీప్ పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. ఆ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    Kannada Pawan Kalyan cries in her Lap

    అత్తారింటికి దారేది చిత్రం రీమేక్ రైట్స్ చంద్రశేఖర్ అనే నిర్మాత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని 'నిమిషాంబ ఫిల్మ్స్' పతాకంపై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. తెలుగులో ఈచిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. కన్నడ వెర్షన్ కు గానూ నంద కిషోర్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హరిప్రియ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ప్రణిత పోషించిన పాత్రలో కనిపించనుంది. సమంత పాత్రలో కన్నడ హీరోయిన్ రచిత రామ్ నటిస్తుంది.

    కన్నడ సీమలో మాత్రం సుదీప్ సూపర్‌స్టార్. తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్ చేసి అక్కడ విజయాలు అందుకోవడంలో కూడా సుదీప్ దిట్ట. ప్రభాస్ ‘మిర్చి' సినిమా కన్నడంలో సుదీప్ హీరోగా ‘మాణిక్య' పేరుతో రీమేకై అక్కడ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆ విజయం తాలూకు ఆనందంలో తేలియాడుతున్నారు.

    English summary
    Buzz is that recently, the makers of Kannada remake of Attarintiki Daredi have shot climax portions in a railway station where Sudeep was seen crying in Madhoo's laps.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X