twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి సూపర్ హిట్ 'పదహారేళ్ళ వయస్సు' రీమేక్

    By Srikanya
    |

    ముప్పై ఏళ్ళ క్రితం శ్రీదేవి, చంద్రమోహన్ జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో పదహారేళ్ళ వయస్సు చిత్రం వచ్చింది. అప్పట్లో సంచలన విజయం సాధించింది. వాస్తవానికి ఆ చిత్రం తమిళ రీమేక్. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి తమిళంలో చేసారు. ఇన్నాళ్ళయినా ఆ చిత్రం తన మ్యాజిక్ ని కోల్పోలేదు. కన్నడ హీరో గణేష్ ఆ చిత్రాన్ని కన్నడంలో చేయటానికి తాజాగా రైట్స్ తీసుకున్నారు. ఈ విషయమై గణేష్ మాట్లాడుతూ..ఇంతకాలం అయినా ఆ చిత్రం మొన్న టీవీలో చూస్తూంటే చాలా ప్రెష్ గా అనిపించింది.దాంతో ఉండబట్టలేక నా భార్యను తీసుకుని చెన్నై వెళ్లి ఆ రైట్స్ సొంతం చేసుకున్నాను. ప్రస్తుతానికి హీరోయిన్ ఎవరు చేయాలన్నదానికి నా దగ్గర సమాధానం లేదు. అలాగే రజనీకాంత్ లా విలన్ పెరఫార్మెన్స్ చేసే వారు దొరకాలి. అప్పుడు ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అవుతుంది అన్నారు. నిజానికి ఈ చిత్రం రైట్స్ తన దగ్గర ఉన్నాయి. ఎవరైనా నిర్మాతలు మంచి ఆఫర్ తో వస్తే చేద్దాం అనేది దాని సారాంశం. ఇక గణేష్ ముంగారమలై చిత్రం(తెలుగులో వాన)తో కన్నడంలో స్టార్ అయ్యారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X