»   » రాజుగారి గది 2: పివిపితో చేతుల కలిపిన ఓంకార్....

రాజుగారి గది 2: పివిపితో చేతుల కలిపిన ఓంకార్....

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆట డ్యాన్స్ షోతో పాటు పాపులర్ టీవీ యాంకర్ గా పేరు తెచ్చుకుని సినిమా రంగంలో దర్శకుడిగా రాజుగారి గది వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను రూపొందించిన ఓంకార్, ప్రముక నిర్మాణ సంస్థ బ్యానర్ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కాంబినేషన్ లో రాజుగారి గది2 రూపొందుతోంది.

2015లో విడుదలైన రాజుగారి గది చిత్రం పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాకుండా హర్రర్ కామెడి జోనర్ లో ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఓంకార్ రాజుగారి గది చిత్రాన్ని వారాహి చలనచిత్రంతో సహకారంతో నిర్మించిన సంగతి తెలిసిందే.

Ohmkar, PVP  matinee entertainments

కాగా రాజుగారి గది2 చిత్రానికి పివిపి సినిమా బ్యానర్ తోడు కావడంతో కాస్టింగ్ విషయంలో కానీ, టెక్నికల్ పరంగా కానీ సినిమా స్కేల్ పెరిగింది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారు.

Ohmkar, PVP  matinee entertainments

పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్నమెంట్, ఓక్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్స్ సంయుక్తంగా రాజుగారి గది 2 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలు, నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు తెలియజేస్తామని పివిపి సినిమా వర్గాలు తెలియజేశాయి.

English summary
Popular TV anchor turned film maker Ohmkar and prestigious PVP Cinema banner matinee entertainment have joined hands for Raju Gari Gadhi 2, coming as sequel to Raju Gari Gadhi. As we all know, Raju Gari Gadhi unfolded as highest profit making venture in 2015 earmarking a new era in Telugu cinema horror comedy genre. After the association of Ohmkar with Vaaraahi Chalana Chitram banner for the first part, now PVP Cinema is elated to unite with Ohmkar working on Raju Gari Gadhi 2, to be made on a larger canvas with sizeable casting; great technical values. Pearl V Potluri, Param V Potluri and Kavin Anne are the producers.
Please Wait while comments are loading...