»   » ‘హీరోయిన్’ తెరవెనక భాగోతం, పెద్దలకు మాత్రమే!

‘హీరోయిన్’ తెరవెనక భాగోతం, పెద్దలకు మాత్రమే!

Posted by:
Subscribe to Filmibeat Telugu
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ముఖ్య పాత్రలో...చాందినీ బార్, ఫ్యాషన్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన మధుర్ బండార్క్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'హీరోయిన్'. తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. కథలో భాగంగా మితిమీరిన రొమాన్స్, డ్రింకింగ్, స్మోకింగ్ లాంటి సినిమాలో తప్పనిసరి. దర్శకుడు మధుర్ ఊహించినట్లే సెన్సార్ బోర్డు ఈచిత్రం పెద్దలకు మాత్రమే పరిమితం అని సర్టిఫికెట్ ఇచ్చింది.

పైకి అందంగా ఒయ్యారాలు ఒలక బోస్తూ కనిపించే బార్ గర్ల్స్, మోడల్స్ జీవితాలు తెర వెనక ఎలా ఉంటాయి అని తన గత చిత్రాలో కళ్లకు కట్టినట్లు చూపించిన మధుర్...ఈ సారి హీరోయిన్ల జీవితాల్ని 'హీరోయిన్' చిత్రంలో ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కింది స్థాయి నుంచి వచ్చిన హీరోయిన్ల జీవితం ఎలా ఉంటుంది, వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి? అనే అంశాన్ని బేస్ చేసుకుని ఈచిత్రాన్ని నిర్మించారు.

రోనీ, మాధుర్ బండార్క్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి దాదాపు రూ. 18 కోట్లు ఖర్చు పెట్టారు. సెప్టెంబర్ 21వ తేదీన ఈచిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాధర్ దర్శకత్వంలో వచ్చిన చాందినీ బార్, ఫ్యాషన్, పేజ్ త్రీ, ట్రాఫిక్ సిగ్నల్ చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. పైగా కరీనా కపూర్ హీరోయిన్ కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

English summary
Heroine gets an ‘A' certificate by the Censor Board. But, Bhandarkar is neither surprised, nor disappointed over this as it was very much expected. "As expected got a ‘A' certificate from the censor board," Bhandarkar tweeted. Heroine, that features Kareena Kapoor in the lead role, Heroine will take us on a voyeuristic journey to see what really goes on behind the closed doors of make up rooms and vanity vans. Heroine has a lot of bold scenes, drinking, smoking sequences, that's strictly for the adults.
Please Wait while comments are loading...