twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెలియా కథ చెప్పగానే ఆయనే గుర్తొచ్చారు.. మణిరత్నం చివాట్లు పెట్టారు..

    భిన్నమైన పాత్రలను ఎంచుకోవడంలో తమిళ నటుడు కార్తీది ప్రత్యేకమైన శైలి. విలక్షణమైన పాత్రలతో అటూ తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ముద్ర వేసుకొన్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో చెలియా చిత్రంలో నటించా

    By Rajababu
    |

    భిన్నమైన పాత్రలను ఎంచుకోవడంలో తమిళ నటుడు కార్తీది ప్రత్యేకమైన శైలి. విలక్షణమైన పాత్రలతో అటూ తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ముద్ర వేసుకొన్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో చెలియా చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 7 తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నది. ఈ సందర్బంగా చిత్ర విశేషాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ చిత్రంలో అదితి రావు హైదరీ, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు నటించారు. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రవివర్మన్ సినిమాటోగ్రఫీని అందించారు.

    చెలియా నా కెరీర్‌లోనే ప్రత్యేకమైనది..

    చెలియా నా కెరీర్‌లోనే ప్రత్యేకమైనది..

    సంచలన దర్శకుడు మణిరత్నం వద్ద నా సినీ జీవితం ప్రారంభమైంది. దర్శకత్వ శాఖలో రెండేళ్లు పనిచేశాను. దర్శకుడిగా కావాలనుకొన్న నేను ఊహించని విధంగా నటుడిని అయ్యాను. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాను. తాజాగా మణిరత్నం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. చెలియా చిత్రం నా కెరీర్‌లోనే ప్రత్యేకమైనది అని కార్తీ తెలిపారు.

    మణిరత్నం ఫోన్ చేసి..

    మణిరత్నం ఫోన్ చేసి..

    ఒకరోజు మణిరత్నం ఫోన్ చేసి నా వద్ద కథ ఉంది. నాతో సినిమా చేస్తావా అని అడిగారు. అయితే అందుకు నాతో సినిమా చేయాలా? వద్దా అనే విషయం నిర్ణయించుకోవాల్సింది మీరు. మీతో సినిమా అంటే ఎప్పుడైనా సిద్ధమే అని నేను అన్నానని కార్తీ వెల్లడించారు.

     కథ వినగానే సూర్య గుర్తొచ్చారు..

    కథ వినగానే సూర్య గుర్తొచ్చారు..

    మణిరత్నం కథ చెప్పగానే మొదట నాకు గుర్తొచ్చింది అన్నయ్య సూర్య. చెలియా చిత్రం ఆయన మాత్రమే చేయగలడని అనిపించింది. నేను చేయగలనా అనే సందేహాన్ని మణిరత్నం వద్ద వ్యక్త పరిచినప్పుడూ నాలో ధైర్యాన్ని నింపారు. పాత్ర కోసం పూర్తిగా మారిపోతే అద్భుతం పాత్రను పండించగలవు అని అండగా నిలిచారు అని కార్తీ పేర్కొన్నారు.

    డాక్టర్, పైలెట్ మధ్య ప్రేమ కథ

    డాక్టర్, పైలెట్ మధ్య ప్రేమ కథ

    చెలియా చిత్రం ఓ ఫైటర్ పైలెట్‌కు, మహిళా డాక్టర్‌కు మధ్య సాగే ప్రేమకథా చిత్రమిది. శ్రీనగర్ నేపథ్యంగా సాగుతుంది. వృత్తిపరంగా అనేక సవాళ్లను ఎదుర్కొనే యువ జంట మధ్య ఉన్న అనుబంధాన్ని మణిరత్నం సినిమాలో హృద్యంగా ఆవిష్కరించారు. కశ్మీర్‌, ఉత్తర భారతదేశంలోని పలు లొకేషన్లలో సుమారు మైనస్15 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్‌ చేశాం అని కార్తి తన అనుభవాలను పంచుకొన్నారు.

    భిన్నంగా చెలియా చిత్రం..

    భిన్నంగా చెలియా చిత్రం..

    గతంలో నేను నటించిన చిత్రాలకు భిన్నంగా చెలియా చిత్రంలో పాత్ర ఉంటుంది. ఈ పాత్ర కోసం చాలా మంది పైలట్లను కలిశాను. వారి వద్ద నుంచి చాలా నేర్చుకొన్నాను. పాత్రను అద్భుతంగా పోషించేందుకు అవి చాలా సహరించాయి అని చెప్పుకొచ్చారు.

    మణిరత్నం అలా చివాట్లు పెట్టారు..

    మణిరత్నం అలా చివాట్లు పెట్టారు..

    సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న కాలంలో మణిరత్నం చాలాసార్లు చివాట్లు పెట్టాడు. చెలియా చిత్రంలో పాత్రకు ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్నాను. సన్నివేశాలను మెరుగుపరుచడానికి కోసం ఆయనతో చాలాసార్లు చర్చించే అవకాశం లభించడం ఓ మంచి అవకాశం అని కార్తీ తెలిపారు.

     మేజర్ పాత్ర గుర్తొచ్చింది..

    మేజర్ పాత్ర గుర్తొచ్చింది..

    చెలియా సినిమాలో నన్ను నేను తెరపై చూసుకుంటే నిన్నే చూస్తున్నట్లు ఉంది అని అన్నయ్య సూర్యకు చెప్పాను. ఈ సినిమా కథ వినగానే నాకు అన్నయ్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో మేజర్ క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. రెగ్యులర్ సినిమాల్లా కాకుండా సీరియస్‌గా, విభిన్న రీతిలో మణిరత్నం నన్ను తెరపై ఆవిష్కరించారు.

    English summary
    Karthik Sivakumar aka Karthi's Latest movie is Cheliyaa. This movie set release on April 7. In this occassion Karthi shared lighter moments in the movie and Maniratnam's making style etc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X