»   » మూడో పోస్టర్: ‘కాటమరాయుడు’ ఫుల్ లుక్కే కానీ....

మూడో పోస్టర్: ‘కాటమరాయుడు’ ఫుల్ లుక్కే కానీ....

ఫుల్ లుక్ రిలీజైంది కానీ అందులో పవన్ ఫేస్ కనిపించడం లేదు. దీంతో నిర్మాత శరత్ మరార్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కిషోర్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కాటమరాయుడు'. పవన్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, హీరోయిన్ శృతి హాసన్ లుక్ రిలీజ్ చేసారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా పంచకట్టులోనే కనిపించబోతున్నాు. 2017 న్యూఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ పంచ కట్టు లుక్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే రెండు రోజుల ముందు నుండి ఈ సందడి ప్రారంభమైంది. డిసెంబర్ 28న పంచె కట్టుతో పవన్ కాళ్ల సైడ్ యాంగిల్ చూపిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు.

తాజాగా ఈ రోజు ఉదయం మరో పోస్టర్ రిలీజ్ చేసారు. అయితే ఇందులోనూ బ్యాక్ యాంగిల్ లో కాళ్లు మాత్రమే చూపించడంతో..... ఇది మరీ టూమచ్ అంటూ విమర్శలు వచ్చాయి. సాయంత్రం ఫుల్ లుక్ రిలీజైంది కానీ అందులో పవన్ ఫేస్ కనిపించడం లేదు. దీంతో నిర్మాత శరత్ మరార్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.

అందుకే అలా

సినిమాలో పవన్ కళ్యాణ్ మొత్తం పంచెకట్టులోనే కనిపిస్తారు. అందుకే సినిమాకు ఆయన పంచెకట్టు లుక్ చాలా ఇంపార్టెంట్. ఆ లుక్కును జనాల్లోకి తీసుకెళ్ళాలని ఇలా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.

ఫుల్ లుక్

పంచె కట్టులో పవన్ కళ్యాణ్ ఫుల్ లుక్ డిసెంబర్ 30న రిలీజ్ చేయబోతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ను పంచె కట్టులో చూసినప్పటికీ.... కాటమరాయుడు పంచెకట్టులో పవన్ చాలా కొత్తగా కనిపిస్తారని అంటున్నారు నిర్మాత.

ఫుల్ లుక్ బ్యాక్

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు 3వ పోస్టర్లో ఫుల్ లుక్ రిలీజ్ చేసారు. అయితే ఇది వెనక వైపు నుండి మాత్రమే ఉంది. ఫేస్ కనిపించేలా ఫ్రంట్ లుక్ డిసెంబర్ 30న రిలీజ్ చేయబోతున్నారు.

పవన్ కళ్యాణ్ ఫిర్యాదుతో ఇబ్బంది పడ్డా, ఇలాంటివి మామూలే అంటున్న నిర్మాత!

వర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినిమాల వల్ల నష్టాలు వస్తే ఆయా నిర్మాతలను, లేదా డిస్ట్రిబ్యూటర్లు ఆదుకునే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా ఆయన సినిమాల విషయంలో, రెమ్యూనరేషన్ విషయంలో ఎవరిపైనా...పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆశ్చర్యపోయే వార్త: మోహన్ లాల్ , పవన్ కాంబినేషన్ ..దాదాపు ఫిక్స్ అయినట్లే

వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న వార్తే అయినా ఇది నిజం అంటోంది మళయాళి పరిశ్రమ. మోహన్ లాల్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కు చేస్తున్న ప్రయత్నాలు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Pawan Kalyan's Katamarayudu 3rd new year poster released . Total get up will be revealed by the evening of 30 December.
Please Wait while comments are loading...