twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కాటమరాయుడు’ టాక్, కథ ఏంటి?, యునానమస్‌గా అదే మాట, అదొక్కటే మైనస్?

    'కాటమరాయుడు' చిత్రం కువైట్ రిపోర్ట్

    By Srikanya
    |

    హైదరాబాద్‌: 'సర్దార్‌గబ్బర్‌ సింగ్‌' ఆశించిన ఫలితంఇవ్వకపోవడంతో ఆ లోటు భర్తీ చేసేందుకు ఈ సారి పవన్‌కల్యాణ్‌ అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుని 'కాటమరాయుడు'తో థియేటర్లలో దిగుతున్నారు. ఇప్పటికే కువైట్‌లో సినిమా షో పూర్తైంది. మరి సినిమా ఫస్ట్‌ టాక్‌ ఎలా ఉంది? అసలు సినిమా కథేంటి, హిట్ అవుతుందా, బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా తేడా కొట్టిందా...అనే విషయాలు అక్కడ వారు చూసి చెప్పిన దాన్ని బట్టి పరిశీలిద్దాం.

    తమిళంలో ఘన విజయం సాధించిన 'వీరమ్‌'కి ఇది రీమేక్‌. అయినా పవన్‌ శైలికి, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసింది చిత్ర యూనిట్. పవన్‌ గెటప్‌ విషయంలో చిత్రబృందం చాలా కసరత్తులే చేసింది. ఆయన దుస్తులు, మెళ్లొ రుద్రాక్ష, చేతికి వాచీ... ఇలా ప్రతీ అంశంలోనూ కొత్తదనం కనిపించేలా జాగ్రత్తపడింది. మరీ ముఖ్యంగా పోరాట ఘట్టాల్ని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేసింది.

    పూర్తి స్దాయిలో

    పూర్తి స్దాయిలో

    ఫస్ట్ ఈజ్ ఫస్ట్... ఈ సినిమా చూసిన వారు ఇనానమస్ గా చెప్తున్నది ఒకటే మాట. అది పవన్‌కల్యాణ్‌ వన్‌మాన్‌ షో చేశారు. ఆయన క్యారక్టర్ మొదటి నుంచి చివరి దాకా ఎంటర్టైన్మెంట్ తో సాగింది అని.

    అదే ఫ్యాన్స్ నచ్చుతోంది

    అదే ఫ్యాన్స్ నచ్చుతోంది

    అలాగే పవన్ రీసెంట్ హిట్ అత్తారింటికి దారేది తర్వాత ఆ స్థాయిలో ఈ సినిమాలో చాలా ఉషారుగా కన్పించాడని అంటున్నారు. సినిమా మొత్తం పవన్‌ పంచెకట్టుతో కన్పిస్తూ అలరించటం ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేస్తోంది.

    ఆ సీన్స్ సూపర్

    ఆ సీన్స్ సూపర్

    అయితే పాటల్లో డ్యాన్స్‌ల మీద పవన్‌ మరికొంత దృష్టి పెట్టి ఉంటే బాగుండేదన్న మాట కొంతవరకూ విన్పిస్తోంది. శ్రుతి హాసన్‌తో లవ్‌ ట్రాక్‌ చాలా బాగుందని.. అన్నదమ్ముల మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయని చెబుతున్నారు.

     పూర్తిగా ఫాలో అయినా

    పూర్తిగా ఫాలో అయినా

    దర్శకుడు తమిళ ఒరిజనల్ వీరమ్‌ను పూర్తిగా ఫాలో అయినప్పటికీ పవన్‌కల్యాణ్‌ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దాడని ఇది అభిమానులకు పండగేనని అంటున్నారు. క్లైమాక్స్‌లో అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషన్‌ సీన్లు అలరించాయని చెబుతున్నారు. మొత్తం మీద ‘కాటమరాయుడు' అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తాడని చెబుతున్నారు.

    అమ్మాయిలకు దూరం

    అమ్మాయిలకు దూరం

    కాటమరాయుడు (పవన్‌ కల్యాణ్‌) ఆ వూరికి పెద్ద. ధనవంతులైన దుర్మార్గుల కొమ్ములు విరిచి, పేదవాళ్లకు పెట్టాలన్న తాపత్రయం ఉన్నవాడు. తమ్ముళ్లంటే ప్రాణం. వాళ్ల కోసం ఏమైనా చేస్తాడు. కానీ... అమ్మాయిలంటే పడదు. తమ్మూళ్లకీ అంతే. అన్నయ్య మాట వేదం... అమ్మాయిలకు దూరం. ఇలాంటి కాటమరాయుడి జీవితంలోకి అవంతిక (శ్రుతిహాసన్‌)లాంటి అందమైన అమ్మాయి ప్రవేశిస్తే ఏమవుతుంది? కాటమరాయుడుకీ ఆ వూర్లోని నర్సప్ప (రావు రమేష్‌)కీ ఉన్న వైరం ఏమిటి? ఈ విషయాలు తెలియాలంటే ‘కాటమరాయుడు' సినిమా చూడాల్సిందే.

    ఆ ఫైట్ గురించి అితే

    ఆ ఫైట్ గురించి అితే

    ఈ సినిమాలో ఐదు ఫైట్స్ ఉన్నాయి. వాటిని రామ్‌ లక్ష్మణ్‌ చాలా వైవిధ్యంగా తెరకెక్కించారు. ఫైట్‌ కోసం ఫైట్‌ అన్నట్టు కాకుండా.. ప్రతీ ఫైట్ లోనూ కథ చెప్పే ప్రయత్నం చేశాం. పంచె కట్టుతో పవన్‌ చేసిన ఫైట్‌ గురించి అభిమానులు చాలా కాలం వరకూ మాట్లాడుకొంటూనే ఉంటారు.

    కొత్త ఒరవడి

    కొత్త ఒరవడి

    ఓ హీరో పూర్తి స్థాయిలో పంచెకట్టుతో కనిపించడం ఈమధ్య కాలంలో మనం చూళ్లేదు. పవన్‌ ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆయన పాత్రని తెరకెక్కించిన విధానం ఆకట్టుకొంటుంది.

    రావు రమేష్ అయితే...

    రావు రమేష్ అయితే...

    విలన్స్ గా తరుణ్‌ అరోరా, రావురమేష్‌లు కనిపించనున్నారు. రావు రమేష్‌ చేసిన పాత్రల్లో నర్సప్ప పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుందని తెలిపింది. రావు రమష్ చెప్పే డైలాగులు అదిరిపోయాయని, రావు రమేష్, పవన్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయని చెప్తున్నారు.

    ఆ పాయింట్ తోనే..

    ఆ పాయింట్ తోనే..

    రీమేక్‌ కథే అయినా కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ‘వీరమ్‌'లో కొన్ని ఆసక్తికరమైన అంశాల్ని పైపైన స్పృశించి వదిలేశారు. వాటిని పవన్‌ శైలికి తగ్గట్టుగా మార్చి ఆకట్టుకున్నారు. హీరోకి అమ్మాయిలంటే పడదు. ఈ ఒక్క పాయింట్‌ చుట్టూ కావల్సినంత ఎంటర్టైన్మెంట్ పండింది.

    ఉగ్రరూపంతో

    ఉగ్రరూపంతో

    పవన్‌ పాత్రలో రెండు ఛాయలుంటాయి. కదిరి నరసింహుడిగా ఉగ్రరూపం దాలుస్తాడు... అంతలోనే గోపాల కృష్ణుడిగా చిలిపిదనం కురిపిస్తాడు. పవన్‌ని ఈ తరహా పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొత్తం... హాయిగా ఆహ్లాదకరంగా సాగిపోతుంది. ప్రతీ సీన్ ఫ్యాన్స్ కు పీస్ట్ గా ఉంది.

    టైలర్ మేడ్

    టైలర్ మేడ్

    సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దారు. పవన్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు చేసిన మార్పులు, చేర్పులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు వాళ్లకు ఈ చిత్రం కథ కొత్తగి కాకపోయినా...పవన్ కళ్యాణ్ కు టైలర్ మేడ్ లా ఉండటం, మాస్ కు పట్టేలా ఉండటం కలిసి వచ్చే అంశం.

    ఇదే ఈ సినిమా టీమ్

    ఇదే ఈ సినిమా టీమ్


    నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, శ్రుతిహాసన్‌, నాజర్‌, అలీ, రావు రమేష్‌, ప్రదీప్‌ రావత్‌, తరుణ్‌ అరోరా, శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు తదితరులు
    సంగీతం: అనూప్‌ రూబెన్స్‌,
    ఎడిటింగ్ : గౌతంరాజు,
    ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల
    నిర్మాత: శరత్‌ మరార్‌,
    దర్శకత్వం: డాలీ
    నిడివి: 2గంటల 23 నిమిషాలు,
    విడుదల తేదీ: 24-03-2017 (శుక్రవారం)

    English summary
    Katamarayudu has to be a decent hit as Pawan Kalyan’s last film, Sardaar Gabbar Singh was a disaster.Pawan Kalyan fans will be happy after watching the film getting a block buster talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X