twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కర్ణాటక లో బాహుబలి 2 కి ఎదురు దెబ్బ, విడుదల కానివ్వం అంటూ

    దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా బాహుబలి-2 సినిమా విడుదల కోసం చూస్తుంటే కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఈ చిత్రం విడుదలను నిలిపేయాలంటూ కన్నడ సంఘాలు నిరసన గళం ఎత్తుకున్నాయి.

    |

    దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా బాహుబలి-2 సినిమా విడుదల కోసం చూస్తుంటే కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఈ చిత్రం విడుదలను నిలిపేయాలంటూ కన్నడ సంఘాలు నిరసన గళం ఎత్తుకున్నాయి. ఈ సినిమాలో కట్టప్ప పాత్ర పోషిస్తున్న సత్యరాజ్‌.. ఓ కెట్టప్ప (ఈ మాటకి చెడ్డవాడు అనే అర్థం ఉంది).. ఆయన సినిమా మాకొద్దప్పా అంటూ మంగళవారం బెంగళూరులోని ఫిలించాంబర్‌ వద్ద ధర్నాకు దిగాయి.

    ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల కాకూడదంటూ

    ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల కాకూడదంటూ

    గతంలో కావేరీ పోరాట సమయంలో ఆయన కన్నడ నేతలను అవహేళన చేస్తూ మాట్లాడారని, ఆయన సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల కాకూడదంటూ నిరసన తెలిపారు. ఈ ధర్నాలో కర్ణాటక రక్షణ వేదిక నేత ప్రవీణ్‌శెట్టితోపాటు ఫిలిం చాంబర్‌ అధ్యక్షుడు సారా గోవిందు కూడా పాల్గొన్నారు.

    కావేరీ జలాల పంపిణీ

    కావేరీ జలాల పంపిణీ

    తమిళ రాజకీయాల్లో సినీ ప్రముఖులూ ఒక భాగమే నన్న విషయం తెలిసిందే కదా., జల్లికట్టు వివాదమైనా, జయలలిత మరణమైనా, చెన్నై వరదలైనా ఇలా తమిళనాడు రాజకీయాంశం ఏదైనా సినిమా జనం కూదా అందులో ఇన్వాల్వ్ అవుతారు. కొన్ని దశాబ్దాలుగా తమిళ, కన్నడ రాష్ట్రాల మధ్య ఉన్న కావేరీ జలాల పంపిణీ విషయమై జరిగే గొడవ దేశం మొత్తానికీ తెలుసు.

    కాస్త దూకుడు గానే మాట్లాడాడు

    కాస్త దూకుడు గానే మాట్లాడాడు

    అయితే పోయిన సంవత్సరం ఈ జలాల విషయమై ఆందోళన జరిగినప్పుడు. తమిళనాడు తరపున నిలబడ్డ సత్యరాజ్ కాస్త దూకుడు గానే మాట్లాడాడు. కర్ణాటక ప్రభుత్వం కావేరి జలాలు వదిలితే దక్షిణ కర్ణాటక తాగునీటి ఎద్దడిని ఎదుర్కుంటుందని వాదిస్తోంది. కావేరి నీటి విడుదల జరగకపోతే నీరందక పంటలు ఎండిపోతాయని తమిళనాడు మాట్లాడుతోంది. ఉభయతారకంగా రెండు రాష్ట్రాలు కృషిచేయకపోవడం వెనుక రాజకీయ కారణాలున్నాయి.

    క్షమాపణ చెప్పాల్సిందే

    క్షమాపణ చెప్పాల్సిందే

    కర్ణాటక లో బాహుబలి విడుదల కావాలంటే సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు గనక సత్య రాజ్ క్షమాపణ చెబితే తమిళ ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుంది. అప్పుడు తమిళనాడులోనూ బాహుబలి కి చిక్కులు తప్పవు. రెండురాష్ట్రాలమధ్య గొదవ ని బాహుబలి ఎలా గెలుస్తాడో ఏమో చూడాలి...

    English summary
    Kaveri controversy in between Tamilanadu karnataka states is effected Bahubali, kannada people hurted with the statements of Satyaraj who played KATTAPPA role in Bahubali 2. So Kannada Rakshakavedika Demands Until satyaraj says apology to karnataka people they wont be release Bahubali 2 in karnataka
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X