twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖైదీ నెం 150 కి జాతీయ పురస్కారం, అసలు ఎలా సాధ్యం? కుదిరే పనేనా??

    ఖైదీ నెం 150 సినిమా విషయం లో కొత్త వార్త ఒకటి వినబడుతోంది. 2016 సంవత్సరానికిగానూ జాతీయ అవార్డుల కోసం ఈ సినిమా తరపున దరఖాస్తు చేశారట

    |

    దాదాపు పదేళ్ల పాటు పూర్తిగా తెరమీదకి రాకుండా రెండే రెందు చిన్న చిన్న పాత్రలలో మాత్రమే కనిపించాడు చిరు. 'ఖైదీ నెంబర్‌ 150'తో వెండితెర మీద తన సత్తా చాటాడు మెగాస్టార్‌ చిరంజీవి. అన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చినా తానేమిటో టాలీవుడ్ లో తన సత్తా ఏమిటో చూపించాడు మెగాస్టార్. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించి చిరు స్టామినా చాటింది.

    అయితే ఈ సినిమా విషయం లో కొత్త వార్త ఒకటి వినబడుతోంది. అయితే అది కనీసం నమ్మటానికి కూడా చాలాదూరంగా ఉంది మరి. కానీ జరిగినా జరగవచ్చు మామూలు లెక్కల ప్రకారం 2017 సంక్రాంతికే విడుదల అయినా. ఖైదీ సినిమా సెన్సార్ మాత్రం 2016 డిస్వెంబర్ లోనే పూర్తయిపోయింది. అన్న విషయం తెలుసు కదా....

    అందుకే 2016 సంవత్సరానికిగానూ జాతీయ అవార్డుల కోసం ఈ సినిమా తరపున దరఖాస్తు చేశారట. అసలు ఇలా అప్లై చేయటానికే 2016 డిసెంబర్‌లో హడావిడిగా సెన్సార్‌ కార్యక్రమాలు జరిపించారన్న న్యూస్ వినిపిస్తోంది మరి. దాంతో 2016 కోటాలోనే ఈ సినిమా అవార్దు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తారు జ్యూరీ సభ్యులు. ఈ సినిమాకు ఏదో ఒక విభాగంలో జాతీయ అవార్డు గ్యారెంటీ అనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఆ అవకాశమూ తక్కువే ఎందుకంటే ఖైదీ స్ట్రైట్ సినిమా కాదు "కత్తి" అనే తమిళ సినిమాకి రీమేక్ గా వచ్చిన సినిమా.

    Khaidi No 150 Nominated for National Awards 2016

    కేంద్ర మంత్రిగా పని చేసి.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగుతున్న చిరుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తన సినిమాకు అవార్డు తెప్పించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి 'ఖైదీ నెంబర్ 150'కి ఏ కేటగిరిలో అవార్డుకు పరిగణిస్తారు.. అవార్డు ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ 'కత్తి'కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం అప్పట్లో జాతీయ అవార్డుల్లో ప్రభావం చూపలేకపోయింది. మరి రీమేక్ సినిమాను జ్యూరీ సభ్యులు ఏ కోణంలో చూస్తారో?

    సంక్రాంతికి భారీ అంచనాల మధ్య వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' రూ.100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నాన్-బాహుబలి రికార్డు నెలకొల్పింది. మరి, ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. హ్మ్..! ఏమో రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువా మాజీ మంత్రి సినిమా తల్చుకుంటే అవార్డులు కరువా అంటూ ఇప్పటికే కొన్ని పత్రికల్లొ వచ్చిన వార్తలు చూసి సెటైర్లు పడుతున్నయ్. ఏమో ఈ సెటైర్లే నిజమయ్యే రోజూ రావొచ్చు జాతీయ అవార్డ్ తీసుకొని ఖైదీ కాలరూ ఎగరేయవచ్చు.

    English summary
    Latest Hot News from Tollywood that Megastars 150th Movie Khaidi No 150 Nominated for National Awards 2016.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X