twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శాతకర్ణితో వద్దని నాన్న చెప్పారు, ఇండస్ట్రికి మంచిది కాదనే రిలీజ్ మార్పు: రామ్ చరణ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వ ంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ నిర్మించిన‌ ఖైదీనంబ‌ర్ 150 చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నామ‌ని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ అధికారికంగా వెల్ల‌డించారు. అంత‌కంటే ముందే ఈనెల 7న విజ‌య‌వాడ‌- గుంటూరు మ‌ధ్య‌లో ఉన్న‌ హాయ్‌ల్యాండ్‌లో ప్రీరిలీజ్ వేడుక‌ను చేస్తున్నామ‌ని తెలిపారు.

    ఈ సందర్భంగా రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ -ఖైదీనంబ‌ర్ 150 చిత్రాన్ని జ‌న‌వ‌రి 11న సంక్రాంతి కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ముందుగా ఈ సినిమాని జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే ఇద్ద‌రు అగ్ర‌హీరోల సినిమాలు ఒకేరోజున రావ‌డం ఇండ‌స్ట్రీకి అంత మంచి ప‌రిణామం కాద‌ని నాన్న‌గారు చెప్ప‌డంతో ఒక‌రోజు ముందుగా అంటే జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ తేదీ మార్పు విష‌యాన్ని గ్ర‌హిస్తార‌ని ఆశిస్తున్నాను అని రామ్ చరణ్ తెలిపారు.

     ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మార్పు

    ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మార్పు

    అలాగే.. జ‌న‌వ‌రి 4న జ‌ర‌గాల్సిన `ఖైదీనంబ‌ర్ 150` ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ గ్రౌండ్ ప‌ర్మిష‌న్ ప్రాబ్లెమ్ కార‌ణంగా జ‌న‌వ‌రి 7న విజ‌య‌వాడ - గుంటూరు మ‌ధ్య‌లో ఉన్న హాయ్‌ల్యాండ్‌లో చేస్తున్నాం`` అని రామ్ చరణ్ తెలిపారు.

     ఖైదీ నెం 150

    ఖైదీ నెం 150

    `ఖైదీనంబ‌ర్ 150` చిత్రంలో మెగాస్టార్‌ సరసన కాజల్ అగర్వాల్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, తరుణ్‌ అరోరా విలన్‌గా న‌టించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన పాట‌లు శ్రోత‌ల మెప్పు పొందిన సంగ‌తి విదిత‌మే.

     ఖైదీ, శాతకర్ణి.... వార్ వన్ సైడ్ లాంటివి నమ్మను!

    ఖైదీ, శాతకర్ణి.... వార్ వన్ సైడ్ లాంటివి నమ్మను!

     క్లిక్ చేయండి. క్లిక్ చేయండి.

     'ఖైదీ నంబర్.150' : కుట్ర..మెగా ఫ్యాన్స్ ఆగ్రహం, వార్నింగ్ లు, బిజినెస్ పై కొన్ని షాకిచ్చే నిజాలు

    'ఖైదీ నంబర్.150' : కుట్ర..మెగా ఫ్యాన్స్ ఆగ్రహం, వార్నింగ్ లు, బిజినెస్ పై కొన్ని షాకిచ్చే నిజాలు

    'ఖైదీ నంబర్.150' : కుట్ర..మెగా ఫ్యాన్స్ ఆగ్రహం, వార్నింగ్ లు, బిజినెస్ పై కొన్ని షాకిచ్చే నిజాలు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

     మళ్ళీ కెలికాడు.... ఖైదీ పై మళ్ళీ వెటకారం చేస్తూ ట్వీట్

    మళ్ళీ కెలికాడు.... ఖైదీ పై మళ్ళీ వెటకారం చేస్తూ ట్వీట్

    మళ్ళీ కెలికాడు.... ఖైదీ పై మళ్ళీ వెటకారం చేస్తూ ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. దాదాపు పదేళ్ళ సుదీర్గ విరామం తర్వాత త‌ర్వాత సోలో హీరోగా వ‌స్తున్నాడు చిరు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    Khaidi No. 150 release on 11 January. Khaidi No. 150 is an upcoming Indian Telugu-language action drama film directed by V. V. Vinayak, and written by AR Murugadoss. The film features Chiranjeevi in a dual role, Shriya Saran and Kajal Agarwal in the lead roles and marks as the former's comeback to acting in his 150th film after 10 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X