twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముందు పోలీసులకే చూపిస్తాను అన్న రామ్ గోపాల్ వర్మ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ సినిమా 'కిల్లింగ్ వీరప్పన్' ఇపుడు ఈ సినిమా అన్ని లీగల్ సమస్యలను, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 1న విడుదలకు సిద్దమవుతోంది. ఈ మేరకు వర్మ ట్వీట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఖరారు చేసారు. ఈ సినిమాపై వర్మ చాలా అంచనాలు పెట్టుకున్నారు.

    తన సినిమా 'కిల్లింగ్ వీరప్పన్'ను మొట్టమొదట పోలీసులకే చూపిస్తానని, దానికి వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని తనకు చాలా ఉత్సుకతగా ఉందని దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పారు. తన సినిమా గురించిన విశేషాలను ఆయన ట్వీట్ చేశారు. ఒక పోలీసు అధికారికి పుట్టిన ఆలోచన వల్లే వీరప్పన్ హతమయ్యాడని, ఆ అధికారికి సంబంధించిన కథే 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా అని వర్మ తెలిపారు. 1200 మంది పోలీసులు కలిసి కూడా 15 ఏళ్ల పాటు వీరప్పన్‌ను పట్టుకోలేకపో యారని, భారత దేశ నేరచరిత్రలో పోలీసు శాఖ అతిపెద్ద వైఫల్యం అదేనని కూడా వర్మ వ్యాఖ్యానించారు.

    ఇబ్బంది పెట్టిన వీరప్పన్ భార్య... ఈ సినిమాలో వీరప్పన్ ను చెడుగా చూపించినట్లైతే ఆ ప్రభావం కుటుంబ సభ్యులపై పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కిల్లర్ వీరప్పన్ సినిమాను అడ్డుకోవడానికి కోర్టు అనుమతి పొందామని తెలిపారు. 2006 సంవత్సరంలోనే రూ. 31 లక్షలు ముత్తులక్ష్మికి అందించి కిల్లర్ వీరప్పన్ సినిమా హక్కులు పొందామని అట్టహాస కన్నడ సినిమా డైరెక్టర్ ఎ.ఎమ్.రమేశ్ తెలిపారు. కన్నడ, తమిళ భాషల్లో కిల్లర్ వీరప్పన్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేసే సమయంలో కేసు పెట్టి ఇలా అడ్డంకులు సృష్టించడం విడ్డూరంగా ఉందని రమేశ్ వాపోయారు.

    ఈ సినిమా గురించి వర్మ గత ఇంటర్వ్యూల్లో చెప్పిన వివరాలు... ''చరిత్రలోనే వీరప్పన్‌ ఓ అరుదైన వ్యక్తి. వీరప్పన్‌ కథని సినిమాగా తీయడానికి చాలా పరిశోధన చేశాను. అతని భార్య ముత్తులక్ష్మిని కలుసుకొని కొన్ని విషయాలు సేకరించాను. వాటన్నింటిని క్రోడీకరించి తీసిన సినిమా ఇది. వీరప్పన్‌ తిరిగిన ప్రాంతాల్లోనే షూటింగ్ జరిపాము'' అని వర్మ అంటున్నారు. ''వీరప్పన్ చరిత్రను తెరకెక్కించాలని చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా ఉన్నా. ఆయన్ను పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. చంపడానికి పోలీసులకు 20 ఏళ్లు పట్టింది. వీరప్పన్‌ను చంపడం అనే పాయింట్‌తో సినిమా తీసేందుకు చాలాకాలం పరిశోధన చేశా'' అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ''వీరప్పన్ లైఫ్‌లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇది ఆయనకు సంబంధించిన బయోపిక్ కాదు. ఈ చిత్రాన్ని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. 'ఆపరేషన్ కుకూన్'లో పాల్గొన్న వ్యక్తులను, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీని కలిసి సమాచారం సేకరించా. వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ నటుడు రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో నటిస్తే యాప్ట్ అవుతాడని ఎంచుకున్నా. '' అని చెప్పారు.

    ట్వీట్లు...

    పోలీస్ డిపార్టుమెంట్ వైఫల్యం

    1200 మంది పోలీసులు కలిసి కూడా 15 ఏళ్ల పాటు వీరప్పన్‌ను పట్టుకోలేకపో యారని, భారత దేశ నేరచరిత్రలో పోలీసు శాఖ అతిపెద్ద వైఫల్యం అదేనని కూడా వర్మ వ్యాఖ్యానించారు.

    పోలీసు అధికారి ఆలోచనే

    ఒక పోలీసు అధికారికి పుట్టిన ఆలోచన వల్లే వీరప్పన్ హతమయ్యాడని, ఆ అధికారికి సంబంధించిన కథే 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా అని వర్మ తెలిపారు.

    ముందు పోలీసులకే

    తన సినిమా 'కిల్లింగ్ వీరప్పన్'ను మొట్టమొదట పోలీసులకే చూపిస్తానని, దానికి వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని తనకు చాలా ఉత్సుకతగా ఉందని దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పారు.

    విడుదల

    రామ్ గోపాల్ వర్మ సినిమా 'కిల్లింగ్ వీరప్పన్' ఇపుడు ఈ సినిమా అన్ని లీగల్ సమస్యలను, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 1న విడుదలకు సిద్దమవుతోంది.

    English summary
    "Biggest failure of the police department in crime history of india is 1200 policemen couldn't catch Veerappan for more than 15 years. A very radical thought of a particular police officer is what which finally Killed Veerappan."Killing Veerappan" film is that officers story. The very first show of "Killing Veerappan" will be shown to the Police Department ..am really curious to know their reactions." RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X