twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీకు 10 జన్మల పాటు రుణపడి ఉంటాను... రామ్ గోపాల్ వర్మ ఎందుకంత ఎమోషనల్ అయ్యాడు??

    |

    రామ్ గోపాల్ వర్మ ఒక హైపర్ యాక్టివ్, ఓవర్ యాట్టిట్యూడ్ ఫెల్లో మనందరికి తెలిసిన ఒక క్రియేటివ్, రఫ్ పర్సనాలిటీ... కానీ వర్మలో ఒక సున్నితమైన కోణం ఉంది చిన్న పిల్లాడిలా త్వరగా రియాక్టయ్యే గుణం, ప్రతీ చిన్నదానికీ చలించిపోయే మనస్తత్వమూ ఉంది. ఆ మస్తత్వమే కొన్నిసార్లు పిచ్చిపట్టిందా ఇతనికి..? అనిపించేలా అతను చేసే కామెంట్లు కానీ వర్మ్ చెప్పే 99% మాటలు నిజమే అని అందరికీ తెలుసు ఎటొచ్చీ వాటిని మనం ఒప్పుకోలేం... వర్మ బయటికే చెప్పేస్తూంటాడు...

    అందుకే వర్మ ని బండబూతులు తిట్టే మనిషి కూడా వర్మ మీద ప్రతీ క్షణం ఒక కన్నేసి ఉంటాడు... వర్మ ఏం చెప్తాడూ అని ఎదురు చూస్తాడు.. మనకు కనిపించే డైరెక్తర్ వర్మ వేరూ... మనుషులతో విపరీతమైన ఇష్టం తో ఉండే వర్మ వేరూ... ఇప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ అనే ఈ కాంప్లికేటేడ్ పర్సనాలిటీ గురించి ఇంత ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందీ అంటే... తన అంతర్జాతీయ సినిమా పై స్పందించిన నాగార్జున కి వర్మైచ్చిన రిప్లై చూసాక ఎవ్వరికైనా.. "నేను మీ అభిమానినీ" అనగానే "సో వాట్..! ఇప్పుడు నేను ఏం చేయాలి...మీ కాళ్ళు పట్టుకోవాలా??" అని అడిగే వర్మేనా ఇప్పుడిలా మాట్లాడిందీ అని పించక మానదు... ఇంతకీ ఏం జరిగిందీ అంటే....

     మూడవ ప్రపంచ యుద్ధాన్ని:

    మూడవ ప్రపంచ యుద్ధాన్ని:


    ఇప్పటివరకు వర్మ వివాదాలు ఇండియాకే పరిమితం. కానీ ఈసారి ప్రపంచ వ్యాప్తంగా తన మార్క్ ప్రయోగాన్ని చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు రెండు ప్రపంచ యుద్ధాల గురించి విన్న మనం.. త్వరలో మూడవ ప్రపంచ యుద్ధాన్ని చూస్తాం.

     ప్రముఖుల కామెంట్లేమిటీ :

    ప్రముఖుల కామెంట్లేమిటీ :


    అది కూడా ముంబయి కేంద్రంగా వరల్డ్ వార్ జరగనుంది. ఇదంతా కల్పితమే అయినా.. నిజంగా జరిగితే ఎలా ఉంటుంది..? ఏ ఏ దేశాలు దానికి కారణమవుతాయి..? అనే అంశాలతో మనకు సినిమా చూపించనున్నాడు? దీని పై ప్రముఖుల కామెంట్లేమిటీ ఒక సారి చూస్తే....

     340 కోట్ల బడ్జెట్‌:

    340 కోట్ల బడ్జెట్‌:


    తెలుగు సినిమాతో కెరియర్ ప్రారంభించి భారతీయ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ... ఇప్పుడు ప్రపంచ స్థాయి సినిమా తీయబోతున్నాడు. 'న్యూక్లియర్‌' అనే అంతర్జాతీయ చిత్రాన్ని ఆయన తెరకెక్కించబోతున్నట్లు, ఈ చిత్రానికి రూ. 340 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు వర్మ అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.

     ఆర్‌జీవీ బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌..?:

    ఆర్‌జీవీ బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌..?:


    వర్మ ఈ చిత్రం గురించి ప్రకటించగానే ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ట్విట్టర్‌లో ఇలా ఓ ట్వీట్‌ చేశారు. 'ఆర్‌జీవీ (రామ్‌గోపాల్‌ వర్మ) బ్యాక్‌ విత్‌ బ్యాంగ్‌..? నిజంగా' అని జక్కన్న ట్వీట్‌ చేశాడు.

     బాహుబలి బ్యాంగ్ ఔట్:

    బాహుబలి బ్యాంగ్ ఔట్:


    దీనికి వర్మ వెంటనే ఇలా రిప్లై ఇచ్చారు... ‘‘సర్‌.. ఒకరోజు రాత్రి మీతో ఫోన్‌లో మాట్లాడుతూ బీబీ(బాహుబలి) నుంచి నేను పొందిన స్ఫూర్తి గురించి చెప్పాను. కచ్చితంగా బాహుబలి బ్యాంగ్ ఔట్ అని ఆనాడు నేనే చెప్పింది నేడు నిజమైంది'' అని వర్మ ట్వీట్‌ చేశారు.

     అక్కినేని నాగార్జున:

    అక్కినేని నాగార్జున:


    వర్మ తీయబోతున్న సినిమా గురించి అక్కినేని నాగార్జున కూడా స్పందించారు. రామ్ గోపాల్ వర్మ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లో ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. మనమంతా గర్వపడేలా వర్మ ఆ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తారని నాగార్జున ట్వీట్ చేశాడు. నిజానికి నాగార్జున కి వర్మ అంటే విపరీతమైన నమ్మకం ఉంది గోవిందా గోవిందా లాంటి ఫ్లాప్ ఉందనే విషయం పక్కన పెడితే ఇండస్ట్రీలో నాగ్ కి ఒక మాస్ హీరో గుర్తింపు తెచ్చిన సినిమా "శివ" ఆ బేస్ వల్లే నాగ్ బాలివుడ్ లో కూడా కొంత క్రేజ్ సంపాదించగలిగాడు.

     నీకు 10 జన్మల పాటు రుణపడి ఉంటాను:

    నీకు 10 జన్మల పాటు రుణపడి ఉంటాను:


    నాగార్జునకు వర్మ రిప్లై ఇస్తూ "హే నాగ్...! అప్పట్లో నేను కొత్తవాడిని అయినా నాపై నమ్మకంతో శివ సినిమా చేసే అవకాశం ఇచ్చావు. నీకు 10 జన్మల పాటు రుణపడి ఉంటాను... అంటూ వర్మ నాగార్జునకు రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లై చూసి నాగార్జున ఎలా ఫీలయ్యడో గానీ మిగతావాళ్ళకి మాత్రం న్యూక్లియర్ సినిమా న్యూస్ కంటే ఇదే పెద్ద షాక్ లా అనిపించింది. వర్మ ఇంత ఎమోషనల్ గా సమాధానం చెప్తాడని (కనీసం పబ్లిక్ గా) ఎవరూ ఊహించరు.

     నిజమైన వర్మ మనసు:

    నిజమైన వర్మ మనసు:


    న్యూక్లియర్ సినిమా గురించి గర్వపడుతున్నాను. మామూలు కాలేజ్ గొడవల్లో, సైకిల్ చైన్లతో కొట్టుకునే నేపధ్యంలో, నేను తీసిన "శివ" తో మొదలైన నా కెరియర్ ఇప్పుడు దేశాల మధ్య జరుగుతున్న గొడవల్లో న్యూక్లియర్ బాంబులు పేల్చుకునే నేపధ్యంలో ఇంగ్లీష్‌లో నిర్మించబోతున్న"న్యూక్లియర్" సినిమా వరకూ వచ్చినందుకు, నేను ఒకింత కాకుండా చాలా చాలా గర్వపడుతున్నాను''... అని చెప్పి తన రఫ్ నెస్ వెనక ఉండే నిజమైన వర్మ మనసు ఎలాంటిదో చెప్పేసాడు.

     ప్రపంచం ఎలా అంతం అవుతుందో:

    ప్రపంచం ఎలా అంతం అవుతుందో:


    రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా వేసిన అణుబాంబు ప్రభావానికి ఇప్పటికీ హిరోషిమా, నాగసాకి ప్రాంతాల్లో గడ్డి కూడా మొలవలేదు. అలాంటిది భవిష్యత్తులో వచ్చే యుద్ధంలో న్యూక్లియర్ బాంబు వాడితే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో చూపించనున్నారు. ఈ బాంబుతో ప్రపంచం ఎలా అంతం అవుతుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తానంటున్నారు వర్మ.

    ఉగ్రవాదం నేపథ్యంలో:

    ఉగ్రవాదం నేపథ్యంలో:

    సీఎంఏ గ్లోబల్ సంస్థ నిర్మించబోయే న్యూక్లియర్ సినిమా ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ కానుంది. ఆర్టిస్టుల ఖర్చులు కాకుండానే మూవీ బడ్జెట్ రూ.340 కోట్లు. ఇక ఈ సినిమా బాలీవుడ్ సినిమా కాదని, హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని వర్మ తెలిపారు. అన్ని దేశాల నటులు ఇందులో నటిస్తారు. అమెరికా, రష్యా, ఇరాన్ , ఇరాక్, ప్ట్రాన్స్, ఇండియా.. తదితర దేశాల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ఉగ్రవాదం నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుంది.
     ఉగ్రవాదాన్ని పెంచే దేశాల పైనే :

    ఉగ్రవాదాన్ని పెంచే దేశాల పైనే :


    ఉగ్రవాదం ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుంది, కొన్ని దేశాలు తమ స్వార్థం కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ప్రపంచ యుద్ధానికి ఎలా దారి తిస్తుందో చూపించనున్నారు. ప్రస్తుతం సర్కార్-3 తెరకెక్కిస్తున్న వర్మ.. అది పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టును మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

     న్యూక్లియర్:

    న్యూక్లియర్:


    ‘మూడో ప్రపంచ యుద్ధం' నేపథ్యంలో ‘న్యూక్లియర్' అనే కథ అల్లేశాడు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ‘అణు బాంబు'లను కలిగి ఉన్నాయి. లేని దేశాలు వాటి వైపు చూస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధాన్నే తీసుకుంటే జపాన్‌పై అమెరికా వేసిన రెండు అణుబాంబులు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాయో, ఎంత కాలం ఆ ఎఫెక్ట్ ఉందో తెలిసిందే.

     అవాంఛిత వ్యక్తుల చేతుల్లో:

    అవాంఛిత వ్యక్తుల చేతుల్లో:


    మరిప్పుడు అవే అణ్వాయుధాలు, అణుబాంబులు అవాంఛిత వ్యక్తుల చేతుల్లో పడితే పరిస్థితి ఏంటి..? అన్న దానిపైన కథను అల్లి తీసేందుకు సిద్ధమైపోయాడు రామ్‌గోపాల్ వర్మ. దానికి సంబంధించిన విషయాలను అతడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ‘‘తొలిసారిగా అంతర్జాతీయ సినిమా తీయబోతున్నాను. దాని బడ్జెట్ 340 కోట్లు. ఆ సినిమా పేరు న్యూక్లియర్. నేను ఇప్పటిదాకా ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కథలు, నవలలెన్నో చదివాను.

     కథ డిమాండ్‌కు అనుగుణంగానే ఆ బడ్జెట్‌:

    కథ డిమాండ్‌కు అనుగుణంగానే ఆ బడ్జెట్‌:


    కానీ, ఇప్పటిదాకా న్యూక్లియర్ వంటి కాన్సెప్ట్‌తో రాలేదు. భారత్‌లో ఇప్పటిదాకా ఏ సినిమాకు పెట్టనంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. సినిమా కథ డిమాండ్‌కు అనుగుణంగానే ఆ బడ్జెట్‌ను నిర్ణయించాం. 70 ఏళ్ల క్రితం జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై వేసిన అణుబాంబుల మోత ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. మరి అలాంటి విధ్వంసం ఇప్పుడు జరిగితే..

     ప్రపంచ దేశాలకు :

    ప్రపంచ దేశాలకు :


    అదీ ముంబై లాంటి పెద్ద నగరాలపై అణు బాంబును వేస్తే... అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. అంతటితో ప్రపంచం అంతం'' అని ట్వీట్ చేశాడు. కాగా, భారత్, అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల్లో, ఆయా దేశాలకు చెందిన నటీనటులతో సినిమాను తీస్తామని, సర్కార్-3 షూటింగ్ అయిపోగానే వెంటనే సినిమాను పట్టాలెక్కిస్తామని వెల్లడించాడు. సీఎంఏ గ్లోబల్ అనే నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో న్యూక్లియర్ తెరకెక్కనుంది. ఈ అణుబాంబుల వల్ల కలిగే అనర్థాలను ప్రపంచ దేశాలకు కళ్లకు కట్టబోతున్నాడన్నమాట.

    English summary
    “Hey Nag,I owe 10 lifetimes to u for gvng break in Shiva to a amateur like me. That proves ur vision of me more than whether I have vision,” said Ram gopal varma when he recived a wish from King Nagarjuna about Varma's new project "Nuclear"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X