twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్ భార్య తెలంగాణ మూలాలు హాట్ టాపిక్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అసహనం అంశంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసాయి. దేశంలో అసహనం పెరిగి పోతుండటంతో నా భార్య కిరణ్ రావు ఈ దేశం విడిచి వెళ్లిపోదామని అడుగుతోంది అంటూ అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

    ఆసంగతి పక్కన పెడితే... అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు మూలాల గురించి తెలిసి అంతా ఆశ్చర్య పోతున్నారు. ఆమె తెలంగాణ ప్రాంతంలోని వనపర్తి రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఇపుడు ఇది హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ నటి అదితి రావు హైదరి పుట్టింది హైదరాబాద్‌లోనే. ఆమె రెండు రాజవంశీకుల కుటుంబాలకు చెందిన వ్యక్తి. అస్సాం రాజకుటుంబానికి చెందిన మహమ్మద్ సాలేహ్ హైదరి మరియు వనపర్తికి చెందిన రాజవంశీయులు జె. రామేశ్వర రావులకు ఆమె మనవరాలు అవుతుంది. అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావుకు కూడా ఆమె బంధువు.

    Kiran Rao has roots in Telangana

    కిరణ్ రావు, అదితి రావు హైదరి మెటర్నల్ ఫస్ట్ కజిన్స్. అదితిరావు హైదరి మెటెర్నల్ గ్రాండ్ ఫాదర్ జె రామేశ్వరరావు, ఆమె ఫ్రాటెర్నల్ గ్రాండ్‌ఫాదర్ అక్బర్ హైదరి హైదరాబాద్ స్టేట్ ప్రైమ్ మినిస్టర్. ఈ కజిన్స్ ఇద్దరూ పబ్లిక్ లో కలిసిన సందర్భాలు తక్కువే అయినా ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉంది. ఆ మధ్య అదితి రావు హైదరి ఓమేగజైన్ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించింది.

    కిరణ్ రావు తండ్రి ఇంజనీర్ కావడంతో ఆయన బెంగుళూరు, ముంబై, కోల్ కతాల్లో పని చేసారు. బెంగుళూరులోనే కిరణ్ రావు జన్మించింది. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు కిరణ్-ఉమ బెంగుళూరులోనే స్థిరపడ్డారు.

    English summary
    Kiran Rao and actor Aditi Rao Hydari are maternal first cousins. Hydari’s maternal grandfather, J Rameshwar Rao was the Raja of Wanaparthy, a town in Mahbubnagar district while her fraternal grandfather Sir Akbar Hydari was the Prime Minister of Hyderabad State.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X