» 

శర్వానంద్ ‘కో అంటే కోటి’ సెన్సార్ రిపోర్ట్

Posted by:
Give your rating:

హైదరాబాద్: శర్వానంద్, శ్రీహరి, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రధారులుగా శర్వా ఆర్ట్ పతాకంపై అనీష్ యోహాన్ కురువిల్లా దర్శకత్వంలో నిర్మాత మైనేని వసుంధరాదేవి నిర్మిస్తున్న చిత్రం 'కో అంటే కోటి'. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమం పూర్తయింది.

సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి పెద్దలు మాత్రమే చూడదగినది అంటూ 'A' సర్టిఫికెట్ జారీ చేసారు. సెన్సార్ బోర్డు వారు కొన్ని అభ్యంతరకర సీన్లను తొలగించి వేరే సర్టిఫికెట్ ఇవ్వడానికి ప్రయత్నించనప్పటికీ.... చిత్ర దర్శక నిర్మాతలు వాటిని తొలగించడానికి కాంప్రమైజ్ కాలేదు. దీంతో 'A' సర్టిఫికెట్ జారీ అయింది.

ఈ సినిమాలో శ్రీహరి కీలకపాత్రలో నటించారు. ఆవకాయ బిర్యాని ఫేమ్‌ అనీస్‌ కురువిల్లా దర్శకుడు. ఈ చిత్రానికి శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందించారు. ఇటీవల మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించిన ఆడియోకు విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ప్లాటినమ్ డిస్క్‌ ఫంక్షన్‌ను 23న హైదరాబాద్‌లో జరిగిన'టాలీవుడ్‌ వెర్సెస్‌ బాలీవుడ్‌' క్రికెట్‌ మ్యాచ్‌లో జరిపారు.

కాగా ఈ చిత్రం కథ గురించి శర్వానంద్‌ మాట్లాడుతూ... 'డబ్బుకు లోకం దాసోహం.. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు మనిషి డబ్బు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. పది రూపాయలు కలిసోస్తుందంటే ఏదెైనా చేస్తాడు. అలాంటిది ఏకంగా రూ.కోటి వస్తుందంటే వదులుతాడా? అందుకే నోట్ల కట్టల వెంట ఓ యువకుడు పరుగులు పెట్టాడు' ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో తయారెైన చిత్రమని వెల్లడించారు.

రాజమండ్రి, పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనీ, ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, నిర్మాత: మైనేని వసుంధరాదేవి, దర్శకత్వం: అనీష్ యోహాన్ కురువిల్లా.

Read more about: sharwanand, priya anand, ko ante koti, శర్వానంద్, ప్రియా ఆనంద్, కో అంటే కోటి
English summary
Sharwanand-Priya Anand starrer ‘Ko Ante Koti’ censor completed. The movie has received an A certificate board and hit the screens on December 28th. The film has celebrated its audio launch recently and has garnered good response for the music.
Please Wait while comments are loading...
 
X

X
Skip Ad
Please wait for seconds

Bringing you the best live coverage @ Auto Expo 2016! Click here to get the latest updates from the show floor. And Don't forget to Bookmark the page — #2016AutoExpoLive