twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టూడెంట్ రేప్ .. ఫిలిం ఇనిస్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ అరెస్ట్‌

    By Srikanya
    |

    హైదరాబాద్‌: కోల్‌కతా నగరంలోని సత్యజిత్‌రే ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్‌ను అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తన శిష్యురాలనే అత్యాచారం చేసారు. ఆమె పోలీస్ లతో... తనను రెగ్యులర్ గా తమ ఇంటి టెర్రస్ మీదకు తీసుకు వచ్చి మందు కొట్టి మాట్లాడేవారని చెప్పింది. అలా ఓ రోజు తనని ఎంసేపూ మాటలేనా ...ముద్దులు ..సెక్స్ వంటివి లేవా అని అడిగాడని, తర్వాత ఓ రోజు తనను బలవంతం చేసాడని ఆమె తన కంప్లైంట్ లో రాసుకొచ్చింది.

    పూర్తి వివరాల్లోకి వెళితే... 2014 మేలో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో నీరజ్‌ సహాయ్‌ అనే ప్రొఫెసర్‌ను మహారాష్ట్రలోని థానేలో అరెస్టు చేసి గత రాత్రి కోల్‌కతా తీసుకొచ్చారు.

    Kolkata film school faculty member arrested on charges of raping student

    2014 మేలో ప్రొఫెసర్‌ నీరజ్‌ సహాయ్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ విద్యార్థిని గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అంతర్గత విచారణ అనంతరం డిసెంబరు 24న అతడిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ప్రొఫెసర్‌ అజ్ఞాతంలో ఉన్నాడు.

    పోలీసులు గాలించి థానేలో మంగళవారం అరెస్టు చేశారు. బుధవారం రాత్రి కోల్‌కతాకు తీసుకొచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఇనిస్టిట్యూట్‌లోని మరికొందరు విద్యార్థులు ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పారని ఆ విద్యార్థిని పోలీసులకు తెలిపింది.

    English summary
    More than a year after allegedly forcing a student into sex, Neeraj Sahay, a professor at Satyajit Ray Film & Television Institute (SRFTI), was arrested in Maharasthra's Thane on Tuesday evening.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X