twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ప్రెస్ మీట్: కోన వెంకట్ స్పందన ఇలా...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇటీవల పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులు, సెక్షన్ 8, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌పై ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ స్పందించారు.

    కోన వెంకట్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.... ‘పవన్ కళ్యాణ్ మీద మై లవ్ అండ్ రెస్పెక్ట్ పదింతలు పెరిగింది. ఎంత మంది పొలిటీషియన్స్‌కీ తమ దేశానికి సంబంధించి విజన్‌‌పై క్లారిటీ ఉందో చెప్పండి. పొలిటీషియన్స్‌కి...లీడర్స్‌కి మధ్య తేడా చూసాను. పోలిటీషియన్స్ కేవలం పార్టీలకు చెందిన వారు. కానీ లీడర్స్ ప్రజలకు చెందిన వారు. పవన్ కళ్యాణ్ నిజమైన లీడర్' అంటూ ట్వీట్ చేసారు.

    రామ్ గోపాల్ వర్మ ఇలా...
    పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ కు నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే...సింహం పిల్లాలా ఉండొద్దు. ఒక అభిమానిగా మీరు పులిలా గాండ్రించాలని కోరుకుంటున్నాం అంటూ ట్వీట్ చేసారు. పవన్ ఒక గర్జించే సింహం...సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనకు అర్థం లేదు... నిన్న స్పీచ్ లో నాకు అనిపించింది. అయితే పవన్ కళ్యాణ్ ఇపుడు కాస్త బెటరే. సింహం అర్థం చేసుకోవాల్సింది సింహం సింహంలా ఉండాలి. తన గర్జనలోని అంతరార్థం కుక్కలకి ఎక్స్‌ప్లేన్ చేయకూడదు. సింహం జూలో ఉందనే భ్రమలో ఉన్నాయి కుక్కలు. కాని కుక్కలు తెలుసుకోవాల్సింది సింహం తలుచుకుంటే ఎప్పుడైనా అటాక్ చేయ్యగలదని. సింహం గర్జనలో అర్థం వెతకడం కుక్కలు మొరగడంలో లాజిక్ వెతకడం లాంటిదే. కాని ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే గర్జించే సింహం మేకలాగా మాట్లాడుతోంది. అంటూ ట్వీట్ చేసారు.

    English summary
    Tollywood's top writers Kona Venkat has heaped praises on the power star. He took to his micro-blogging site twitter page and posted some comments praising Pawan Kalyan. His tweets read thus -"Tell me how many politicians have this clarity, vision and concern towards their country. My love & respect has grown 10 times for Pawan Kalyan." - "I saw the difference between politicians and leaders. Politicians belong to parties but leaders belong to people. PawanKalyan is a true leader"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X