twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లిపై నాగబాబు కూతురు నిర్ణయం సూపర్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నాగబాబు కూతురు నిహారిక త్వరలో 'ఒక మనసు' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ కూడా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక మదర్స్ డే సందర్భంగా తన మనసులోని మాట బయట పెట్టింది.

    ఈ సందర్భంగా అమ్మతో దిగిన ఫోటోతో పాటు అమ్మ గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పుకొచ్చింది. అంతేకాదు తన పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా ఆమె పంచుకుంది. పెళ్లి విషయంలో అమ్మతీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది.

    ఎవరూ తలదించుకునేలా చేయనంటున్న నిహారికఎవరూ తలదించుకునేలా చేయనంటున్న నిహారిక

    తనకు ఇష్టమైన సినిమా రంగంలో హీరోయిన్ గా కెరీర్ ను ఎంచుకునే తనకు ఇంత స్వేచ్ఛనిచ్చిన తల్లిదండ్రులకే తన పెళ్లి చేసే అధికారం ఉందని, ఈ విషయంలో వారు చెప్పినట్లే నడుచుకుంటానని నిహారిక తెలిపింది. ఒక గృహిణిగా మా అమ్మే నాకు రోల్ మోడల్. పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తాను అని తేల్చిచెప్పింది నిహారిక. పెళ్లి విషయంలో ఎంతో చక్కటి నిర్ణయం తీసుకుందని నిహారికపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరం ఆడ పిల్లలకు నిహారిక ఆదర్శంగా ఉందని అంటున్నారు.

    Konidela Talks Niharika about her marriage

    త్వరలో తాను హీరోయిన్ గా నటించిన 'ఒక మనసు' చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో కాస్త టెన్షన్ గా ఉన్నట్లు తెలిపింది. సినిమా ఎలాంటి ఫలితం ఇచ్చినా ఫేస్ చేసేందుకు ముందే ప్రిపేర్ అయ్యానని, నెగెటివ్ పీడ్ బ్యాక్ వచ్చినా కృంగి పోకుండా స్పోర్టివ్ గా తీసుకుంటానని తెలిపింది. ఈ సినిమా విడుదలైన తర్వాత వచ్చే ఫలితాన్ని బట్టే రెండో సినిమా ఎలాంటిది చేయాలనే దానిపై నిర్ణయం ఉంటుందన్నా నిహారిక...అప్పటి వరకు ఏ సినిమాలు ఒప్పుకోనని తెలిపింది.

    English summary
    Konidela Niharika about her marriage. Niharika Konidela is an Indian film actress who forays from Chiranjeevi's family. She is soon debuting as actress with the film Oka Manasu. The film is slated for a worldwide release in Summer 2016.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X