»   » విడాకులు ప్రకటించిన మరో సినీ జంట, ఏమైంది?

విడాకులు ప్రకటించిన మరో సినీ జంట, ఏమైంది?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా పరిశ్రమకు చెందిన స్టార్స్ మధ్య ప్రేమ వివాహాలు, విడాకులు కామన్ అయిపోయాయి. తాజాగా మరో జంట తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. 2007లో డేటింగ్‌ ప్రారంభించిన 2010లో వివాహం చేసుకున్న కొంకణాసేన్‌ శర్మ, రణవీర్‌ షోరే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరికీ హరూన్‌ అనే నాలుగేళ్ల కొడుకున్నాడు.

‘‘విడిపోవాలని రణవీర్‌, నేను పరస్పరం నిర్ణయించుకున్నాం. అయితే స్నేహితులుగా, మా అబ్బాయికి తల్లిదండ్రులుగా కొనసాగుతాం. మీరు మద్దతిస్తే ఆనందిస్తాం. థ్యాంక్‌ యు'' అని 35 ఏళ్ల కొంకణ ట్వీట్‌ చేయగా, ఆమె ట్వీట్‌లో ‘రణవీర్‌' అనే పేరున్న చోట ‘కొంకణ' అనే పేరు పెట్టి సరిగ్గా అవే మాటలతో తను కూడా ట్వీట్‌ చేశాడు 43 ఏళ్ల రణవీర్‌.

ఈ ఇద్దరూ కలిసి ‘ట్రాఫిక్‌ సిగ్నల్‌', ‘మిక్స్‌డ్‌ డబుల్స్‌', ‘ఆజా నాచ్‌లే', ‘గౌర్‌ హరీ దాస్తాన్‌' వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల పాటు కలిసి కాపురం చేసిన వీరు కాపురంలో విబేధాలతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

వివాహం

వివాహ సమయంలో రణవీర్ షోరే, కొంకణా సేన్...

2010లో..

దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్ చేసిన రణవీర్, కొంకణ 2010లో సాంప్రదాయ బద్దంగా పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.

ప్రేమ..

పెళ్లి సమయానికి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ...కానీ ఇపుడు మాత్రం ఆ పరిస్థితి లేదు.

అరుదైన ఫోటో

కొంకణ, రణవీర్ అరుదైన ఫోటో..

కొడుకు

ఇద్దరికీ హరూన్‌ అనే నాలుగేళ్ల కొడుకున్నాడు.

హరూన్ తో..

కొడుకు హరూన్ తో కలిసి రణవీర్ షోరే..

 

 

Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos