twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ఫ్యాన్స్ చుట్టుముట్టి అంతలా కొడతారని ఊహించలేదు,అవమానం వేసింది:కోట శ్రీనివాసరావు

    మండలాధీసుడు చిత్రం చేసిన తర్వాత ... ఓ టైమ్ లో కోటని కొట్టడానికి కూడా ట్రై చేసారు.

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ కోట శ్రీనివాసరావు...పెద్దాయన నందమూరి రామారావు ని అనుకరిస్తూ...చేసిన 'మండలాధీశుడు' ఎంతో పెద్ద సంచలనం. ఆ రోజుల్లో ఆ సినిమా గురించి మాట్లాడుకోనివారు లేరు. పొలిటికల్ సెటైర్ గా అన్నగారిని వ్యగ్యం చేస్తూ వచ్చిన ఆ చిత్రం కోట శ్రీనివాసరావుకు పెద్ద చిక్కులే తెచ్చిపెట్టింది.

    దాంతో ఎక్కడికి వెళ్లినా తారకరాముడు అభిమానలు మండిపడేవారు. తిట్టేవారు. దాంతో కోటకు ఏం చేయాలో పాలుపోని పరిస్దితి. తనేమో కేవలం ఓ నటుడుగా తన దగ్గరకు వచ్చిన వేషం వేసాను అనుకున్నారు. అంతేకాని అంత పెద్ద సమస్య గా తనకే బూమరాంగ్ లా మారి ఎటాక్ చేస్తుందని భావించలేదు. ఎన్టీఆర్ ఏమి అనలేదు కానీ, ఫ్యాన్స్ మాత్రం తట్టుకోలేకపోయారు.

    దాంతో ఎన్టీఆర్ ని కలిసి క్షమాపణ అడుగుదాముకున్నారు కోట శ్రీనివాసరావు. అప్పుడు ఆయన మిత్రులంతా.. 'మతిపోయిందా? నువ్వు చేసిన పనికి ఆయన కోపంతో మండిపడుతుంటారు. ఇప్పుడు వెళ్లి పలకరిస్తావా?' అంటూ నన్ను వారించాలని చూశారు. కానీ కోట వినలేదు. ఓ టైమ్ లో కోటని కొట్టడానికి కూడా ట్రై చేసారు. అలనాటి ఈ విషయాలన్ని గుర్తు చేసుకుంటూ కోట శ్రీనివాసరావు తెలుగు దిన పత్రిక ఆంద్రజ్యోతి కు తెలియచేసారు. ఆయనేం మాట్లాడారు అన్నది ఆయన మాటల్లోనే..

    కొడితే భరిస్తాను

    కొడితే భరిస్తాను

    ‘ఆయన దగ్గరికి వెళితే ఆయన కాదు.. పక్కనున్నవాళ్లే నిన్ను చంపేస్తారయ్యా' అని కూడా అన్నారు. కానీ నేను వినిపించుకోలేదు. ఏదో మొండిధైర్యం నన్ను ఆవరించింది. ‘ఇలా భయపడుతూ ఎంతకాలం ఉంటామండీ.. ఆయన్ని వెళ్లి కలుస్తాను. కోపంతో ఒకటి కొడితే, భరిస్తాను. తిడతారా... తిట్టనీ. మహానుభావుడాయన. తిట్టినా, కొట్టినా బాధ లేదు. దీనివల్ల ఎవరెవరితోనో మాటలు పడే బాధ తగ్గుతుంది' అని చెప్పి రామారావుగారి దగ్గరకు బయలుదేరాను అని ఆ రోజు సంఘటనను తలుచుకున్నారు కోట శ్రీనివాసరావు.

    పిల్లలు కూడా కోప్పడతారు

    పిల్లలు కూడా కోప్పడతారు

    మంచో, చెడో, తప్పో, ఒప్పో చేసేశాను. దానికి ఆయనకి కోపం రావడం సహజమే! వాళ్ల పిల్లలు నా మీద ఆగ్రహించడం కూడా తప్పేమీ కాదు. మా నాన్నని ఏమైనా అంటే నేను మాత్రం ఊరుకుంటానా? రామారావుగారు, ఆయన పిల్లలు నా మీద కోపంగా ఉన్నారని ఎన్నాళ్లు వాళ్లని తప్పించుకొని తిరుగుతాను? అన్నారు కోట.

    చూసారు కదా మమ్మల్ని

    చూసారు కదా మమ్మల్ని

    రామారావుగారిని కలుసుకోవాలని చెప్పగానే సెక్యూరిటీ వాళ్లు నన్ను చెక్‌ చేసి పంపించారు.రామారావుగారి ముందుకెళ్లి నిలుచుని ‘నమస్కారం సార్‌' అని రెండు చేతులెత్తి నమస్కారం పెట్టా. ఆయన ఒక్కక్షణం పాటు ఎవరా అని చూసి, ‘ఆ.. ఆ... గుర్తుపట్టాం బ్రదర్‌. హౌ ఆర్‌ యు. విన్నాం మీ గురించి. చాలా మంచి యాక్టర్‌ అవుతున్నారని. ఆరోగ్యమే మహాభాగ్యం. చూశారు కదా మమ్మల్ని. ఎంత ఆరోగ్యంగా ఉన్నామో. కీప్‌ గుడ్‌ హెల్త్‌. గాడ్‌ బ్లెస్‌ యు' అని భుజం తట్టారు అంటూ ఆ రోజు సంఘటన గుర్తు చేసుకున్నారు కోట. ఎన్టీఆర్ కు గబుక్కున వంగి ఆయన కాళ్లకు దణ్ణం పెట్టి అక్కడి నుంచి వచ్చేశా.

    ఆయనతో నాకు వైరం ఏమిటండి

    ఆయనతో నాకు వైరం ఏమిటండి

    ‘అదేమిటయ్యా.. అలా వెళ్లావు...ఆయన కొట్టుంటే?' అనడిగారు విజయచందర్‌. ఆయన పక్కనున్న వాళ్ల మొహాల్లోనూ అదే సందేహం కనిపించింది.‘‘దిక్కుమాలిన వాళ్లందరితో రోజూ తిట్లు తినే బదులు, పెద్దాయనకి ఎదురెళ్లడమే కరెక్ట్‌ అండీ. ఆయనకి నిజంగా నా మీద కోపం ఉందనుకోండి... లాగి ఒక్కటి పీకేవారు. దాంతో అకౌంట్‌ క్లోజ్‌ అయ్యేది. ఈ రంగంలో నాకంటూ ఎవరూ లేరు. అలాంటి మహానుభావుడితో నాకు వైరం ఏంటండీ. ' అని చెప్పుకొచ్చారు కోట.

    నేను ఎక్కడ దొరుకుతానా అని..

    నేను ఎక్కడ దొరుకుతానా అని..

    ‘మండలాధీశుడు' విడుదలైన రెండో రోజో, మూడో రోజో అది... నాకు సరిగా గుర్తులేదు. ఆ చిత్రంలో నేను ఎన్టీఆర్‌గారిని అనుకరిస్తూ నటించానని అప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఆయన అభిమానులు నా మీద కారాలు, మిరియాలు నూరుతున్నారు. నేను ఎక్కడ దొరుకుతానా అని ఎదురుచూస్తున్నారు. ఆ విషయం నా చెవిన కూడా పడింది. ఎందుకైనా మంచిదని నా జాగ్రత్తలో నేనున్నాను అన్నారు కోట.

    ఇద్దరం వేర్వేరు రైళ్లలో..

    ఇద్దరం వేర్వేరు రైళ్లలో..

    ఇటువంటి నేపథ్యంలో ఒకసారి రామారావుగారు బెజవాడలో కల్యాణమంటపం ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆ ముహూర్తం పూర్తయ్యాక తిరిగి రైల్లో హైదరాబాద్‌కి ప్రయాణమయ్యారు. ఆయన ఎక్కిన రైలు ఆ స్టేషనలో బయలుదేరే సమయానికి నేనున్న రైలు బెజవాడ స్టేషన్‌కి చేరుకుంది. ఎదురెదురు ప్లాట్‌ఫామ్‌ల మీద రెండు రైళ్లున్నాయి. ఆయనది బయలుదేరింది. నేనున్నది స్టేషన్ చేరుకుంది.

    సందడి గురించే..

    సందడి గురించే..

    అప్పట్లో ఎన్టీఆర్‌గారు ఊర్లోకి వచ్చినా, వెళ్లినా అభిమానులతో రైల్వేస్టేషన్ కిటకిటలాడిపోయేది. ఇసకేస్తే రాలదంటారే! అంతమంది జనాలుండేవారు. ఆరోజు కూడా అంతే! చుట్టూ జనం, సైకిల్‌ గుర్తుతో పచ్చజెండాలు, పువ్వుల దండలు, జై జై నినాదాలు... వాతావరణమంతా కోలాహలంగా ఉంది. రైలు నుంచి దిగుతున్నవారు కూడా ఆ సందడి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ‘ఎన్టీఆర్‌గారు హైదరాబాద్‌ బయలుదేరినట్టున్నారు. స్టేషన్ నిండా తెలుగుదేశం పార్టీ వాళ్లే' అని నా ముందున్న వాళ్లు అనుకోవడం నా చెవిలో పడింది. అంతే నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

    నా మీద వాళ్లంతో కోపంగా..

    నా మీద వాళ్లంతో కోపంగా..

    స్టేషన్ నిండా రామారావుగారి మనుషులే. పైగా వాళ్లంతా నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు ట్రైన్ దిగాలా.. వద్దా.. ఒకటే ఆందోళన. వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు కనుక .. ఎవరికంటా పడకుండా బయటపడదామనుకొని మెల్లిగా జనంలో కలిసిపోయా.

    కదలకుండా దిగ్బందనం చేసి..

    కదలకుండా దిగ్బందనం చేసి..

    అయితే నా టైమ్‌ బాగోలేదో ఏమో ఎవడో నన్ను పసికట్టేశాడు. ‘రేయ్‌... అదిగోరా కోటగాడు' అని కేక పెట్టాడు. అంతే. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యారు. కదలకుండా దిగ్బంధనం చేసి, స్టేషన్ వెనక్కి నన్ను లాక్కెళ్లారు. నేనేం చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు. అంతా ఆవేశంతో ఉన్నారు.

    ఆలోచించి ఉంటారనుకోను

    ఆలోచించి ఉంటారనుకోను

    ‘కళాకారుడి మీద చెయ్యి చేసుకోకూడదు. ఇందులో అతని తప్పేమీ లేదు' అని ఒక్కరైనా ఆలోచించి ఉంటారని నేననుకోను. ‘మన అన్నగారిని అనుకరించి, అవమానపరిచాడు. ఇతని అంతు చూడాల్సిందే' అనుకొని అందరూ కలబడి నా మీద తలో చెయ్యీ వేశారు. ఇది నేను ఊహించని ఘటన. నాతో వాదనకు దిగుతారని అనుకున్నాను కానీ, ఇలా కొడతారని ఊహించలేదు.

    ఆయనపై అమితమైన గౌరవం ఉంది

    ఆయనపై అమితమైన గౌరవం ఉంది

    ఇంతలో ఎవరో వచ్చి జోక్యం చేసుకోవడంతో జనం నన్ను వదిలిపెట్టారు. అవమానభారంతో రూమ్‌కి చేరుకున్నా. దారి వెంబడి ఒకటే ఆలోచన. ఇందులో నేను చేసిన తప్పేమిటి? రామారావుగారంటే నాకు అమితమైన గౌరవం ఉంది. నాకు ఇచ్చిన పాత్ర చేశాను తప్ప ఆయన్ని కించపరచాలని అనుకోలేదు. అయినా ఇలాంటి పర్యవసానాల్ని ఆలోచించకుండా చేసేశాను. దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాను.

    పరుచూరి వారితో చెప్పి

    పరుచూరి వారితో చెప్పి

    ఇది జరిగిన కొంతకాలానికి నిర్మాత త్రివిక్రమరావుగారిని వారి ఆఫీసులో కలిశాను. మాటల మధ్యలో ‘ఆకుకూరల ఆనందరావు' అనే ఓ పాత్ర గురించి చెప్పాను. అది ఆయనకు బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్‌ గురించి ఆయన పరుచూరి బ్రదర్స్‌తో చెప్పి చక్కగా డిజైన్ చేయమన్నారు. అలా పుట్టిన పాత్ర ‘కరణం కాసయ్య' అనే హోం మినిస్టర్‌ పాత్ర.

    ఆయన వల్లే..

    ఆయన వల్లే..

    నందమూరి బాలకృష్ణగారు హీరోగా నటించిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌' చిత్రమది. త్రివిక్రమరావుగారు నిర్మించారు. ఆ చిత్రంలోనే కరణం కాసయ్య అనే పాత్ర నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది. మరో విషయమేమిటంటే ‘మండలాధీశుడు' తర్వాత నేను మరలా నందమూరి కాంపౌండ్‌లో చేసిన సినిమా ఇదే! ఆ విషయంలో త్రివిక్రమరావుగారిని సదా గుర్తుంచుకుంటాను.

    నీకేం ఒళ్లు బలిసిందా

    నీకేం ఒళ్లు బలిసిందా


    ‘మండలాధీశుడు' సినిమా చూసి కార్యకర్తలకే కాదు మా బెజవాడ ఎమ్మెల్యే నెహ్రూగారికి కూడా కోపం వచ్చింది. ఒకసారి ఎక్కడో, ప్రాంతం గుర్తులేదు కానీ ఇద్దరం కలిశాం. ‘ఏమయ్యా... నీకేం ఒళ్లు బలిసిందా? రామారావుగారి సినిమా చేశావట? విషయం తెలిసి నీ మీద పీకలదాకా కోపం వచ్చింది.. చంపేద్దామనుకున్నాం'' అని కోపంగా కేకలేశారు.

    అలాంటి పిచ్చి పనులు చెయ్యకు

    అలాంటి పిచ్చి పనులు చెయ్యకు

    అంతలోనే నెహ్రూ తేరుకుని ‘అసలు ఏం చేశావో.. ఎలా చేశావోనని, రాత్రి సినిమా చూశా. చూసిన తర్వాత తెలిసింది. నీ దుంపతెగ... ఎంత బాగా చేశావయ్యా.. అచ్చం పెద్దాయన్ని చూసినట్టు అనిపించింది. అందుకే నిన్ను ఇంకేం అనలేకపోతున్నా. ఇప్పటికైతే చేస్తే చేశావు? సరే... ఇంకెప్పుడూ అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయబాక. నీ వేషాలు నువ్వు జాగ్రత్తగా వేసుకో' అని అన్నారు. ఆయన మాటల్ని కూడా అంత తేలిగ్గా మర్చిపోలేనండీ అంటూ చెప్పుకొచ్చారు కోట శ్రీనివసరావు.

    English summary
    'Mandaladeesudu' is one film which is always special to Kota Srinivasa Rao for many reasons. Sharing his thoughts about the controversial flick.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X