twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భూ కబ్జా లపై దగ్గుపాటి రానా పోరాటం

    By Srikanya
    |

    హైదరాబాద్ : దగ్గుపాటి రానా తాజా చిత్రం 'కృష్ణం వందే జగద్గురుం'. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా సురభీ నాటక కళాకారుడుగా కనిపిస్తాడు. సురభి నాటక కళాకారుడైన బీటెక్ బాబుకు కోపం ఎందుకొచ్చింది అనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం. గతంలో హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమండలాన్నంతటినీ కబ్జా చేశాడు. దాంతో దేవుడు వరాహునిగా అవతరించి వాడ్ని చంపాడు. ఇప్పుడు వాడ్ని మించిన భూబకాసురులు సందుకొకళ్లు. అంటే మళ్లీ దేవుడి ఎంట్రీ అవసరం. సంభవామి యుగే యుగే... అని గీత సాక్షిగా మాటిచ్చేశాడు కాబట్టి తప్పక వస్తాడు. అయితే ఎలా వస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానమే 'కృష్ణంవందే జగద్గురుమ్'.

    మణిశర్మ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను వచ్చేనెల మొదటివారంలో విడుదల చేయడానికి నిర్మాతలు జాగర్లమూడి సాయిబాబా, వై.రాజీవ్‌రెడ్డి, సన్నాహాలు చేస్తున్నారు. విజయదశమి కానుకగా ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రానా పాత్ర చిత్రణ విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రను నయనతార పోషిస్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్య చుట్టూ తిరిగే ఈ కథకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని జోడించి, సామాజికస్పృహను కలిగించే విధంగా దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది.

    ఈ చిత్రం లో క్యారెక్టర్ గురించి హీరో రాణా మాట్లాడుతూ...నా పేరు బాబు. చదువు బీటెక్‌. ఈ మాత్రం చదువుకొంటే చాలు... ఓ మంచి ఉద్యోగం సంపాదించేసి, హాయిగా జీవితాన్ని గడిపేద్దాం అనుకొంటారు. కానీ బాబు అలా కాదు. ఏసీ గదుల్లో కూర్చుంటూ నెలకు వచ్చే నాలుగంకెల జీతంతో సంతృప్తి పడలేదు. అతని లక్ష్యం వేరే ఉంది. అదేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు రాణా. దర్శకుడు చెబుతూ ''కృష్ణుడికీ ఈ కథకూ సంబంధం ఏమిటనేది సస్పెన్స్‌. 'గమ్యం'లోని గాలి శీను, 'వేదం' సినిమాలోని కేబుల్‌రాజు వీరిద్దరికన్నా మా బీటెక్‌ బాబు మహా మాస్‌. రానా పక్కన నయనతార హీరోయిన్ నటిస్తోంది''అన్నారు.

    ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్‌ బాబు మాస్‌ అయితే దేవిక క్లాస్‌. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు. బ్రహ్మానందం, మిలింద్ గునాజీ, నాగినీడు, 'సత్యం'రాజేష్, హేమ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: వీఎస్ జ్ఞానశేఖర్, నిర్మాణం: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్.

    English summary
    
 Rana, Nayanthara starring 'Krishnam Vande Jagadgurum' movie directed by Krishh is in production stage. Currently the film shooting is going on in Hydeerabad. The movie will be release on Vijaya Dasami.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X