twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధ్రువ ఫంక్షన్‌లో కెటిఆర్: నాన్న మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్, రామ్ చరణ్...

    రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన ద్రువ సినిమా ప్రీ రిలీజింగ్ పంక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావుతో పాటు తెలంగాణ మంత్రులు కెటి రామారావు, తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు.

    By Pratap
    |

    రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన ద్రువ సినిమా ప్రీ రిలీజింగ్ పంక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావుతో పాటు తెలంగాణ మంత్రులు కెటి రామారావు, తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. ఈ ఫంక్షన్‌లో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

    ధ్రువ ప్రీ రిలీజింగ్ ఫంక్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాదులో జరిగింది. నాన్న మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్ అని చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ కెటిఆర్ - రామ్ చరణ్ తేజను మెగా పవర్ స్టార్‌గా అభివర్ణించారు. ఈ మాటలన్న సమయంలో మెగా అభిమానులు హర్షధ్వానాలు చేశారు.

    చరణ్‌లో మంచి ప్రతిభ ఉందని, చరణ్‌ నటించిన అన్ని సినిమాలూ చూశానని కెటిఆర్ అన్నారు. ధ్రువ రామ్ చరణ్ తొమ్మిదో సినిమా అని, తొమ్మిది ఆయన లక్కీ నెంబర్‌ అని చెప్పారు. ధ్రువ సినిమా కూడా 9వ తేదీనే వస్తోంది కాబట్టి ఆయనకు మంచి విజయం దక్కుతుందన్న నమ్మకం ఉందని కెటిఆర్ అన్నారు.

    నాక్కూడా అలా ఉండాలనిపిస్తోంది...

    నాక్కూడా అలా ఉండాలనిపిస్తోంది...

    ధ్రువ సినిమాలో చరణ్‌ లుక్‌ చూస్తే తనకు కూడా అలా ఫిట్‌గా ఉండాలనిపిస్తోందని మంత్రి కెటిఆర్ అన్నారు. చరణ్‌కి సిక్స్‌ప్యాక్‌ కావాలని, తనకు రెండు ప్యాకులు చాలు అని ఆయన అన్నారు.

    అక్కడికి మనం కూడా వెళ్దామా..

    అక్కడికి మనం కూడా వెళ్దామా..

    ధ్రువ సినిమా సక్సెస్‌ మీట్‌ విశాఖపట్నంలో నిర్వహించాలని సోదరుడు గంటా శ్రీనివాసరావు సూచించారని, తాను అక్కడికి వస్తానని అన్నారు. మనమంతా అక్కడికి వెళ్దామా అని ప్రేక్షకులను ఉద్దేశించి ఆయన అడిగారు. దాంతో ప్రేక్షకుల నుంచి పెద్ద యెత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

    అరవింద స్వామి కెటిఆర్ కామెంట్..

    అరవింద స్వామి కెటిఆర్ కామెంట్..

    సినీ నటుడ అరవింద స్వామిపై కెటి రామారావు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ముంబై, రోజా సినిమాలు చూశానని, ఆ సినిమాల్లో అరవింద స్వామి ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారని ఆయన అన్నారు. ఆ రహస్యమేమిటో చెప్పాలని ఆయన అరవింద స్వామిని అడిగారు.

    చాలా తేదీలు అనుకున్నామని అరవింద్...

    చాలా తేదీలు అనుకున్నామని అరవింద్...

    నిర్మాత అల్లు అరవింద్‌ ధ్రువ ప్రీ రిలీజింగ్ ఫంక్షన్‌లో మాట్లాడారు. ‘ధృవ' రిలీజ్‌ కోసం చాలా డేట్లు అనుకొన్నామని, డిసెంబరు 9 సరైనదా, కాదా? అంటూ చాలా సందేహపడ్డామని చెప్పారు. ‘ధృవ' అడ్వాన్సు బుకింగ్‌లు మొదలవ్వగానే విపరీతమైన ఆదరణ కనిపించిందని చెప్పారు. అప్పటి నుంచీ ధైర్యంగా ఉన్నానని అన్నారు.

    ప్రయాణమే ముఖ్యమని...

    ప్రయాణమే ముఖ్యమని...

    ‘ఫలితం కంటే ప్రయాణం ముఖ్యం. ఆ ప్రయాణాన్ని ఆస్వాదించా. మరీ ముఖ్యంగా చిరు స్టీమ్‌ దోశ రుచుల్నీ చూశా. తమిళంలో ‘తని ఒరువన్‌' మంచి విజయాన్ని అందుకొంది. అదే ఫలితం తెలుగులోనూ వస్తుందన్న నమ్మకం ఉంది' అని అరవింద స్వామి అన్నారు.

    పేరులోనే వైబ్రేషన్ ఉందని గంటా

    పేరులోనే వైబ్రేషన్ ఉందని గంటా

    ‘ధృవ' పేరులోనే ఓ వైబ్రేషన్‌ ఉంది. పాటలు, ప్రచార చిత్రాలూ బాగున్నాయి. చరణ్‌ నటనే కాదు..వ్యక్తిత్వమూ చాలా గొప్పది. ఎక్కడా ఈగో ఉండదు. అందరితోనూ కలసిమెలసి ఉంటాడు. ‘మగధీర'లా ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టించాలి' ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు.

    English summary
    Telanagana IT miister KT Rama Rao termed Dhruva hero Rama Charan Tej as Mega Power star.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X