twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌ కే కాదు గతంలో ఆమె మహేష్ కి కూడా ఇబ్బంది, అరెస్టు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆఫీస్ ఎదుట ఓ మహిళ బైఠాయించిన సంగతి తెలిసిందే. ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఇలా చేయటం ఇదే తొలిసారి కాదని, ఇంతకు ముందు కూడా సినీ నటుడు మహేష్ బాబు ఇంటి ముందు, మరో ప్రెవేట్ ఆఫీస్ ముందు ఇలాగే ఆందోళన చేసినట్లు గుర్తించారు.

    పవన్‌ కల్యాణ్‌ను కలవాలంటూ హైదరాబాద్‌ కొండాపూర్‌కు చెందిన మిరియాల జ్యోతి.. జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో ఉన్న పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం ముందు బైఠాయించారు.

    పవన్‌ కల్యాణ్‌ ఇంట్లో లేరని, నెలరోజుల వరకూ రారని కార్యాలయ భద్రతా సిబ్బంది చెప్పినా ఆమె పట్టించుకోకుండా అక్కడే ఉండిపోయారు. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో పవన్‌ కార్యాలయ సిబ్బంది జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచార మందించారు.

    Lady Fan Creates Ruckus At Pawan and Mahesh's House

    అక్కడికి చేరుకున్న మహిళా కానిస్టేబుల్‌ స్వప్నపై మిరియాల జ్యోతి దురుసుగా ప్రవర్తించి.. విధులను ఆటంక పరిచారు. దీంతో ఆమెను అరెస్టు చేసినట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు.
    కొండాపూర్‌కు చెందిన జ్యోతి నాలుగు నెలలుగా నందగిరి హిల్స్‌లోని పవన్‌ కళ్యాణ్ నివాసానికి వస్తోంది. అయితే తొలిరోజే సార్ లేరని, నెల రోజుల తర్వాత వస్తారని చెప్పి పంపినా ప్రతిరోజూ ఆమె అక్కడికి వస్తోంది. పవన్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా భద్రతా సిబ్బంది నిరాకరిస్తూ వస్తున్నారు.

    బుధవారం కూడా ఆమె ఉదయం వచ్చి సాయంత్రం వరకు పవన్‌ ఇంటి ముందున్న రోడ్డుపై బైఠాయించింది. తాను పవన్‌ను కలవాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన మీడియాతో జ్యోతి మాట్లాడారు. నాలుగు నెలలుగా పవన్‌ ఇంటి చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు.

    సెక్యూరిటీ, పీఏ ఆయనను కలవకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తాను పవన్‌ అభిమానినని, కష్టాలు ఆయనతో చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని ఆశతో కలిసేందుకు అవకాశం కోరుతున్నట్టు తెలిపింది. పవన్ లేరని ఎంత చెప్పినా వినకుండా రాత్రి 8 గంటల వరకు అక్కడే బైఠాయించింది.

    దీంతో భద్రతా సిబ్బంది డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. దీంతో పోలీసులు వచ్చి రాత్రి పది గంటల ప్రాంతంలో ఆమెను జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారించగా... తన పేరు జ్యోతి అని, కొండాపూర్‌లో ఉంటున్నానని చెప్పింది.

    రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను వారిస్తుండగా.. పోలీసుల తీరుకు నిరసనగా.. ఆమె నడి రోడ్డుపై కూర్చొని ఆందోళన చేసింది. తాను ఎలాంటి న్యూసెన్స్ చేయకపోయినా.. పోలీసులు తన పై దాడి చేశారని.. అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా.. అంటూ ఆరోపిస్తున్న జ్యోతిని సముదాయించి స్టేషన్‌కు తరలించారు.

    English summary
    According to the media reports, a lady named Jyothi from Kondapur, Hyderabad has been visiting Pawan Kalyan's residence over the past four months. She has been trying to meet Pawan to explain him about the problems in her life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X