twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయసుధ ఓటమిపై మంచు లక్ష్మి స్పందన ఇలా..

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ చేతిలో జయసుధ ఓటమి పాలైన నేపథ్యంలో.....ముందు నుండీ జయసుధకు మద్దతుగా ఉంటూ వస్తున్న మంచు లక్ష్మి ప్రసన్న తనదైన రీతిలో స్పందించారు. ‘మా' ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ పోటీ చేస్తున్నందుకే ఆమెకు మద్దతు ఇచ్చామని తెలిపారు. గెలుపొందిన రాజేంద్రప్రసాద్ కు అభినందనలు తెలిపారు.

    తనను మా ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మంచు లక్ష్మి ఆనందం వ్యక్తం చేసారు. సినీ ఆర్టిస్టులు, సినీ కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. మా ఉపాధ్యక్షురాలిగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తానని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.

    ఎన్నికల్లో విజయం సాధించిన రాజేంద్రప్రసాద్ కు అభినందనలు తెలిపారు జయసుధ. రాజేంద్రప్రసాద్ మాదిరి తాను ప్రచారం చేయలేక పోయానని, అయినప్పటికీ తాను 150 ఓట్లు సాధించానని జయసుధ చెప్పుకొచ్చారు.

    తన గురించి మాట్లాడేటపుడు రాజేంద్రప్రసాద్ ఇంకా కామెడీ చేష్టలు చేస్తున్నాడని, అలా చేయడం ద్వారా గౌరవం కోల్పోయాడని జయసుధ విమర్శించారు. ఎవరూ గెలిచినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభ్యున్నతికి తోడ్పడాలన్నదే తన కోరిక అని జయసుధ చెప్పుకొచ్చారు.

    Lakshmi Manchu

    మా ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకుగాను, 394 ఓట్లు పోలయ్యాయి.
    అధ్యక్షుడు: గద్దె రాజేంద్రప్రసాద్... 85 ఓట్లతో ఆధిక్యం విజయం
    ఉపాధ్యక్షులు: మంచు లక్ష్మి (ఏకగ్రీవం)
    కార్య నిర్వాహక కార్యదర్శి : తనికెళ్ల భరిణి...165 ఓట్లతో విజయం(జయసుధ ప్యానెల్)
    ప్రధాన కార్యదర్శి: శివాజీ రాజా... 36 ఓట్ల ఆధిక్యంతో విజయం (రాజేంద్రప్రసాద్ ప్యానెల్)
    కోశాధికారి : పరుచూరి వెంకటేశ్వరరావు... 159 ఓట్లతో విజయం (జయసుధ ప్యానెల్)
    జాయింట్ సెక్రటరీలు: నరేష్, రఘుబాబు (జయసుధ ప్యానెల్)
    ఎగ్జిక్యూటివ్ కమిటీ: బెనర్జీ, బ్రహ్మాజీ, చార్మి, రాజేశ్వర్, ఏడిద శ్రీరామ్, గీతాంజలి, హరినాథ్ బాబు, హేమ, జాకీ, జయలక్ష్మి, కాదంబరి కిరణ్, నర్సింగ్ యాదవ్, రాజీవ్ కనకాల, శ్రీ శశాంక, విద్యాసాగర్ తదితరులు

    English summary
    Tollywood actress Lakshmi Manchu Congratulations to actor Rajendra Prasad for his win.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X